టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ని నిర్వహించారు. ఇందులో రాయల్ లుక్‌లో కనిపించారు. తిరుమలలో జరగనున్న ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి బెల్లంకొండ కుటుంబంలో జరగనున్న ఈ పెళ్లి వేడుక టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.


