తెలంగాణ భారతదేశంలో అంతర్భగం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నారని అన్నారు. జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్ నడిబొడ్డున అని ఇది తెలంగాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమకాదని తెలియజేశారు. ఇప్పుడు విమర్శించే గొంతుకలు 2007 లో లేవని, ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించేవారు తిరగలేదని అన్నారు. మీ అయ్య జాగీరా తెలంగాణ అని మీరు ఎవరు నన్ను బెదిరించడానికి అని ప్రశ్నించారు.
మీరు చేసే తాటాకు చప్పుళ్లకు మేం బెదరం అని బెదిరించేవారికి ఒకటే చెబుతున్నానని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఎపి ప్రజలపై విద్వేషం లేదని పవన్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతారని కొందరు అడుగుతున్నారని, నా ఇంటి అడ్రస్ చెప్పడానికే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టానని, కెసిఆర్ గురించి 12 ఏళ్లలో ఎప్పుడైనా మాట్లాడానా? అని ప్రశ్నించారు. తెలంగాణ నేతల మీద కూడా మాట్లాడలేదని, నన్ను వైసిపి వాళ్లు బెదిరించారు కానీ, తెలంగాణవాళ్లు బెదిరించలేదని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లు ఎమ్మెల్యేలయ్యారని, పదవుల్లో కూర్చున్నారని, నేను అమిత్ షా తో మాట్లాడింది నాగేశ్వర్ విన్నారంటా ఆయన ఏదేదో మాట్లాడితే నేను తప్పుపట్టానని చెప్పారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే పవన్ కల్యాణ్ కారణమా? అని పవన్ ప్రశ్నించారు.


