చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం శక్తిమంతమైన ప్రదేశం అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ అని, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కాంగ్రెస్ తో జతకట్టిందని ఎద్దేవా చేశారు. స్థానిక బిఆర్ఎస్ అండతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని, తెలంగాణలో ఎన్నికలు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి సర్వే వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మల్లారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భూమి వ్యవహారంలో సర్వే ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తాము
మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత
నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖండించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ప్రాజెక్టును సందర్శించాక రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వారెవరైనా ఆ పని చేస్తారా అని నిలదీశారు. ఏపీ నుంచి వలసవచ్చి ఇక్కడ సెటిలైన వ్యక్తులైనా సహకరిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం ఉండదన్నారు.
కామారెడ్డి లో కాంగ్రెస్- బిజెపి నేతల మధ్య వివాదం ముదిరింది. కాంగ్రెస్ నేతలు, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో వివాదం చోటు చేసుకుంది. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు వెంకటరమణారెడ్డి బయలు దేరారు. డిగ్రీ కళాశాల అంశంపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు. తాము కూడా కలెక్టరేట్ కు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిముందు పోలీసులు
తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని, అలా సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేన లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బిఆర్ఎస్‌తో
రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఈ తరగతులు సహాయపడతాయని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని ముఖ్యమంత్రి
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో
ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు అని, ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఎఐ ఫలితాలు మనం చూస్తున్నామని
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత
నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హతలేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో సర్ ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా సర్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. మన రాష్ట్రంతోసహా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ, బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 28న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ
సినిమాల పైరసీ కేసు నిందితుడు ఇమంది రవి (ఐబొమ్మ)కి హైకోర్ట్ మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. గతేడాది నవంబర్‌లో అరెస్టయిన రవికి బెయిల్ మంజూరు ఉత్తర్వుల్లో పలు షతరులను విధించింది. హైదరాబాద్ నగరం విడిచి వెళ్లరాదనీ, సాక్షుల తారుమారుకు యత్నించరాదని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల ఎదుట హాజరుకావాలని పేర్కొంది. పాస్‌పోర్ట్ అప్పగించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది.
మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ప్రజలు ఆదరించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మున్సిపాలిటీలు తక్కువ వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగిందని, బిజెపికి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎన్నికలతో పోలిస్తే బిఆర్ఎస్ కు 14 శాతం ఓట్లు తగ్గాయని, చాలా మున్సిపాలిటీలో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యం చూపిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కనబెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు. తాను ప్రధాని నరేంద్ర
తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎక్స్‌అఫీషియో ఓట్ల నమోదు విషయంలో సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటుందని అనుకున్నప్పటికీ, కొంత తగ్గిందని కేటీఆర్ అన్నారు. హంగ్ వచ్చిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర
కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ వచ్చిన నేపథ్యంలో పాలకవర్గం ఏర్పాటులో సీపీఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రతిపాదనపై సీఐపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ ప్రతిపాదన మేరకు కొత్తగూడం మేయర్ పదవి కైవసం చేసుకుంటామని ప్రకటించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2,582 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 1,347 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో 64 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 717 వార్డుల్లో గెలుపొందింది. దాంతో 13 మున్సిపాలిటీలను ఆ పార్టీ దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో గెలుపొందారు. స్వాతంత్ర అభ్యర్థులు 256 వార్డుల్లో విజయం సాధించారు.
దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్రమంత్రిని విన్నవించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లు రక్షణ మంత్రికి వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా, మూసీ సంగమంలో నిమజ్జనం చేశారని కేంద్ర మంత్రికి
తెలంగాణలో మున్సివల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. ఈ నెల 13న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 13న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 136 కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకు న్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిఎం ఓటు వేశారు. మధిర మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్
అమెరికాలో జార్జియా రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెలుగు వ్యక్తి చాడ సుహృత్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. అట్లాంటా శివారు ప్రాంతాలైన శాండీ స్ప్రింగ్స్, డన్వుడీ పోలీసులు సంయుక్తంగా అండర్ కవర్ ఆపరేషన్ ఆపరేషన్ నిర్వహించిన వీరిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా, వ్యభిచార ముఠాలపై మానవ అక్రమ రవాణా లక్ష్యంగా జనవరి 29, 30వ తేదీల్లో ఆపరేషన్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది. అంతేకాకుండా, మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం
మక్తల్ లో బిజెపి నేత మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మక్తల్ లో బిజెపి నేత ఆత్మహత్యపై బండి సంజయ్ స్పందించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలు చేస్తున్నారని అన్నారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతుందని సూచించారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? అని
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిమీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని అన్నారు. 2014 లో పాలమూరు- రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, వరుసగా మూడు సార్లు ప్రధాని అయినా, ఇప్పటి వరకు ప్రకటించలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నిధులు ఇవ్వలేదని విమర్శించారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడింది. నేటితో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. చివరి రోజుల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఈనెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సిఎం పర్యటించారు. నారాయణపూర్ లో ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్, బిజెపి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, బిఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను పట్టించుకోలేదని విమర్శించారు. గల్లీలో బిజెపి కార్పొరేటర్ గెలిస్తే,
బిఆర్ఎస్ హయాంలో కబ్జాలే తప్ప అభివృద్ధి లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ కబ్జాలతో కరీంనగర్ లో సగం మంది కార్పొరేటర్లు జైలు కెళ్లారని అన్నారు. అడ్డగోలు హామీలచ్చిన కాంగ్రెస్ అమలు చేయట్లేదని, పదే పదే ఢిల్లీ వెళ్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లకు డబ్బులిస్తారా? అని కాంగ్రెస్ కు ఓటేస్తే డబ్బులు ఎక్కడి
తెలంగాణ మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు రాష్ట్రంలో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. కేరళలో అమలు చేస్తున్న కుటుంబశ్రీ మోడల్ ను అనుసరించి ఈ పథకానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. కేరళలో ఒక సర్వే నిర్వహించారని, దాని ద్వారా 65 వేల మంది పేదలను గుర్తించి, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారని సీతక్క తెలిపారు. అదే తరహాలో తెలంగాణలో మహిళా స్వయం సహాయక బృందాల
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణపై సుప్రీంకోర్టు గడువు పొడిగించింది. మూడు వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది. స్పీకర్ పాటించని పక్షంలో అప్పుడే ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామని వెల్లడించింది. ఇప్పటికే వరకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది మోహిత్‌రావు తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టుకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ
హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు కాగా, వాటిని రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక ఆధారాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులు మీరే అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గ్రూప్-1 అధికారులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని అన్నారు. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరగడంతో పాటు పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. హైకోర్టు తీర్పునిచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని
గ్రూప్ -1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ -1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం
తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ సభలో సీఎం ప్రసంగించారు. రేషన్ కార్డుల కోసం గతంలో పదేండ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో 3.17 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్న
ములుగు జిల్లాలో ఇటీవల నిర్వహించిన మేడారం జాతర విజయవంతమైందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సెక్రటేరియట్‌లో విలేకర్లతో సీతక్క మాట్లాడారు. జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. కొంత మంది జాతరతోపాటు ఏర్పాట్లపై విష ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతర ముగిసిందని పేర్కొన్నారు. ఒక దొంగతనం ఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరైన విషయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కేసీఆర్ చెప్తారని అనుకుంటున్నా. రెండేళ్లవుతున్నా, ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదు. విచారణను త్వరగా ముగించాలి. దోషులకు శిక్షపడాలి. సిట్ విచారణను తప్పుబడుతూ కేటీఆర్ మాట్లాడటం సరికాదు. సిట్ విచారణకు నన్ను పిలిస్తే వెళ్తా. నాఫోన్, నా
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలు పోస్టులు పెట్టారని పోలీసులు మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసుపై గతంలో విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు, సదరు ఎఫ్ఐఆర్‌లను కొట్టివేస్తూ
మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెల పూజ అనంతరం రాత్రి వన దేవతలు వన ప్రవేశం చేశారు. గిరిజన సంప్రదాయ డప్పు, డోలు వాయిద్యాలతో వనదేవతలైన సమ్మక్క- సారలమ్మలను గద్దెల నుంచి కన్నెపల్లి, చిలకలగూడ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అలాగే పూనుగుండ్లకు (మహబూబాబాద్) పగిడిద్దరాజును తరలించారు. దీంతో నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం జాతర ముగిసింది.నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్ నిర్వహించింది.ఈ జూమ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా నుంచే పాల్గొని పలు సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని అన్నారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు మనకు ముఖ్యమే అన్నారు.రెబల్స్ విషయంలో
బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ పిబ్రవరి 1 రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బిఆర్‌ఎస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాలమల్లు, కర్నె ప్రభాకర్ తదితరులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ ప్రస్తుతం ఫామ్‌హౌజ్‌లో ఉండటంతో సిట్ అధికారులు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌కు వెళ్లి నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే వారు ఫామ్‌హౌజ్‌కు బదులుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు అందజేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని
అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాటామంతి నిర్వహించారు. వివిధ అంశాలపై వారితో చర్చించారు. తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కావాలని విద్యార్థులను కోరారు. తెలంగాణలో అవకాశాలు, బలాలను ప్రపంచానికి చెప్పాలన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌ను చాటే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని ఎన్నారై బీఆర్‌ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ అన్నారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లతో నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదు అని తెలంగాణ రాజకీయ ప్రతీక అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్‌పై నిందలు వేయాలని
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర మొదలైంది.కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెను చేరడంతో మేడారం మహాజాతరలో తొలి అంకం మొదలైంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలుకగా, ముగ్గురి రాకతో మేడారమంతా సంబురంతో ఓలలాడింది. వనదేవతల దర్శనానికి జనం ప్రవాహంలా తరలివచ్చింది. అటు జంపన్న వాగు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. రెండేండ్ల ఎదురుచూపుల తర్వాత సారలమ్మ గద్దెకు
గిరిజనుల మహా కుంభమేళా పండుగ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను కేంద్ర మంత్రులు సందర్శించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వారికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ సాదర స్వాగతం పలికారు. గిరిజన డప్పు వాయిద్యాల
ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. కెసిఆర్ సిట్ విచారణకు సహకరించాలని సూచించారు. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండా అధికారులు ట్యాపింగ్ చేయలేరని ఆయన ఆరోపించారు. ఉద్యమకారుడిగా కెసిఆర్‌పై గౌరవం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేలాలని డిమాండ్ చేశారు. 500లకు పైగా ఫోన్
కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ నాటి స్కామ్ లే కాంగ్రెస్ హయాంలో జరగుతున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టింగ్ తప్పితే, యాక్షన్ లేదని, రెండేళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు తప్పితే చర్యలు లేవు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను కాంగెస్, బిఆర్ఎస్ మోసగిస్తున్నాయని, నోటీసులు ఇస్తున్నారు తప్పితే, అరెస్టులు చేయట్లేదని రామచందర్ రావు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నారై సెల్ ద్వారా ఆయా మున్సిపాల్టీలలో సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని విస్తృత ప్రసారం చేస్తామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది అని పేర్కొన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలతో తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28 వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ సోమవారం ఆయనకు నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ సంతోష్‌రావు సిట్ అధికారుల ఎదుట విచారణకు వచ్చారు. సిట్ నోటీసులు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను రేపు సిట్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రాజ్కాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఇటీవలే రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ ఆవిష్కరించిందని, రైజింగ్ తెలంగాణ-2047లో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని తెలియజేశారు. రాష్ట్రాన్ని మూడు ఎకానమీ జోన్లుగా ప్రభుత్వం విభజించిందని, మూడు కీలక రంగాలకు
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతున్న మేడారం జాతరను న్యూజిలాండ్ మావోరి తెగకు చెందిన ప్రతినిధులు సందర్శించారు.ఈ సందర్భంగా గద్దల ప్రాంగణంలో వారి హాకా నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ఓటు చోరీ కాదు, రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయింది. అమిత్ షా వ్యాఖ్యలను మార్ఫింగ్ చేసిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై
రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రత్యేక సమన్వయకర్తలను నియమించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి ముగిసే వరకు
హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాంపల్లి స్టేషన్ రోడ్‌లో అగ్నిప్రమాద ప్రభావం వల్ల పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడకుండా వాహనాలను ఇతర మార్గాల్లోకి దారి మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సిట్ అధికారులు విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్‌ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్‌ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న తర్వాత మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మొన్న హరీశ్‌రావుకు, నిన్న కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికే నోటీసుల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. రోజుకో కొత్త డ్రామాకు
మేడారం జాతరకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్. నేటి నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. జాతర విహంగ వీక్షణకు 6-7 నిమిషాల జాయ్ రైడ్ కు ఒక్కొక్కరి నుంచి రూ.4,800 ఛార్జ్ వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. HNK నుంచి మేడారానికి రానుపోను రూ.35,999 ఛార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31 వరకు ఉదయం 8 గంటల
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్‌కు రావాలని సిట్ అధికారులు కేటీఆర్‌కు నిర్దేశించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ కు సిట్ నోటీసులు కేవలం రాజకీయ కుట్ర, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనన్నారు. మొన్న హరీష్ రావుకు, నేడు కేటీఆర్‌కు నోటీసులనీ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతుందని ఆరోపించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి తమ అక్రమాలను, కుంభకోణాలను బయటపెడ్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సు సందర్భంగా అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో రూ.1,000
సింగరేణిలో నైనీ కోల్ బ్లాక్‌కు సంబంధించి అక్రమాలు జరిగాయన్న వార్తలపై కేంద్రమంత్రి తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బొగ్గు గనుల విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ఆయన విమర్శించారు. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని రెండు పార్టీలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి కాలరీస్ సంస్థలో జరుగుతున్న
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో సూట్ వేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇరిగేషన్ లీగల్ సమస్యలపై న్యాయ సలహాలు తీసుకుంటోంది. డ్రాఫ్ట్ రెడీ అయ్యాక ఏజీతో చర్చించనుంది. అనంతరం సుప్రీం కోర్టులో సూట్ దాఖలు చేయనుంది. అలాగే తెలంగాణలో చేపడుతున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఎన్వోసీ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. త్వరలో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి ఉత్తమ్
సీఎం రేవంత్‌రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు కోకాపేటలో మాజీ మంత్రి కేటీఆర్, పార్టీ నేతలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చారని, సీఎం ఆడుతున్న సిల్లీ డ్రామా ఇది అని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి మంగళవారం ఉదయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందిస్తూ, ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి, హామీలు నెరవేర్చలేక నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు.
మేడారంలో గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పునఃప్రారంభించారు. అనంతరం తన కుటుంబంతో కలిసి వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనవడితో కలిసి నిలువెత్తు బంగారాన్ని సీఎం సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను రేవంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ : సుదర్శన్ రెడ్డి, మల్కాజ్ గిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేవెళ్ల : శ్రీధర్ బాబు కరీంనగర్ :తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం: కొండా సురేఖ మహబూబాబాద్ : పొన్నం ప్రభాకర్ మహబూబ్ నగర్ : దామోదర రాజనర్సింహా మెదక్ : వివేక్ వెంకటస్వామి జహిరాబాద్ : అజారుద్దీన్ నాగర్
తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. కార్పొరేషన్లకు రిజర్వేషన్లు 1. జీహెచ్ఎంసీ -మహిళ ( జనరల్ ) 2. నల్లగొండ – మహిళ ( జనరల్ ) 3. మహబూబ్‌నగర్ – మహిళ
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర. ఈ జాతరకు సంబంధించిన బంగారం ప్రసాదంను టిజిఎస్ ఆర్టీసి భక్తులకు ఇంటికే తెచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేయనుంది. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం ఈ పథకాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. గతంలోనూ ఇటువంటి ప్రయత్నం చేసిన ఆర్టీసి ఇందుకు సంబంధించి ప్రసాదంను ఎలా ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాలో తెలిపే పోస్టర్ను ఆర్టీసీ ఎండి వై నాగిరెడ్డి
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటింది. కీలక మున్సిపల్ కార్పొరేషన్లలో 125 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర రాజకీయాలలో ఒక బలమైన శక్తిగా తన ఉనికిని చాటుకున్నది. ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ విజయానికి తీవ్రంగా కృషి చేశారు. సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమీకరించారు. కాగా, జనవరి 3 నుంచి 13 వరకు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీని. నేను సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని ఫీల్ అయ్యాను. నాకోసం ఆయన సంగారెడ్డికి వచ్చారు. నన్ను గెలిపించాలని గట్టిగా ప్రచారం చేశారు. అంతగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి
తెలంగాణలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ షో జరుగనుంది. తెలంగాణ పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోను ప్రారంభించారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న 300 మంది సందర్శకులకు హాట్ ఎయిర్ బెలూన్లలో రైడ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే సాధారణ ప్రేక్షకులకు నైట్ గ్లో
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30న ఢిల్లీలోని సేవా భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీఏవో), సీడబ్ల్యూసీ సమావేశ నోటీసును జారీ చేసింది. పోలవరం ఉ నల్లమలసాగర్ ప్రాజెక్టు సహా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రిగా ఆయన చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచపటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికలపై ఆయన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్యా, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తలసాని స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తలసాని మాట్లాడుతూ సికింద్రాబాద్‌ను ముక్కలు ముక్కలుగా చేస్తే ముక్కలుగా చేస్తా అనే మాటల్లో ఆవేశం తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. 2023, జులై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2026 జనవరి మాసంలో తీసుకునే జీతంతో కలిపి ఈ డీఏ చెల్లించనున్నట్లు ఆ
గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర మరోసారి భక్తుల మనసులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామం జనవరి మధ్య నుంచి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. కోట్లాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు అడవిబాటలు తొక్కుతూ వచ్చే ఈ జాతర, గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలు, ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ మహా ఉత్సవంలో వనదేవతలైన
ఉపాధి హామీ పథకాన్ని తీసేశామని బిజెపి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పార్టీ నిర్ణయించిందని అన్నారు. దేశంలో అనేక మార్పులు, సంస్కరణలు చేస్తున్నామని, మార్పులకు అనుగుణంగానే ఉపాధి హామీ పథకం పేరు మార్చామని తెలియజేశారు. పేదలకు మేలు చేసేలా ఉపాధి హామీ పథకంలో మార్పులు చేశామని, జవాబుదారీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే 23వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆహ్వానం లభించింది. హైదరాబాద్, తెలంగాణ పై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంపొందించడంలో కేటీఆర్ కీలక కృషికి గానూ ఈ ఆహ్వానం అందినట్లుగా నిర్వాహకులు తెలిపారు. హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో ఈ కాన్ఫరెన్స్ జరగనుంది. ది ఇండియా వి ఇమాజిన్ (
మహిళా అధికారులపై పలు మీడియా సంస్థల్లో తప్పుడు కథనాలు ప్రసారం అవడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళా అధికారులపై చెప్పలేని భాషలో కొన్ని ఛానల్స్, సోషల్ మీడియాలో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళా అధికారులను బదిలీ చేసే అధికారం సీఎంకే ఉంటుందని, జిల్లా మంత్రులకు చెప్పి ముఖ్యమంత్రి బదిలీ చేయరని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడితే ఐఏఎస్, ఐపీఎస్ అవుతారని,
కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్‌గా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదు. జయశంకర్ వర్సిటీ నుంచి వందెకరాలు తీసుకున్నారు. వర్సిటీ భూములపై విద్యార్థులు పోరాడినా ఆందోళనను అణచివేశారు. హెచ్‌సీయూకు చెందిన 400 ఎకరాలను తీసుకునే ప్రయత్నం చేశారు అని అన్నారు. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల దృష్ట్యా కేటీఆర్ ఆ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు.
మెల్‌బోర్న్‌లో బీఆర్‌ఎస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే వేడుకలకు కేటీఆర్‌ను బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా బీఆర్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఆహ్వానించారు. హైదరాబాద్‌ల్‌ని ఆయన నివాసంలో ఆహ్వానించగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ త్వరలో ఆస్ట్రేలియాకు వచ్చి వేడుకల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు శ్రీ నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన ప్రవాస బీఆర్‌ఎస్ కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ
తెలంగాణలో కొత్త వాహనం కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు వీలు కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వివాదాస్పద హెచ్చరికలు చేసారు. పవన్ కల్యాణ్ జాగ్రత్త. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు గద్దర్‌ది సహజ మరణం కాదని, ఆయన్ను చంపేశారని
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఐపిఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఈ మేరకు ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారా వు ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏ ర్పాటైన జోన్లు, ఇతర విభాగాలకు చెంది న 20 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తున్న ట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సౌత్ జోన్ అడిషనల్ కమీషనర్‌గా తఫ్సీర్ ఇక్బాల్, నార్త్ డిసిపిగా ఎన్. శ్వేత, సిద్దిపేట
ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం చెప్పారు కవిత. శాసనమండలి నుంచి బయటకు వచ్చిన తరువాత గన్‌పార్క్ వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తన నేతృత్వంలో నడుస్తున్న జాగృతి సంస్థనే కొత్త పార్టీగా అవతరించనుందని ప్రకటించారు. రాజకీయంగా అందరూ మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను ప్రకటిస్తానన్నారు. ఇంటి పార్టీ నుంచి అవమాన భారంతో బయటకు వస్తున్నానని,
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే
తెలంగాణ శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక, జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా మారుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అని అన్నారు. కెఎ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఆమె ఆత్మ గౌరవం ఎలా దెబ్బతింతో అది వారి కుటుంబ అంశమని, ఆమె పార్టీ
ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది. మేడారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టింది. ఈ నెల 19న సమ్మక్క-సారలమ్మల గద్దెలు, ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. సరికొత్తగా అభివృద్ధి చేసిన మేడారం ఆలయ ప్రాంగణం మరో వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా, పూర్తిగా రాతి కట్టడాలతో నిర్మితమవుతోంది. సమ్మక్క సారలమ్మల త్యాగాలు,
గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ
తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా నదీ జలాల హక్కులపై లఘు చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల విషయంలో గొప్పగా చేశామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటోందని విమర్శించారు. కృష్ణా నదీ జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీపడబోమని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో
అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని దేశమంతా చూసిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నోత్తరాలలో సీఎం గంటన్నర సేపు మాట్లాడటం శాసన సభ చరిత్రలో లేదన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా వాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి ఇష్టా రాజ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చావు కోరుకోవటం, హరీష్ రావును బాడీ షేమింగ్
హాల్‌టికెట్లల్లో తప్పులు సవరించడంలో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఇంటర్ హాల్‌టికెట్లు పంపించనున్నది. 45 రోజుల ముందుగానే హాల్‌టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌నకు పంపించనున్నట్టు ఇంటర్‌బోర్డు కా ర్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. హాల్‌టికెట్‌లో తప్పుఒప్పులను ముందే గుర్తించే అవకాశం ఉంటుందని పే ర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నా యి. ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్లను తల్లిదండ్రులకు పంపిస్తారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాల బహిష్కరించనున్నట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. రేపు తెలంగాణ భవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ నుంచి గన్‌పార్క్‌కు వెళ్లి నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు. రేపు (జనవరి 3) పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి, ఈ
కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సుధీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం పరిష్కారం కోసం మరో ప్రయత్నంగా కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలోని ఈ కమిటీని వేసింది. ఈ కమిటీని నోటిఫై చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు, కృష్ణా, గోదావరి నదీ బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ
హరీష్ రావు కృష్ణా, గోదావరి నదీ జలాలు, పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుండగా కెటిఆర్ రైతులకు యూరియా సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భువనగిరి ఎంపి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సరం తొలి రోజునే కెటిఆర్ గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని, ఒక పక్క హరీష్ రావు, మరోపక్క కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలనపైన విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వారిద్దరూ
జర్మనీలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లాడు.తాను నివసిస్తున్న భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హృతిక్ రెడ్డి భవనంలోనే ఉండగా, బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రాణాంతక గాయాలకు గురై మృతిచెందాడు.ఈ విషాద ఘటన వార్త తెలిశాక అతని
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం 713 కోట్ల రూపాయలు విడుదల చేసింది. డిసెంబర్ మాసానికి సంబంధించిన బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ ద్వారా బుధవారం 713 కోట్ల రూపాయల బిల్లులు విడుదల అయ్యాయి. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల 700 కోట్ల రూపాయలు విడుదల
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.