విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశంసించింది. కస్తూర్బా పాఠశాలల సమస్యలపై మంత్రి వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని ధర్మాసనం పేర్కొంది. సుమోటో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి చురుగ్గా వ్యవహరిస్తున్నారని కోర్టు ప్రశంసించింది. ధర్మాసనం ముందు విచారణ సందర్భంగా మంత్రి లోకేష్ ఇటీవల చేసిన ప్రకటనలను కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా కస్తూర్బా
రాజమండ్రిలో కల్తీ పాల తాగి నలుగురు అస్వస్థతతకు గురై చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్లపై ఉన్నారని, ఈ ఘటన బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కల్తీ పాల విషయంపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదని చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అన్నారు. మరో
సాంకేతికతలో వడివడిగా దూసుకెళ్తున్న కృత్తిమ మేథస్సు పై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ అంటే భయమేస్తుందని, వింటేనే వణుకు పుడుతోందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విధ్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐతో మానవ సంబంధాలు మంటగలసి పోతాయోమోనని భయమేస్తోందని, వావివరుసలు ఎక్కడ మరిచిపోతారెమోనన్న
వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా- వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుందని, 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం
గూగుల్ లాంటి సంస్థల రాకతో ఎఐ డేటా హబ్ గా విశాఖ మారుతుందని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మోడీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందని తెలియజేశారు. పౌరులందరికీ లబ్ధి కలిగేలా సావరిన్ ఎఐ వినియోగానికి ప్రయత్నిస్తున్నామని, డీప్ టెక్నాలజీలో మరింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భూ సమస్యల పరిశీలన, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులపై మాట్లాడారు. మొత్తం రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.ఈ పెట్టుబడుల ద్వారా 56,692 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్,
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు. గేట్స్‌పై ఉన్న గౌరవంతో మంత్రి నారా లోకేశ్‌తో సహా నలుగురు మంత్రులను సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి పంపించి స్వాగతం పలికారు. సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబును చూడగానే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతి పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్‌కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలకడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో
రాజకీయ వ్యూహాలు, అసెంబ్లీ బడ్జెట్ చర్చల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, మంత్రి నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వనభోజనాల తరహాలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాజకీయ చర్చలకు తావులేకుండా, కేవలం కుటుంబ విషయాలు, పిల్లల
తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. ఈ విషయాన్ని భువనేశ్వరి తెలియజేశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్, కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది.
ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. బడ్జెట్ స్వరూపం.. 2026-27 వార్షిక బడ్జెట్: రూ.3,32,205 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు మూలధన వ్యయం: రూ.53,915
పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిహారంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ పరిహారంతో మాకు కొంత మేలు జరుగుతుందని అనుకోవచ్చు. ఈ డబ్బుతో మేమేం చేసుకోవాలి. యాక్సిడెంట్ చేసి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఏపీ అసెంబ్లీ, మండలిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై పెట్టిన తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై శాసన మండలిలో దుమారం రాజుకుంది. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్
అమెరికాలో ఓ బాద్యత గల పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు యువతి జాహ్నవి కందుల (23) అనే యువతి కుటుంబానికి న్యాయం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారిని విధులనుంచి తొలగించడంతో పాటు మృతురాలు కుటుంబానికి అక్కడి ప్రభుత్వం రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. 2023 జనవరిలో సియాటెల్
సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరిట జరిగిన వసూళ్ల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ కోర్టు పీటీ వారంట్ జారీ చేసింది. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. పోలీసులపై దౌర్జన్యం కేసులో బెయిల్ వచ్చినా, కొత్త వారంట్ రావడంతో ఆయన విడుదల కాలేదు. 2023లో పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున వసూలు చేసి లాటరీ టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలోని పలువురు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని, సత్యకుమార్‌కు బెదిరింపు లేఖలు వచ్చాయి. కందుల దుర్గేశ్‌కు బెదిరింపు రావడంతో, మంత్రి కార్యాలయ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసులు ఈ బెదిరింపులు లేఖ వ్యవహారంపై దర్యాప్తు
వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే, సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తా అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనమండలి లో తన వాణి వినిపిస్తానని చెప్పారు. త్వరలోనే జగన్‌ను కలుస్తానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని అన్నారు.
విశాఖ నగరంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ స్వయంగా తెలియజేశారు. ఆయనతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వైజాగ్, విజయవాడలలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం, తొలుత వైజాగ్‌లో మెట్రో నిర్మాణానికి అనుమతులు
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కాలినడకన తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత తిరుమలకు చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి బండ్ల గణేశ్ తిరుమలకు చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాత్రను పూర్తి చేయడం చాలా
ప్రపంచానికి మనమే క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సిఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్సిలు సమావేశం అయ్యారు. జిఎస్ డిపి వృద్ధిరేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు వచ్చాయని అన్నారు. ఎనర్జీపైనా దావోస్ లో ఎఐ టెక్నాలజీ గురించి ప్రధానంగా
సుప్రీం కోర్టులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఊరట దక్కలేదు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కుంభకోణంలో కసిరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా ఆర్జించారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా ప్రశ్నించారు. సుమారు రూ.750 కోట్ల కుంభకోణంలో 9 నెలలుగా జైల్లో ఉండటం పెద్ద సమయమేమీ కాదని అన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారు కసిరెడ్డి అని తెలుస్తోందని తెలిపారు. రూ.750
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ
వేంకటేశ్వర స్వామి తన ఇంటి కులదైవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అని అన్నారు. ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగాయని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పామని సూచించారు. 2003 లో తనపై హత్యాయత్నం జరిగిందని, అదీ అలిపిరి వద్ద అని విమర్శించారు. అంతర్వేదిలో రథం
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని రాంబాబు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో ట్రయల్ కోర్టు
వైసిపి పాలనలో చాలా సంఘటనలు జరిగాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని సూచించారు.ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని, రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని విమర్శించారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే, ఇవి పోతే ఇంకోటి కొందామని మాట్లాడారని, అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివాడు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు జగన్ కు షాక్ ఇచ్చారు.ఇబ్రహీంపట్నం లోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లడంపై ఆంక్షలు విధించారు విజయవాడ పోలీస్ కమిషనర్. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఉదయం వేళలో విజయవాడలో భారీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ వారిధి
జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సికె కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంలో వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు? వైసిపి నేతల ట్రాప్‌లో
మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9:00 గంటలకే శ్రీవారి ఆలయ తలుపులను
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై విచారణ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిలో టి.శివశంకర్, తంబళ్ల రమాదేవి, టి.సి.వరుణ్ ఉన్నారు. ప్రసార మాద్యమాల్లో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని ఆ కమిటీని పార్టీ ఆదేశించింది. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్
విమాన ప్రమాదంలోమహారాష్ట్ర, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సంతాపం తెలిపింది. ఈ మేరకు తీర్మానం చేసింది. దీనికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. అజిత్ పవార్ తో, సహా ఐదుగురు చనిపోవడంపై మంత్రివర్గం విచారణ వ్యక్తం చేసింది. ఆయనతో తనకున్న పరిచయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
టీడీపీలో కార్యకర్తలే అధినేతలుగా ఉంటారని, పార్టీలో యువతకు తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. డీపీ కేంద్ర కార్యాలయం లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. మహిళలను గౌరవించాలని, 33 శాతం పదవులు వారికి కేటాయించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాత కు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గా నిర్వహించిన, 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. హైకోర్టుకు సమీపంలో ప్రత్యేకంగా
నగరిలో టిడిపి ఎంఎల్ఎ గాలి భాను ప్రకాశ్ చేసింది శూన్యమని వైసిపి నేత, మాజీ ఎంఎల్ఎ రోజా విమర్శించారు. నగరిలో చంద్రబాబు పర్యటిస్తుండడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. కల్యాణ మండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా తామే ఇచ్చామని, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ పెడతామని టిడిపి నేతలు చెబుతున్నారని, సిఎం చంద్రబాబు
దేశ భక్తి లేని వారు, ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 25 ఏళ్లు అయిన సందర్భంగా స్మరణ, నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు ప్రసంగించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు. సమాజాన్ని చెడగొట్టేలా ఉగ్రవాద ప్రసంగాలు చెబితే, వారు ప్రజా ద్రోహులేనని విమర్శలు చేశారు.
తిరుమల వేంకటేశుడి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తమ విచారణను ముగించింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీటు దాఖలు చేసే అవకాశం ఉంది. గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణకు
హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాజ గోపాల రాజు
నకిలీ మద్యం కేసులో అరెస్టు అయ్యి సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష అనుభవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జోగి రాము ఎట్టకేలకు విడుదలయ్యారు. విజయవాడ కేంద్ర కారాగారంలో గత 85 రోజులుగా రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి రమేష్ సోదరులకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ మద్యం తయారీ మరియు సరఫరాకు సంబంధించిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఆదాయంలో రికార్డ్ సృష్టించింది. జనవరి 19న ఒక్క రోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం సాధించింది. ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఆదాయ రికార్డ్‌ను నెలకొల్పింది. జనవరి 19న ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణించారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా సొంతూళ్ల నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా అదనపు బస్సులను
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. ఈ లిక్కర్ స్కామ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో భారీఎత్తున అక్రమాలు
ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా, నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని సీఎం పేర్కొన్నారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్
కనుమ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే కనుమ అనేది రైతు జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని ఆయన పేర్కొన్నారు. తమ వ్యవసాయానికి సహకరిస్తున్న పశువుల పట్ల కృతజ్ఞత వ్యక్తపరచే రోజు కనుమ అని తెలిపారు. ఈ పండుగ కేవలం సంప్రదాయంగా జరుపుకునే వేడుక మాత్రమే కాదని,
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30న ఢిల్లీలోని సేవా భవన్లో ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీఏవో), సీడబ్ల్యూసీ సమావేశ నోటీసును జారీ చేసింది. పోలవరం ఉ నల్లమలసాగర్ ప్రాజెక్టు సహా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అశేష జనంతో పల్లె మొత్తం కిక్కిరిసింది. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా ఆయన కుటుంబీకులంతా, నందమూరి కుటుంబీకులు కలిసి ఆనందంగా తిలకించారు. గ్రామ ఆటల పోటీలలో నారా దేవాన్ష్ అత్యుత్సాహంగా పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. పోటీలలో గెలుపొందినవారికి బహుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌లు అందజేశారు. ప్రజల వద్ద సమస్యలను సిఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పురాతన జపనీస్ సమురాయ్ యుద్ధ కళ అయిన కెంజుట్సు లో అధికారికంగా ప్రవేశం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రీడలో ఉన్నతస్థాయిని సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ మరోవైపు సినిమా కెరీర్ కొనసాగిస్తూ క్రమశిక్షణ, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. పవన్ సాధించిన విజయం ద్వారా వృత్తిపరమైన
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన స్వగ్రామం నారా వారి పల్లికు చేరుకున్నారు. రాజధాని అమరావతి నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు జిల్లా ఉన్నతాధికారుల తోపాటు స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఈ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సమతుల్యంగా నడిపించేందుకు 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ జారీ చేశారు. ఈ మార్పులు జిల్లాస్థాయి పరిపాలనా శాఖల్లో కీలక బాధ్యతలను పునర్విభజన చేసేలా ఉన్నాయి. ఈ బదిలీల్లో పలు ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా– శ్రీవాస్ నుపుర్
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025 సౌత్‌జోన్ ప్రదానం చేసింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె చూపిన దూరదృష్టి నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టంపై ఆమె కల్పించిన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్-ఎన్1 శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తిరుమల
గుంటూరుకు చెందిన హరి కృష్ణారెడ్డి కరసాని అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లిన తెలుగు విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కృష్ణారెడ్డి హ్యూస్టన్‌లో ఉంటున్నారు. క్రిస్మస్ సెలవులు రావడంతో అలాస్కాకు వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 22, 2025న ఒంటరిగానే హరి అలాస్కా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. డెనాలి సమీపంలోని
భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని, భారతీయ వంటలు అందరూ తినాలని దేశ ప్రజలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. విశాఖపట్నంపై తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ ఆయన మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, వివాదాస్పద హెచ్చరికలు చేసారు. పవన్ కల్యాణ్ జాగ్రత్త. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు గద్దర్‌ది సహజ మరణం కాదని, ఆయన్ను చంపేశారని
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కృష్ణ కిశోర్ గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు
గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ
అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిల నివాస భవనాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. నివాస భవనాల పనులు ఈ ఏప్రిల్‌లో పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలో మొత్తం 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మించబడుతున్నాయని చెప్పారు. వీటిలో 186 బంగ్లాలు ఉండగా, మిగతా 3,850 భవనాలు అపార్ట్మెంట్ మోడల్లో నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా
తెలంగాణ రాష్ట్రంలోని కొండ గట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధులు మంజూరు చేసింది. టీటీడీ నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలు చేయనున్నారు. రేపు (జనవరి 3) పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లి, ఈ
కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సుధీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం పరిష్కారం కోసం మరో ప్రయత్నంగా కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలోని ఈ కమిటీని వేసింది. ఈ కమిటీని నోటిఫై చేస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు, కృష్ణా, గోదావరి నదీ బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాలో అధిక వడ్డీని ఆశ చూపించి ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన శ్రేయ గ్రూప్ ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. (ఖబతీఅశీశీశ్రీ) ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రేయ గ్రూప్ మీద ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా శ్రేయ గ్రూప్ ఆస్తులను జప్తు చేయడానికి సీఐడీ అధికారులకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రప్రజలకు 2026 సంవత్సరంలో రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యం చేరుకోవడం లో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని ఆకాంక్షించారు. 2025లో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాల్ని అందించిందన్నారు. ఎన్నో మైలురాళ్లను చేరుకుందని.. అనేక సంక్షేమ, అభివృద్ధి పనులకు నాంది
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నీ, వీబీ జీ రామ్ జీ మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోడీ సర్కార్ తీసుకొచ్చిన మార్పులపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తెచ్చిన చట్టానికి, బీజేపీ తెచ్చిన కొత్త చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.కొత్త చట్టం ప్రకారం ఉపాధిని హక్కుగా కాకుండా, కేంద్రం దయాదాక్షిణ్యాలపై
గుంటూరుకు చెందిన విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య టీటీడీ శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం గా అందించారు.ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.
రాయలసీమ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ షర్మిల రాయలసీమ రాష్ట్ర సమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. రాయలసీమ ప్రాంతంలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెడ్లకు బలమైన సామాజిక, రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాల్లో రాజకీయాలు ఎక్కువగా రెడ్ల ప్రభావంతోనే నడుస్తున్నాయన్నది అందరూ అంగీకరించే విషయం. ఇదే సామాజిక బలం ఆధారంగా తెలంగాణ
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన సీఎంకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటు న్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ దక్కింది. గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కాగా, 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌పై రిజర్వేషన్ల విధానాన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ను పాటించాలని కోరుతూ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. 2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత నోటిఫికేషన్‌కు బదులు కొత్త నోటిఫికేషన్
ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ను నియమించటం జరిగింది. ఆయనను ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించడం జరిగింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారికత పొందింది. రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రభుత్వం తీసుకునే ఆరోగ్య, సహజ చికిత్సా విధానాలపై
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేశారు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు సమావేశంలో 927 అభ్యంతరాలు, సూచనలపై
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. గిరిజన విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు విడుదల చేసినట్లు గురువారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లు విడుదల చేశామని.. మొత్తం 59,297 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహించే అదనపు సొలిసిటర్ జనరల్ గా ఆయనను మోదీ సర్కార్ నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పదవికి దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన న్యాయపదవుల్లో ఒక్కటిగా గుర్తింపు ఉంది. కనకమేడల రవీంద్ర కుమార్ నియామకం
భీమవరం అంటే పల్లెటూరి ఆప్యాయత ఉన్న పట్టణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉండి బైపాస్ రోడ్డు వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఏ దేశానికి వెళ్ళినా తాము భారతదేశం నుంచి వచ్చామని అంటే సెల్యూట్ చేసే పరిస్థితి ఉందన్నారు. నేటి యువతరం వాజ్‌పేయి గురించి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ కార్యక్రమం అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో సామాన్య ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని అన్నారు. అధికార యంత్రాంగం సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. వనానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ ఘన స్వాగతం పలికారు. శాంతి వనాన్ని సందర్శించిన తరువాత దాజీతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కన్హా శాంతి వనంలో హార్ట్ ఫుల్నెస్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గురించి చర్చించారు. శాంతి వనంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి అడిగి
చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన తప్ప, ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై ప్రజలు నిరసనలతో స్వచ్చందంగా మద్దతు తెలిపారని అన్నారు. వైఎస్
తిరుమల భక్తులకు శుభవార్త. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దర్శనం టికెట్లు, వసతి, విరాళాలు, రవాణా వంటి అంశాలపై ఏ సందేహం ఉన్నా క్షణాల్లో సమాధానం లభించేలా 13 భాషల్లో పనిచేసే ఏఐ చాట్‌బాట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం కాల్ సెంటర్ల ద్వారా సమాచారం పొందాలంటే భక్తులు ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కక్కలపల్లి గ్రామ చెరువుకి జలహారతి ఇచ్చారు పరిటాల సునీత. గ్రామస్తులతో కలిసి చెరువు వద్ద బోనాలతో పూజలు చేశారు. అనంతరం పరిటాల సునీత మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి
తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో నివేదికను హైకోర్టుకు సీఐడీ సమర్పించింది. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై సీఐడీ అదనపు నివేదికను వేసింది. అదనపు నివేదికను మరో రెండు సెట్లను సీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. లోక్ అదాలత్ అవార్డ్ చట్టబద్ధతను తేల్చేందుకు విచారణ జరువుతున్న
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గిరిజనులకు జీవనోపాధి మార్గాలపై పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను బర్తరఫ్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందించారు. గతంలో పవన్ చేగువేరా వేషం ధరించి విప్లవకారుడిని అన్నారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య
ఆర్టీసీకి మరో వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో విద్యుదుత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపుపై అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది ప్రోత్సాహకాలు కొనసాగించాలి. ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి
వైసీపీకి రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును కలిసి వివరణ ఇచ్చారు. చైర్మన్‌ను ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత కలిశారు. వీరిలో అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ వివరణ ఇచ్చారు కూడా. కానీ అంతలోనే జాకియా ఖానం మాత్రం యూటర్న్ తీసుకున్నారు. రాజీనామాకు సంబంధించి షాకింగ్ నిర్ణయం
ఆహార భద్రత కోసం ఆలోచిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు మౌళిక సదుపాయాలు కల్పించి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్రమంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పండ్లు, కూరగాయల హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సహకరించాలన్నారు. ఆహార అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు
కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాలకే పరిమితం కాకుండా జరుగుతున్న ప్రతీ అభివృద్ధి ప్రజల కళ్ళకు కట్టేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిలో బ్యాంకులు, భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్పా ల్గొని ప్రసంగించారు. అమరావతిలో ఏర్పాటు చేసే బ్యాంక్ స్ట్రీట్, ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచుతుందని తెలిపారు. ఆర్థిక కేంద్రంతో పాటు విద్య, పరిశోధన కేంద్రంగా
మాక్ అసెంబ్లీ అద్భుతమని, విద్యార్థులు అదరగొట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పాలక, ప్రతిపక్ష సభ్యుల రూల్స్‌ను విద్యార్థులు ప్రదర్శించారు. మాక్ అసెంబ్లీలో సమకాలీన రాజకీయ అంశాలపై ఆసక్తికర చర్చ జరిగింది. సభ్యుల మధ్య వాదోపవాదాలతో రక్తికట్టింది మాక్ అసెంబ్లీ. విద్యార్థుల మాక్ అసెంబ్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టు లో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు. న్యాయస్థానంలో నిందితులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో సరెండర్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చింది న్యాయస్థానం. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిజైండర్
తిరుమల పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ పిలుపు మేరకు, విజయవాడ తులసినగర్‌లోని సీఐడీ కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు వచ్చారు. టీటీడీ మాజీ ఈవోను సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. పరకామణి కేసులో ఇప్పటికే రెండు సార్లు ధర్మారెడ్డిని సీఐడీ విచారించిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సమగ్ర సమాచారంతో స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఉంటుందన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటా లేక్‌తో కుటుంబం, వ్యక్తుల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు, పౌరసేవల పర్యవేక్షణకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఒక్కటే ఉంటుందని తెలిపారు. కుటుంబ సాధికారిత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని చంద్రబాబు
పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆమెకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ అందించారు. రెండు రోజుల పర్యట నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమలకు చేరుకున్నారు. శ్రీపద్మావతి
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ కోసం హాజరయ్యారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియకు సర్కార్ అంగీకారం తెలిపింది. కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ స్కాంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్‌లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ తేల్చింది. సిట్ దర్యాప్తు నివేదిక, విన్నపం మేరకు చెవిరెడ్డి ఆస్తుల
విశాఖపట్నం ఉక్కుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థను ప్రైవేటైజేషన్ చేయడం లేదని, ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తుందని స్పష్టం చేసింది. ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో రూ.15 వేల కోట్ల సాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించనట్లు తెలిపింది. ఇక ఓవరాల్ కెపాసిటీ యుటిలైజేషన్‌ను 17
సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ప్రమాదం చాలా బాధకలిగించిందని అన్నారు. మృతుల పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఈ విషాదకర సమయంలో బాధిత కుటుంబాలకు ధైర్యం, ఓదార్పు కలగాలని కోరుకుంటున్నానని అన్నారు.
కామన్ హెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొన్నానని రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సదస్సులో తనకు రెండు అరుదైన గౌరవాలు లభించాయని ఉద్ఘాటించారు. రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అణుశక్తి కి సంబంధించి అణుబాంబులు తయారు చేయాలని భారతదేశం ప్రకటించిందని గుర్తుచేశారు. బిహార్ ఎన్నికల్లో
గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఎపి ప్రభుత్వం నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖ పట్నంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందిందని అన్నారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌తో ఏపీ సాంకేతికంగా, ఆర్ధికంగా బలోపేతం అవుతుందని అన్నారు. 2047 నాటికి
విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖలోనే ఏర్పాటు చేస్తోందని తెలియజేశారు. సబ్ సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటు అవుతోందన్నారు. గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. గూగుల్,
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో ప్రచారం కోసం పిటిషన్లు దాఖలు చేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో మరో మారు కేఏ పాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైనట్లైంది. ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పీపీపీ మోడ్‌లో పూర్తి చేసి నిర్వహించాలని కూటమి ప్రభుత్వం
విశాఖలో ఈనెల 14, 15 తేదీలలో జరిగే 30వ పార్టనర్ షిప్ సమ్మిట్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. పార్టనర్ షిప్ సమ్మిట్‌పై ఏపీ కేబినెట్ సమావేశంలోనూ చర్చకు వచ్చింది. ఈనెల 14న తొలిరోజు ఓపెనింగ్ ప్లీనరీతో సదస్సు ప్రారంభంకానుంది. ఓపెనింగ్ ప్లీనరీలో తీవ్రమైన ప్రతికూల పరిస్ధితులు, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ భారత్ 65 శాతం వృద్ధి రేటును సాధించిన అంశంపై చర్చ జరుగనుంది. రెండు రోజుల పాటు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు పోలీసులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజుపాలెం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో సునీత,
వన్డే వరల్డ్ కప్ కైవసంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణికి ఏపీ వాసులు ఘన స్వాగతం పలికారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి వరల్డ్ కప్ సాధించిన తరువాత మొట్టమొదటిసారిగా విజయవాడ కు వచ్చిన సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు అనిత, సవిత , పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు.
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.