హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ లాంగ్ వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ఈ డేట్‌ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి, ఈసారి సూర్యతో కలిసి ఒక విలక్షణమైన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాను ప్రేక్షకు ముందుకు తీసుకురాబోతున్నారు.
ఈ సినిమాలో సూర్య 40 ఏళ్ల అంతర్జాతీయ పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సరికొత్త లుక్‌లో కనిపించబోతుండగా, సూర్య సరసన యంగ్ బ్యూటీ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది. సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, మరియు భవాని శ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.


