ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై టిపిసిసి ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడి పవన్ ను ఆదరిస్తామని, రాజకీయ నాయకుడి విభేదిస్తామన్నారు. పవన్ ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి అని, నటుడిగా ఆయనను ప్రజలు అభిమానిస్తారని, రాజకీయ నాయకుడిగా వ్యతిరేస్తామన్నారు. పవన్ ఎపికి డిప్యూటీ సిఎంగా సేవలందిస్తున్నారు. ఆయన వెనక ఉండి ఎవరో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.


