విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నా రు. ఈ ప్రముఖ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్లో పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకున్న ఈ జంట, అక్కడి లగ్జరీ వేదిక మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎంపిక చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సాంప్రదాయ వేడుకగా ఈ వివాహాన్ని అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు. కృష్ణ పోలూరు దర్శకుడు. కె.వి.శ్రీరామ్ నిర్మాత. ఫిబ్రవరి 27న జి5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని హైదరాబాద్‌లో మీడియాకు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ నా కెరీర్‌కి ఈ పాత్ర మైలురాయి లాంటిది. ఇందులో నా పాత్ర తీరుతెన్నులు, మాడ్యులేషన్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట వెడ్డింగ్ సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ కుమారుడు, టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ -నయానికా రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. అల్లు వారి ఇంట ఇప్పటికే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అల్లు ఫ్యామిలీ సంప్రదాయబద్దంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిస్తూ అందరినీ వివాహానికి ఆహ్వానిస్తుంది. తాజాగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సెలబ్రేషన్స్ కొనసాగుతున్నా యి. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తాజాగా కె.వి. రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు కె రాఘవేంద్రరావు, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి
అల్లు కుటుంబంలో శుభకార్యం సందడి మొదలైంది. అల్లు శిరీష్ తాను ప్రేమించిన నయనికతో మార్చి 6న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వెడ్డింగ్ కార్డుల పంపిణీతో పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025కు సంబంధించి జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జీవో విడుదల చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం సన్ ఆఫ్. బత్తుల సతీష్ దర్శకత్వం. ఈ నేపథ్యంలో గురువారం ఊసులాడే అనే పాటను విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి రిషి ఎం సంగీతాన్నందించారు. ఆదిత్య, సమీర భరద్వాజ్ ఆలపించారు. ప్రేమబంధంలోని మధురానుభూతులకు అద్దం పట్టే గీతమిదని దర్శకుడు తెలిపారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ కథలో చక్కటి సందేశం ఉంటుందని హీరో పేర్కొన్నారు. మీరారాజ్, వినోద్‌కుమార్,
మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజా శివాజీ గురించి కీలక ప్రకటన చేశాడు. శివాజీ జయంతి సందర్భంగా అతడికి నివాళులు అర్పిస్తూ, చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తూ, ఈ చిత్రానికి
మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబియు) ఛాన్సలర్ మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనితో పాటు వివాదానికి సంబంధించిన అనుబంధ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. కిడ్నాప్
అజయ్ దిషన్, ధనుషా జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ బూకీ. సునీల్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. గణేశ్‌చంద్ర దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. ఈ నెల 20న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ సాంకేతికంగా అన్ని విధాలా సినిమా సమర్ధనీయంగా ఉంటుంది.
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందనే టాక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినీ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్ లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా పెళ్లి వేడుక జరపాలని
టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని విశ్వంభర ట్రైలర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. విశ్వంభర
తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. ఈ విషయాన్ని భువనేశ్వరి తెలియజేశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్, కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది.
యంగ్ హీరో రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు), టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్‌లో రూపొందుతున్న సరికొత్త చిత్రానికి ఏమో ఏమో ఇది అనే క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ద ఫస్ట్ బ్రీజ్ పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు హిట్ సిరీస్, సైంధవ్ వంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లతో మెప్పించిన
శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రాన్ని జీవీకే తెరకెక్కించారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మూవీ టీమ్
మెగాస్టార్ చిరంజీవి ఇంట మరోసారి పండగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి కవల పిల్లలకు జన్మనివ్వగా, ఈ పిల్లలకు నామకరణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన మనవడు, మనవరాలి పేర్లను ప్రకటిస్తూ ఆ పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగా కవలలకు శివ
శ్రీనాథ్ మాగంటి హీరోగా నటిస్తున్న చిత్రం మెన్షన్ హౌస్ మల్లేష్. బాల సతీష్ దర్శకుడు. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో విశ్వక్‌సేన్, దర్శకుడు తరుణ్‌భాస్కర్ ఆవిష్కరించారు. రూటెడ్ కథాంశంతో సహజత్వానికి దగ్గరగా అనిపించే చిత్రమిదని, విభిన్న కథగా ఆకట్టుకుంటుందని హీరో శ్రీనాథ్ మాగంటి తెలిపారు. అద్భుతమైన కథ ఇదని, ఆర్టిస్టులందరూ సూపర్ పర్‌ఫార్మెన్స్ కనబరిచారని విశ్వక్‌సేన్ అన్నారు. వినోదంతో పాటు
లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం సతీలీలావతి. తాతినేని సత్య దర్శకత్వం. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో మార్చి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శకనిర్మాతల సపోర్ట్ వల్లే
టాలీవుడ్ యువ నటులు అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం హుషారు పిట్టలు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ ఫిలింస్ విడుదల చేస్తుండగా. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా మారారు. తన మెడికల్ డిగ్రీని (ఎంబిబిఎస్) విజయవంతంగా పూర్తి చేసిన శ్రీలీల తాజాగా కాన్వోకేషన్ వేడుకలో మెడిసిన్ పట్టాను అందుకుంది. నిజానికి శ్రీలీల తన తల్లి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత గారిని స్ఫూర్తిగా తీసుకుని మెడిసిన్ వైపు అడుగులు వేశారు. గత ఏడాది
మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా ఇప్పుడు తన జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన మొదటి సినిమా నుంచి వచ్చే రెమ్యునరేషన్‌తో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభిస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాధారణ జీవితం నుంచి సినీ రంగం వరకు ఆమె చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారింది. ప్రయాగ్‌రాజ్‌లో
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో, 3డ్ ఫార్మాట్‌లో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ క్రీస్తుశకం 985 నాటి పరాక్రమవంతుడైన యోధుడిగా
విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఫంకీ. అనుదీప్ కేవీ దర్శకత్వం. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. తిరుపతిలో ఈ సినిమాలోని యమ యమ్మ అనే గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని దేవ్ పవార్ రచించారు. హుషారెత్తించే మాస్ బీట్‌తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. నిజమేనా నువ్వేనా, నా కల్లోకొచ్చి కన్నే కొట్టావా.. నా చిలకమ్మా రావమ్మా, ఈ జన్మే నీదమ్మా..నువ్వే
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కాలినడకన తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత తిరుమలకు చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి బండ్ల గణేశ్ తిరుమలకు చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాత్రను పూర్తి చేయడం చాలా
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ వరుస చిత్రాలతో బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు గాయపడ్డ సింహం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి కథానాయికలుగా నటించారు. దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కలిపిన విడుదల చేశారు. కామెడీ, వ్యంగ్యం, యాక్షన్ అంశాలను కలగలిపి
విష్వక్ సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ రూపొందిస్తున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. అనుదీప్ టేకింగ్, విష్వక్ కామెడీ టైమింగ్ నవ్వులు పంచుతోంది. ప్రేమ, వినోదంతో కూడిన ఓ కుటుంబ కథతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులూ కడుపుబ్బా నవ్వుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం
టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పంచాయితీ సెక్రటరీ అయిన శ్రీరామ్ నీతి, నిజాయితీ అంటూ బ్రతుకుతుంటాడు. అయితే అతడి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన సంఘటనలు ఏంటి.. అతడిని పోలీసులు, రౌడీలు ఎందుకు వెతుకుతుంటారు
అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సీతా పయనం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించగా, అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. అలాగే
టాలెంటెడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా వస్తున్న తాజా చిత్రం గాయపడ్డ సింహం. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, సప్త అశ్వ మీడియా వర్క్‌స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే, అమెరికా వెళదాం అనుకున్న
పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 నూతన సంవత్సర కానుకగా జనవరి 1న అధికారికంగా ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు
దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి
మాధవ్ భూపతి రాజు హీరోగా డెబ్యూ ఇస్తున్న చిత్రం మారెమ్మ. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి మాచర్ల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తుండగా, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. బోనాలు,
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన ఉదారతను చాటుకుంటూ ఆదర్శంగా నిలిచాడు. చెన్నైలోని టి.నగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న పద్మ అనే మహిళ తనకు దొరికిన 45 తులాల బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ బంగారం ఒక నగల వ్యాపారికి చెందినదిగా పోలీసులు నిర్ధారించి బాధితులకు అప్పగించడంతో పద్మ నిజాయితీ వార్తల్లో నిలిచింది. ఇక పద్మ చూపిన అసాధారణ
భారతీయ సినీ సంగీత రంగంలో మరో దిగ్గజం అస్తమించింది. తన మధురమైన స్వరాలతో దశాబ్దాల పాటు సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ వెంకటేశ్ (70) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ వార్తతో సినీ పరిశ్రమలో విషాద వాతావరణం నెలకొంది. ఎస్పీ వెంకటేశ్ సినీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
ఏగన్, ఫెమినా జార్జ్, కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం హైకూ కేరళలో ప్రారంభమైంది. యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ సినిమా హౌస్ పతాకంపై డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు. వినూత్న కథాంశంతో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నవతరం ప్రేమకథ ఇదని మేకర్స్ తెలిపారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం
టాలీవుడ్ మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన కొణిదెల దంపతులు కవలలకు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక మగ శిశువుకు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో కొణిదెల కుటుంబం, కామినేని కుటుంబం ఆనందంలో మునిగిపోయాయి. మెగా అభిమానులు డబుల్ జాయ్ అంటూ సంబరాలు జరుపుకుంటున్నారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి నయనికను ఈ ఏడాది మార్చిలో పెళ్లి చేసుకోనున్న శిరీష్, పెళ్లికి ముందే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాడు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులతో కలిసి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మార్చిలో జరిగే వివాహానికి ముందు
హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా భగవంతుడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్.1గా నిర్మిస్తున్నారు రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవు తున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా
హీరో వంశీ తుమ్మల నటిస్తున్న చిత్రం శ్రీ చిదంబరం గారు. సంధ్యా వశిష్ట కథానాయిక. దర్శకుడు వినయ్ రత్నం. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.మెల్లకన్ను కారణంగా తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కళ్ళద్దాలు ధరించే కథానాయకుడు, ఒక అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత తన బలహీనతను ఎలా అధిగమించాడనేది ఈ సినిమా ప్రధానాంశం. వంశీ తుమ్మల ఈ పాత్ర
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ. మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి గాబరా గాబరా లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా, ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేశారు.
దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శబర. మిషా నారంగ్ కథానాయిక. కిలారు ప్రేమ్ చంద్ దర్శకత్వం. ఒక ఇంటెన్స్ పవర్‌ఫుల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ భగత్, రాజీవ్ గోవింద పిళ్ళై, కృతికా సింగ్ యాదవ్, భూషణ్ కళ్యాణ్, ఆరుష్, ప్రమోదిని వంటి పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షిత చదలవాడ,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం భగత్ సింగ్. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ రాసిన పవర్‌ఫుల్ డైలాగులకు పవన్ తనదైన శైలిలో గొంతును అందించబోతుండటం హైలైట్‌గా
ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం దేవర బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, ఓపెనింగ్స్ నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోయింది. ఈ విజయంతోనే దేవరకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు అప్పటినుంచి అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. నిర్మాతల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. దేవర నిర్మాతలలో ఒకరైన మిక్కిలినేని
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అయ్యప్ప స్వామి మాలధారణలో రవితేజ అయ్యప్ప మాలధారణలో ఇరుముడికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ సినిమాలో ఎమోషనల్‌గా, డీప్‌గా చూపించబోతున్నారని సమాచారం. సెన్సిటివ్, క్లాస్ కథనాలతో పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈసారి డివోషనల్ టచ్‌తో కథను తెరకెక్కిస్తుండటం తో అంచనాలు మరింత
యంగ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓ సుకుమారి. ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన తిరువీర్ భరత్ భూషణ్ డైరెక్షన్‌లో సినిమాను ప్రకటించాడని తెలిసిందే. తాజాగా తిరువీర్ పోషిస్తున్న లుక్‌ను షేర్ చేశారు. ఇందులో యాదగిరి పాత్రలో నటిస్తున్నాడు తిరువీర్. కర్లీ హెయిర్‌తో లుంగీ, బనియన్ మెడలో టవాల్‌తో బ్రష్ వేసుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ న్యాచురల్‌గా
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ లాక్‌డౌన్ ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. ఏఆర్ జీవా దర్శకత్వం. ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా, తమిళనాడులో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు మరియు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతి నిరీక్షణ వెనుక
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కేరళతో పాటు సౌత్ ఇండియా అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. L366 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత
తెలుగు చలనచిత్ర చరిత్రలో మరో అద్భుతమైన దృశ్యకావ్యం ఆవిష్కృతం కాబోతోంది. స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు గారు రచించిన తెలంగాణ సాయుధ పోరాట గాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం గొల్ల రామవ్వ. ప్రముఖ దర్శకుడు ముళ్ళపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 25 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లో ప్రసారం కాబోతుంది. తాజాగా జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో పలువురు
దిగ్గజ గాయని ఎస్.జానకి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) కన్నుమూశారు. మురళీకృష్ణ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రముఖ గాయని కె.ఎస్.విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేవలం గాయని కుమారుడిగానే కాకుండా, మురళీకృష్ణకు కళారంగంతో విడదీయలేని అనుబంధం ఉంది. భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉన్న ఆయన నటుడిగా కూడా తన ముద్ర వేశారు. తెలుగులో వినాయకుడు,
రాజీవ్ కనకాల కీ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ఆత్రేయపురం బ్రదర్స్. రాజేశ్ జగన్నాథం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో గవిరెడ్డి, సన్నీపట్సా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తపు షాట్‌కు వశిష్ఠ క్లాప్ కొట్టగా, విజయ్ కనకమేడల కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్లు ప్రవీన్ కండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కు అందజేశారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి. ఈ సినిమాను 2027లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం వారణాసి సినిమాను 2027 ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, సినిమా
గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చీన్ టపాక్ డుం డుం అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు
ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ ప్రాంఛైజీలో రాబోతున్న సీక్వెల్ ప్రాజెక్ట్ సలార్ 2. సీక్వెల్‌ను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజా టాక్ ప్రకారం సలార్ 2టీజర్ జనవరి 25న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. ప్రస్తుతానికి ఇది అధికారిక వార్త ఏం కాకున్నా అభిమానులు మాత్రం ఈ అప్‌డేట్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ 2లో శృతిహాసన్
హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌పై ఇప్పుడు ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన నటించి ఆకట్టుకుంది ఆషికా రంగనాథ్. అయితే, ఈ వార్తపై ఇంకా అధికారిక అప్‌డేట్ రాలేదు. మరోవైపు శర్వానంద్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలిసింది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాష్ట్ర బీజేపీ సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం, తదుపరి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ప్రధానంగా ఆకట్టుకునేలా రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచే హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తూ, అద్భుతమైన వసూళ్లతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.292 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ట్రేడ్
ప్రముఖ నటి శారదకు అరుదైన గౌరవం దక్కింది. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన అమూల్యమైన సేవలను గుర్తించిన కేరళ ప్రభుత్వం, రాష్ట్రంలోని అత్యున్నత సినీ పురస్కారమైన జేసీ డేనియల్ అవార్డుఉ2024కు శారదను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ వెల్లడించింది. జేసీ డేనియల్ అవార్డు అనేది కేరళలో సినిమారంగంలో జీవితకాల సేవలకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం. ఈ అవార్డు కింద
విజయ్ సేతుపతి హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. పూరి స్టైల్ మాస్ నేరేటివ్‌కి, విజయ్ సేతుపతి పవర్‌ఫుల్ యాక్టింగ్ కలిస్తే ఎలాంటి అవుట్‌పుట్ వస్తుందన్న ఆసక్తి సినీ వర్గాల్లో గట్టిగా కనిపించింది. కనుమ పండుగ సందర్భంగా, అలాగే విజయ్ సేతుపతి పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్
రవితేజ నటించిన తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వం. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈనెల13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మీట్ నిర్వహించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. మా హీరో
హాలీవుడ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఒకటి. ప్రస్తుతం కాలిఫోర్నియా లోని బెవర్లీ హిల్స్‌లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం (2026) ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో పలువురు హాలీవుడ్ తారలు సందడి చేశారు. బాలీవుడ్ స్టార్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మెరిశారు. భర్త నిక్ జొనాస్ తో కలిసి వేడుకలకు హాజరైన ప్రియాంక అందరి దృష్టిని
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలు. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ డైరెక్టర్ కిషోర్ తిరుమల కథ చెప్పినప్పుడే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలని
తిరుమల శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు సినీ నిర్మాత బండ్ల గణేష్ సిద్ధమయ్యారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలాంటి మచ్చ లేకుండా క్షేమంగా విడుదలవ్వాలని కోరుకుంటూ బండ్ల గణేష్ వేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కోరిక నెరవేరడంతో, ఆ మొక్కును తీర్చుకోవడానికి షాద్‌నగర్ నుండి తిరుమల వరకు మహా పాదయాత్ర చేపట్టాలని ఆయన
తమిళ సూపర్ స్టార్, టీవీకేపార్టీ అధ్యక్షులు దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో నెలకొన్న వివాదానికి తెరదించుతూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. గతంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంలోని కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ,
రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇద్దరి భామల మధ్య నలిగిపోతున్న వ్యక్తిగా రవితేజ తన కామెడీతో తెగ నవ్విస్తున్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తోన్న మేరే రహో సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ఫైనల్ చేశారన్న వార్త బయటకు వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం మేరే రహో చిత్రాన్ని జులై రెండో వారంలో విడుదల చేయబోతున్నారట. రిలీజ్ డేట్‌పై మేకర్స్
సుమంత్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం గోదారి గట్టుపైన. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్‌కు ఇది ఫస్ట్ వెంచర్. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ గోదావరి అంటే జస్ట్ ఒక ప్రాంతం కాదు. అది ఒక కల్చర్ ఎమోషన్. ఒక కిటికీ నుంచి పల్లెటూరిని చూసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. మీరు టికెట్ కొని
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మాతగా, జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ ఎంటర్టైనర్ ధర్మస్థల నియోజకవర్గం. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. సీనియర్ నటులు సాయికుమార్, సుమన్ లతో పాటు వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకత్వం. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని వామ్మో.. వాయ్యో అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా తనదైన మాస్ బీట్స్‌తో స్వరపరిచిన ఈ పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించగా, స్వాతిరెడ్డి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా, మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ
ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రంతో వినోదాల విందును పంచడానికి సిద్ధమవుతున్నారు నవీన్ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నది. ఈ సందర్భంగా మంగళవారం రాజుగారి పెళ్లి రిసెప్షన్ వేడుక్ణ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో నాయకానాయికలు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నూతన వధూవరుల గెటప్‌లో వేదికపై సందడి చేశారు. నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ది రాజా సాబ్. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విడుదలకు మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నూతన సంవత్సరం సందర్భంగా ప్రభాస్ అభిమానులకు చిత్ర యూనిట్
యష్ హీరో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కియారా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా నయనతార ఫస్ట్‌లుక్‌ను వదిలింది. ఈ సినిమాలో నయనతార గంగా అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో నయనతార లుక్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది.
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడుగా పేరుగాంచిన అన్వేష్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. హిందూ దేవతలు, మత విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి అన్వేష్‌పై ఫిర్యాదు చేశారు. దేవుళ్లను దూషిస్తూ హిందూ ధర్మ భావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పలు
ఎట్టకేలకు మరో ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కామన్, కానీ, దాన్ని నిలబెట్టుకొనేవారు చాలా తక్కువమంది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ లో విజయ్ ఉ రష్మిక చాలా సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. విజయ్ ఇంట్లోనే కేవలం అతికొద్దిమంది బంధుమిత్రుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ తరువాత కూడా విజయ్, రష్మిక దాని గురించి
తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ క్రేజ్ మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఆయన తన సినీ కెరీర్‌లో నటిస్తున్న చివరి చిత్రం కావడంతో జన నాయగన్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మలేషియాలో నిర్వహించిన మూవీ ఆడియో లాంచ్ వేడుక మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్రను సృష్టించింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని ప్రసిద్ధ బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో డిసెంబర్ 27న జరిగిన
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం. ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో అప్పలసూరి అనే కీలక పాత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోస్టర్‌లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది ఫ్యాన్స్ ముక్కున వేలేసుకున్నారు. తర్వాత
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి అసలైన పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మన శంకరవరప్రసాద్ గారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవనుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, తాజాగా సినిమా నుంచి మాస్ అప్‌డేట్‌ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ
వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటించిన చిత్రం కాగితం పడవలు. ఎంజీఆర్ తుకారాం దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్ మరియు నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించారు. టీజర్‌ను శర్వానంద్ లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శర్వానంద్ మాట్లాడుతూ ఎలాంటి సినీ నేపథ్యం
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజా సాబ్. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ముగ్గురు భామలు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అభిమానులకు అందించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక బ్యూటిఫుల్
పతంగ్ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్ చేస్తున్నప్రమోషన్ కంటెంట్, ఆ సినిమా కాన్సెప్ట్ గురించి విని ఇంప్రెస్ అయిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ టీమ్‌ను అభినందించారు. పతంగుల పోటీ నేపథ్యంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సౌత్ ఇండియాలోనే మొదటిసారిగా పతంగ్ టీమ్ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని త్రివిక్రమ్ కోరుకున్నారు. నాకెందుకో ఈ సినిమా బాగా ఆడుతుందని అనిపిస్తుందని త్రివిక్రమ్ ఎంతో పాజిటివ్‌గా మాట్లాడటంతో పతంగ్ టీమ్ సూపర్
ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో అమాయకమైన యువతిగా ఆకట్టుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ మైసా కోసం వెరైటీ అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన యాక్షన్ గ్లింప్స్ సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో రష్మిక కనిపించిన విధానం ఆమె కెరీర్‌లోనే తొలిసారి అని చెప్పాలి. ఒళ్లంతా రక్తం, తెగిపోయిన చేతి
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాక్టర్ శివాజీ మాట్లాడుతూ అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేశాడు. తాజాగా తన స్పీచ్‌పై మరోసారి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు శివాజీ. తనతోపాటు
నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రచార వ్యవహారానికి సంబంధించి సినీ నటి మంచు లక్ష్మి హైదరాబాద్‌లోని సీఐడీ విచారణకు హాజరయ్యారు. లక్డీకపూల్‌లోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను ఈ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు గానూ అందిన పారితోషికం మరియు కమీషన్ల లావాదేవీలపై అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కూడా ఆమెను విచారించగా, ఇప్పుడు సీఐడీ అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. కాగా, ఇదే వ్యవహారంలో
తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన హాస్య బ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రహ్మానందాన్ని ఆప్యాయంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందించి, శాలువతో ఘనంగా సత్కరించారు. ప్రతిగా బ్రహ్మానందం తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి పెన్సిల్ ఆర్ట్ చిత్రాన్ని రాష్ట్రపతికి బహుకరించారు. ఈ ప్రత్యేకమైన బహుమతి రాష్ట్రపతిని
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కు ఘనంగా ముగింపు పలికారు. ముందునుంచి వినిపిస్తున్న అంచనాలు, సోషల్ మీడియాలో సాగిన ప్రచారం, ఓటింగ్ ట్రెండ్స్ అన్నీ నిజమయ్యాయి. కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. చివరి దశకు తనూజ, కళ్యాణ్ మాత్రమే మిగలగా, ఇద్దరికీ నాగార్జున రూ.20 లక్షల ఆఫర్ ఇచ్చారు. అయితే
రవితేజ నటిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్లు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రొమాంటిక్, కామెడి సినిమాగా ఇది రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేశారు. వదిన వాళ్ల చెల్లి అంటే నా వైఫేగా అంటూ రవితేజా తనదైన శైలీలో కామెడీని పండించారు. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకి
బాలీవుడ్ యువ నటీనటులు కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ. ఈ సినిమాకు సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తుండగా, సత్యప్రేమ్ కి కథ చిత్రం తర్వాత కార్తీక్ – సమీర్ కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ , నమః పిక్చర్స్ సంయుక్తంగా
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కృష్ణా జిల్లా గుడివాడలో ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం అక్కినేని కుటుంబం తరుఫున రూ.2 కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ నా తల్లిదండ్రులైన అక్కినేని నాగేశ్వరరావు , అన్నపూర్ణ అక్కినేని జ్ఞాపకార్థం అక్కినేని కుటుంబం ఏఎన్‌ఆర్ కళాశాలలో రూ.2 కోట్లతో స్కాలర్‌షిప్ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిర్ణయం నాతోపాటు నా
సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జమాన. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్, శివకాంత్, శశికాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీశాం. ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఈ సినిమాలో
నందమూరి బాలకృష్ణ హీరోగా హీరోగా నటిస్తున్న చిత్రం అఖండ 2. థియేటర్ల వద్ద రికార్డుల వేట కొనసాగుతుండగానే, ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించే అవకాశం ఉందన్న ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా వెల్లడించడం విశేషం. హైదరాబాద్‌లో నిర్వహించిన అఖండ 2 సక్సెస్ మీట్‌లో ఆయన
కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్ ఇప్పుడు కొత్త దిశగా అడుగులు వేస్తోంది. కాంతార చాప్టర్ 1 చిత్రంలో యువరాణి కనకవతి అనే ప్రతినాయిక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రుక్మిణి, తన కెరీర్‌లో తొలి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన ఆనందాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, కన్నడ చిత్రసీమలకు ఇప్పటికే పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లో
అందాల తార భాగ్యశ్రీ బోర్సే కమర్షియల్ చిత్రాలతో పాటు ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న, విభిన్నమైన పాత్రలు కూడా చేస్తోంది. తాజాగా 1990ల నాటి ప్రొహిబిషన్ కాలం నేపథ్యం, సామాజిక అంశాల ఆధారంగా రూపొందనున్న ఒక మహిళా ప్రధాన చిత్రంలో ఆమె నటించనుంది. ఈ చిత్రంలో ఆమె సామాజిక సవాళ్లతో పోరాడే ఒక నిర్భయ యువతి పాత్ర పోషించనుందట. ఈ పాత్ర ఆమె నటనలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం
యంగ్ హీరో నరేష్ అగస్త్య, అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ గుర్రం పాపిరెడ్డి. మురళిమనోహర్ దర్శకత్వం. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటే ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే
బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె తాజాగా మరో బంపరాఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అమర్ కౌశిక్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి మహావతార్ అనే చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో కథానాయికగా దీపికాను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరుపగా దీపికా కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. పరశురాముడి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ఈ
భారతీయ సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు, సుప్రసిద్ధ దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన దిగ్గజ చలనచిత్రకారుడు వి. శాంతారామ్ జీవితం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన అద్భుతమైన సినీ ప్రయాణం ఆధారంగా బాలీవుడ్‌లో ఒక భారీ బయోపిక్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ బయోగ్రాఫికల్ డ్రామాకు ఆయన పేరునే వి. శాంతారామ్ గా ఖరారు చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టైటిల్ పాత్ర (వి. శాంతారామ్
రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా,
త్రిగుణ్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న హారర్ థిల్లర్ ఈషా. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌ను గమనిస్తే, ఇప్పటి వరకు వచ్చిన రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో ఇదొక ఆసక్తికరమైన పాయింట్‌తో అల్లుకున్న భయపెట్టే కథ అనిపిస్తుంది. సినిమా రెగ్యులర్ హారర్ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా కనిపిస్తుంది. మీరు ఊహించని చీకటి ప్రపంచం మరొకటి ఉంది అని ట్రైలర్ ఆసక్తికరంగా
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా వారి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్ చైర్మన్ సంజరుకిషోర్ నిర్వహణలో సావిత్రి జయంతి మహౌత్సవం అత్యంత వైభవంగా జరిగింది.సావిత్రి ఫొటోలతో అందంగా తీర్చిదిద్దిన వేదిక పై జరిగిన ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటికి మరణం లేదు. నవరస అద్భుత నటనా
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో ప్రజానాయకుడు, ప్రజలకు సేవకుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. గుమ్మడి నర్సయ్య పేరునే టైటిల్‌గా పెట్టిన ఈ బయోపిక్‌కు పరమేశ్వర్ దర్శకత్వం వహిస్తుండగా, ఎన్. సురేష్ రెడ్డి ప్రవళ్లిక బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు భవ్యంగా జరిగాయి. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే
బాలీవుడ్‌లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రేమకథగా నిలిచిన దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే (డిడిఎల్‌జే) మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. షారుఖ్ ఖాన్ ఉ కాజోల్ జంట కెమిస్ట్రీ, హృదయాలను తాకే సంగీతం, మరపురాని సంభాషణలు ఈ చిత్రాన్ని సాధారణ సినిమాగా కాకుండా ఒక అనుభూతిగా మార్చాయి. ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ప్రదర్శించబడుతున్న అరుదైన క్లాసిక్‌గా నిలిచింది.30వ
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.