ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యకైనా సైనిక యుద్ధం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఇరాన్ పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలకు పరిష్కారం యుద్ధరంగంలో కాదని, చర్చలు- దౌత్యంలోనే ఉందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు సంభాషణ, దౌత్య మార్గాన్ని అనుసరించాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించేందుకు శాంతియుత పరిష్కారం అవసరమని వ్యాఖ్యానించారు. భారత్ ఎప్పటినుంచో శాంతి, సంభాషణ, దౌత్యానికి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచంలో యుద్ధాల వల్ల మానవ నష్టం పెరుగుతుందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.


