My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

మేం ఖతార్‌ మాదిరి కాదు.. ఇజ్రాయెల్‌కు పాకిస్థాన్‌ వార్నింగ్‌

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం  సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిపై పాకిస్థాన్‌ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు చేసింది. తాము ఖతార్ మాదిరి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నది. టెహ్రాన్‌లోని పాకిస్థాన్‌ ఎంబసీకి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయానికి, అధికారులకు ఎలాంటి హాని […]

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం  సమీపంలో వైమానిక దాడి జరిగింది. ఈ దాడిపై పాకిస్థాన్‌ తీవ్రంగా స్పందించింది. దాడికి పాల్పడిన ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరికలు చేసింది. తాము ఖతార్ మాదిరి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నది. టెహ్రాన్‌లోని పాకిస్థాన్‌ ఎంబసీకి అత్యంత సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయానికి, అధికారులకు ఎలాంటి హాని జరగలేదు. కానీ సమీపంలోని పలు భవనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు అధికార వర్గాల సమాచారం. అమెరికా- ఇరాన్‌ల మధ్య సంధి కోసం ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దాడి జరగడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనిపై పాకిస్థాన్‌ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము ఖతార్‌ మాదిరి కాదనే విషయాన్ని ఇజ్రాయెల్‌ గుర్తుపెట్టుకోవాలని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని పాకిస్థాన్‌ హెచ్చరించింది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్‌గానీ, అమెరికాగానీ ఇంకా స్పందించలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.