కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తమకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ ను చర్చకు రమ్మంటారని, వస్తే అరెస్ట్ చేస్తారని, తెలంగాణ భవన్ కు మంత్రి జూపల్లి వస్తానని ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. జూపల్లి తక్షణమే రాజీనామా చేయాలని, నిన్నటి వరకు రూ.8 లక్షల కోట్లు అప్పు అన్నారని, ఇవాళ రూ. 7 లక్షల కోట్లు అప్పు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై జూపల్లి వద్ద సరైన సమాచారం లేదని, హామీలు అమలు చేయటమంటే తమపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డ్డారు. సవాల్ స్వీకరించిన జూపల్లి తోకముడిచారని, ప్రభుత్వ, గురులకుల పాఠశాల టెండర్లలో అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు.
టెండర్ల అవినీతిపై చర్చకు రావాలని ప్రవీణ్ కుమార్ ఆహ్వానించారని, హరీష్ రావుతోనే చర్చిస్తామని అన్నారని, తన షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకుని వచ్చానని చెప్పారు. చర్చకు వస్తుంటే పోలీసులు తనను ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, ప్రభుత్వం తోకముడిచిందని, టెండర్లలో అవినీతి జరిగింది కాబట్టే చర్చకు భయపడుతున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని విడిచిపెట్టం ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారని తెలంగాణ భవన్ కు వచ్చేందుకు జూపల్లి ఎందుకు బయపడుతున్నారని జూపల్లిని సిఎం రేవంత్ రెడ్డి తిట్టారా? అని మొట్టికాయలు పడ్డాయా అని రాజీనామా చేయాల్సి వస్తుందని జూపల్లికి భయం వేసిందా? అని ప్రశ్నించారు. జూపల్లి దొరికిపోయారు, అందుకే మొహం చాటేసి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

































