టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ రూపొందించిన చిత్రం రేజర్. ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. క్రైమ్ మరియు యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే, ఈ చిత్ర కథాంశం ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఓ వ్యక్తి శక్తివంతమైన రాజకీయ మరియు నేర వ్యవస్థతో
బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా రూపొందుతున్న పతి పత్ని ఔర్ వో డో చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు. 2019లో కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చి సూపర్ హిట్ సాధించిన పతి పత్ని ఔర్ వో చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతుంది. తాజాగా విడుదలైన పోస్టర్లో
మద్రాస్ హైకోర్టులో ప్రముఖ నటి తమన్నా భాటియాకు భారీ షాక్ తగిలింది. సుమారు 16 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో చివరకు ఆమెకు చుక్కెదురైంది. గతంలో పవర్ సోప్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసిన తమన్నా, తన ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కూడా ఆ సంస్థ తన ఫోటోలను ప్రకటనల్లో వాడుకుందని ఆరోపిస్తూ 2011లో కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఫోటోలు వాడినందుకు గాను
మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ కేసు కీలక మలుపు తిరగబోతుంది. ఈ కేసులో మరో నిందితురాలిగా ఉన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అప్రూవర్‌గా మారబోతుంది. ఈ విషయాన్ని ఆమె ఢిల్లీ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన కోర్టు, తను అప్రూవర్‌గా మారాలనుకుంటున్న విషయాన్ని ఈ కేసును విచారిస్తున్న ఈడీకి చెప్పాలని సూచించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రకారం,అప్రూవర్‌గా మారాలనుకుంటున్న విషయాన్ని జాక్వెలిన్ ముందుగా విచారణ
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తుండగా, తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ తస్సాదియ్య వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించగా, తస్సాదియ్య పాట ఒక ఫ్యామిలీ
అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా, థమన్, ఎస్ శ్రీ కృష్ణ కలిసి పాడారు. థమన్ సంగీతం అందించాడు.కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఒక శక్తివంతమైన కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆలియా భట్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా వీడియో సాంగ్‌ను ఏప్రిల్ 16న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.
యాక్షన్ హీరో గోపీచంద్ మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భరతవర్ష అనే పవర్ఫుల్ టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాక సినిమా పై ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోలో గోపీచంద్ యోధుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శత్రువులను ధైర్యంగా ఎదుర్కొంటూ యుద్ధరంగంలో విరుచుకుపడే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ ఎలిమెంట్స్ అన్నీ కలిసి
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న కాయడు లోహర్ నేడు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో కాయడు రెట్రో లుక్‌లో అలరిస్తుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం
విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వెంకట్ హీరోగా రూపుదిద్దుకున్న భారీ మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరుడు. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ వేడుకలో హీరో వెంకట్ మాట్లాడుతూ సినిమా
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తూ సరికొత్త మైలురాయిని అధిగమించింది. గతంలో బాహుబలి 2, పుష్ప 2 వంటి చిత్రాలు అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లు సాధించినప్పటికీ, కేవలం హిందీ వెర్షన్లోనే రూ.1000 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన
వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కొరియన్ కనకరాజు. రితికా నాయక్ కథానాయిక. ఇండో-కొరియన్ నేపథ్యంలో హారర్-కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను చిత్ర బృందం ఘనంగా ప్రారంభించింది. ఈ చిత్రంలోని మొదటి పాట కమ్సాహంనిదా ప్రోమోను తాజాగా విడుదల చేయగా, దీనికి విశేష స్పందన లభిస్తోంది. సంగీత దర్శకుడు ఎస్. థమన్, వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ
చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్. త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా, అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశ్వంభర చిత్రాన్ని జులై 10న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే పలు రకాల తేదీలు తెరపైకి రావడంతో అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావ్య రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమైంది. రీసెంట్గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు సంబంధించిన లగ్నపత్రిక వేడుక ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం చాలా సాదాసీదాగా, కానీ ఆనందోత్సాహాల మధ్య పూర్తయ్యింది. ఈ లగ్నపత్రిక వేడుకలోనే పెళ్లి ముహూర్తాన్ని ఏప్రిల్ 29గా ఖరారు
రాజస్థాన్‌లో వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన తాజాగా కుటుంబ సభ్యులు, బంధువుల కోసం కర్ణాటకలోని విరాజ్పేట్ లో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుక కొడవ సంప్రదాయాల నడుమ అద్భుతంగా జరిగి, అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. విరాజ్‌పేట్‌లోని ప్రసిద్ధ సెరినిటీ హాల్ లో జరిగిన ఈ రిసెప్షన్లో కొడవ సంస్కృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్మిక మందన్న సంప్రదాయ కొడవ శారీలో మెరిసిపోగా, విజయ్ దేవరకొండ కూడా
బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే, కిల్ సినిమాతో మెప్పించిన లక్ష్య జంటగా నటిస్తున్న కొత్త సినిమా చాంద్ మేరా దిల్. ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. హైదరాబాద్ నేపథ్యంలో రాబోతున్న ఈ టీజర్ చూస్తుంటే, ఇదొక స్వచ్ఛమైన క్యాంపస్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో ఆరవ్, చాందిని అనే ఇద్దరు విద్యార్థుల మధ్య
హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. విధి యాదవ్ హీరోయిన్. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇన్నిరోజులు లవర్ బాయ్ గా అలరించిన నాగశౌర్య, ఈసారి పూర్తి
హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ డెకాయిట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా
మత్తువదలరా ఫేం రితేశ్ రాణా దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జెట్లీ. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ మంచి ఆసక్తిని కలిగించడంతో పాటు సినిమా రిలీజ్ కోసం ప్రజలు ఎదురు
బండ్ల గణేష్ కుమార్తె జనని బండ్ల పెండ్లి పీటలెక్కబోతున్నారు. ఈ శుభకార్యానికి సంబంధించి తొలి అడుగుగా ఇంట్లో పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి సూర్యతేజ చిలుకూరి మరియు చిరంజీవి లక్ష్మీ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, సరికొత్త చరిత్ర సృష్టిస్తూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సాంకేతికతతో రూపొందుతున్న మొట్టమొదటి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా అంబ s రివెంజ్ సిద్ధమవుతోంది. మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన, భావోద్వేగభరితమైన అంబ పాత్ర కథను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీ లలితకళా చిత్రాలు మరియు నక్క తోక ఫిల్మ్స్
హనుమాన్ జయంతి సందర్భంగా పలు సినిమా అప్డేట్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణ్ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. అయితే ఇదే కాకుండా బాలీవుడ్ నుంచి మరో రామాయణ్ సినిమా తెరకెక్కుతుంది. వాల్మీకి రామాయణం అంటూ ఈ సినిమా రాబోతుండగా, నేడు హనుమాన్ జయంతి కానుకగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. గత నెలలో శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన
మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న తాజా చిత్రం రాజా శివాజీ. బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తూ, ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తుండగా, రితేష్ భార్య, ప్రముఖ నటి జెనీలియా దేశ్‌ముఖ్ (ముంబై ఫిల్మ్ కంపెనీ), జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2026 మే 1న (మహారాష్ట్ర
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ తన విలక్షణమైన నటనతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేష్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస మంగపురం. దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని ఈ సినిమాతో వెండితెరకి పరిచయం కాబోతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటిస్తున్న భావోద్వేగ ప్రేమకథ చెన్నై లవ్‌స్టోరీ. రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకుడు. బ్లాక్‌బస్టర్ బేబీ మేకర్స్ సాయిరాజేష్, ఎస్కేఎన్ నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో గుర్తుందా అంటూ సాగే ఓ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ సాయిరాజేష్ ఈ కథ చెప్పినప్పుడే ఇది బలంగా జనం మనసుల్లో నిలిచిపోయే
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ. దాదాపు రూ.3000 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, తాజాగా ఈ సినిమా టీజర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (ఛ్భ్Fఛ్) క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం నుంచి రామ పేరుతో రాబోతున్న ఈ టీజర్ విడుదలకు ముందు సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్
ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటితో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు తదితర అంశాల మేలుకలయికగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ నాగబంధం. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమాను జూలై 3న విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని విడుదల
సముద్రఖని ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం కార్మేని సెల్వం. రామ్‌చక్రి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ కీలక పాత్రధారి. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ ఈ సినిమాలో మన జీవితాన్ని కొత్త కోణంలో చూస్తాం. థియేటర్ నుంచి బయటికొచ్చిన ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే సినిమా ఇది. మనపై ఉన్న బరువుల్ని తగ్గించుకుంటే కలల్ని
దేశ రాజధాని వేదికగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (ఐ ఎఫ్ఎఫ్ డి) 2026 లో టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణకు అత్యున్నత పురస్కారం లభించింది. సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమకు ఆయన అందిస్తున్న విశేష సేవలను, అంకితభావాన్ని గుర్తిస్తూ నిర్వాహకులు బాలయ్యను ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. దిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం లో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేఖా
యంగ్ హీరో సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస. జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఘనంగా విడుదలైంది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల కలయికతో రూపొందింది. అమెరికా నుంచి ఒక కుర్రాడు (సంగీత్ శోభన్) తన ఊరికి తిరిగి వచ్చినప్పుడు, అక్కడి
నటి సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆమె నటించిన తొలి హిందీ చిత్రం ఏక్ దిన్ ఇప్పుడు తెలుగులో ఒక రోజు పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా రాబోతున్న ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక తెలుగు ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ తో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. కాలభైరవ తమ్ముడు శ్రీసింహా హీరోగా నటించిన ఉస్తాద్ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా నటించింది. అయితే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ స్పందనను రాబట్టింది. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నాయి. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, మంచి వసూళ్లతో
యువ కథానాయకుడు సందీప్ కిషన్ తన కెరీర్లో మరో మైలురాయి లాంటి ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవలే శంబాల చిత్రంతో సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు యుగంధర్ ముని ఇప్పుడు అదే స్థాయి భారీ కాన్సెప్ట్‌తో సందీప్ కిషన్‌ను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రం ఒక హై-వోల్టేజ్ ఫాంటసీ అడ్వెంచర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. కొన్ని యుద్ధాలు
దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించబోతుండగా, నేచురల్ స్టార్ సాయి పల్లవి మణిరత్నం సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పనిచేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, వాటన్నింటికీ చెక్ పెడుతూ మద్రాస్ టాకీస్ సంస్థ రెహమాన్ పేరును అధికారికంగా ప్రకటించింది.
ఉగాది పండగ వేళ మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలతో వేలాది మందికి అండగా నిలుస్తున్న ఆయన, ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. భవిష్యత్తులో విద్యాదానంపై దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. ఉగాది సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తన సేవా ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ నటుడు సూర్య స్థాపించిన
టాలీవుడ్ లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు శికంజా మాలిక్ అనే పవర్ఫుల్ మరియు డార్క్
ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో అన్యమతస్థుల ప్రవేశంపై బద్రీ-కేదార్ ఆలయ కమిటీ (బి.కె.టి.సి) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో పాటు కమిటీ పరిధిలోని 47 ఆలయాల్లోకి ఇకపై సనాతన ధర్మంపై నమ్మకం లేని వారికి ప్రవేశం ఉండదని కమిటీ స్పష్టం చేసింది. అన్యమతస్థులు ఎవరైనా ఈ క్షేత్రాలను దర్శించుకోవాలంటే, తమకు సనాతన ధర్మంపై పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని
కోటి మొక్కల సంకల్పంతో ధరిత్రిని పచ్చని తోరణంగా మార్చిన అపర భగీరథుడు, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జీవిత ప్రస్థానం ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతమైంది. పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ఈ మహనీయుడి కథ ఆధారంగా తెరకెక్కిన వనజీవి రామయ్య బయోపిక్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డుల్లో ఉత్తమ లఘు చిత్రాల విభాగంలో ఎంపికై చిత్ర యూనిట్
తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రత్యర్ధులను విమర్శించే క్రమంలో కొందరు నాయకులు తమ నోటికొచ్చింది మాట్లాడి వివాదాల్లో నిలుస్తున్నారు. డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ మాటల మధ్యలో నోరు జారారు. నాకు నయనతార కావాలి. నా కల నేరవేరుస్తారా? అని ఆయన స్టాలిన్‌ను ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సందడి మొదలవ్వడంతో తమిళనాడులో అధికార
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీలీల కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 19వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హాలీవుడ్ నటుడు జేవియర్ బార్డెమ్‌తో కలిసి ఆమె ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ అవార్డును ప్రదానం చేసేందుకు వేదికపైకి వచ్చారు. ఈ ఏడాది భారతీయ అభిమానులకు ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. అంతర్జాతీయ వేదికపై భారతీయ
పవన్‌కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఉస్తాద్ ట్రైలర్ విడుదలైంది. పవన్‌కల్యాణ్ స్వాగ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంది. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తమిళ దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తమిళ సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ప్రముఖ నటుడు నాజర్, నిర్మాత విశాల్ కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం
నేటి ఆధునిక కాలంలో డబ్బు, కుటుంబం మరియు మనుషుల ఆశయాల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం కార్మేని సెల్వం. పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా, రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళం) ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సముధ్రఖని కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్ర పోషించగా, లక్ష్మీ
భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో నటప్రపూర్ణ కత్తి కాంతారావు స్మారక జాతీయ పురస్కారాన్ని నటుడు డా.రాజేంద్ర ప్రసాద్‌కు అందజేశారు. నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని వచ్చినా మారనిది మన రాజేంద్రప్రసాద్ హాస్యం, దానికి పోటీ లేదు. ఎన్ని ఏళ్ళు అయినా సరే మనం నవ్వుకుంటూనే ఉంటాం. రాజేంద్రప్రసాద్ కామెడీని దేశ ప్రధాని పీవీ నరసింహారావు ప్రశంసించారు. అలాగే దిగ్గజ సినీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు ఇప్పటికే
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన సరస్వతి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిన్నారులపై జరిగే అత్యాచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు సమాజానికి పెద్ద ప్రమాదంగా మారుతున్నాయని ఆమె అన్నారు. అలాంటి
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నారు. తాను ప్రేమించిన కావ్యా రెడ్డితో ఆయన హైదరాబాద్‌లో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, సన్నిహితులు సమక్షంలో ఈ కార్యక్రమం సాదాసీదాగా జరిగింది.ఈ నిశ్చితార్థ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు. హీరోయిన్ సంయుక్త మీనన్, దర్శకుడు బోయపాటి శ్రీను సహా పలువురు సినీ ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కమల్ హాసన్‌కు పైడి జయరాజ్ అవార్డు, ఆర్.నారాయణమూర్తికి కాంతారావు అవార్డు, జయసుధకు నాగేశ్వరరావు స్పెషల్ అవార్డు, సుద్దాల అశోక్ తేజకు సినారే అవార్డు, అశ్వనీదత్‌కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు ప్రకటించారు. ఈ అవార్డులను ఈ నెల 19న ఉగాది రోజున ప్రదానం చేయనున్నారు.స్పెషల్ అవార్డులుఎన్టీఆర్
ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు ఆయన భార్య సంగీత నుంచి మరో కొత్త షాక్ తగిలింది. వీరిద్దరి మధ్య జరుగుతున్న విడాకుల వివాదంలో తాజాగా ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఒక కీలక పిటిషన్‌ను దాఖలు చేసింది. విడాకుల కేసు విచారణ పూర్తయ్యే వరకు చెన్నైలోని నీలంకరైలో ఉన్న తమ సొంత నివాసంలోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఒకవేళ
రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈరోజు తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. కాటుక అక్కర్లేని ఆ కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ఆ ముక్కు అంటే అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరియే
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి అంతర్జాతీయ వేదికపై భారతీయ కీర్తి పతాకాన్ని ఎగురవేయబోతుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) వేడుకలో అవార్డు ప్రజెంటర్‌గా ప్రియాంక ఎంపికయినట్లు తెలుస్తుంది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో మార్చి 15న జరగనున్న ఈ మహా వేడుకలో హాలీవుడ్ అగ్ర నటులైన రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ వంటి దిగ్గజాలతో కలిసి
నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పీరియాడిక్ డ్రామా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. నయనతార కథానాయిక. సతీష్ కిలారు నిర్మాణంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లో 111వ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి సినిమాటోగ్రాఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ షూటింగ్ లొకేషన్ నుండి ఒక ఆసక్తికరమైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో
సంక్షోభ సమయంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దుబాయ్‌లో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతు సహాయం అందిస్తానని సోనూ సూద్ ప్రకటించారు. విమానాలు రద్దు కావడంతో దుబాయ్‌లో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రయాణికులకు ఉచితంగా
అల్లూ వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి నయనికా రెడ్డితో ఈ నెల 6న శిరీష్ వివాహం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా అల్లూ కుటుంబం హైదరాబాద్‌లోని అల్లూ స్టూడియోస్‌లో భారీ స్థాయిలో ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే నూతన వధూవరులను
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా బ్యాండ్ మేళ. సతీష్ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఈ సినిమాలోని రెండోపాటను విడుదల చేశారు. పల్లెలోని సందళ్లన్నీ మీవే అంటూ సాగే ఈ మెలొడీ సాంగ్‌ని అగ్ర హీరో రవితేజ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను విజయ్ బుల్గానిన్ స్వరపరచగా, శ్వేతా మోహన్ ఆలపించారు. హీరోహీరోయిన్ల స్కూల్,
జియో హాట్‌స్టార్ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ప్రస్తుతం ఈ షో చిత్రీకరణ దశలో ఉన్నది. ఈ షోకు చెందిన ఎక్స్‌క్లూజివ్ చిత్రాలు రీసెంట్గా బయటకు వచ్చాయి. విశాలమైన మాన్షన్‌లో 10మంది సెలబ్రిటీలు 70రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రేమ, నమ్మకం, సహనం ఈ మూడింటి భాగస్వామ్యాన్ని 24/7 కెమెరాల పర్యవేక్షణలో పరీక్షించే విధంగా ఈ లవ్ మ్యాన్షన్‌ని డిజైన్ చేశారు. బయటి ప్రపంచంతో ఎలాంటి
టాలీవుడ్ కొత్త జంట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందనలకి స్పెషల్ సర్ప్రైజ్ని ఇచ్చారు రణబాలి మేకర్స్. వీరిద్దరూ జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం రణబాలి. ఈ సినిమాలో విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మగా నటిస్తున్నారు. ఇటీవల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన వీరికి చిత్రబృందం స్పెషల్ సర్ప్రైజ్ని ఇస్తూ, చిత్రంలోని రొమాంటిక్ మెలోడీ ఎందయ్య సామి పాటను విడుదల చేశారు. ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్
అన్షు మరియు వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ హుషారు పిట్టలు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ విడుదల చేస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ
రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి తర్వాతి వేడుకలను మరింత ప్రతిష్ఠాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నూతన దంపతులు ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తుంది. ఈ భేటీ పెళ్లికి ముందే జరుగగా, దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది విజయ్ టీమ్. పెళ్లికి ముందు
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 27 రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్యాలెస్ వేదికగా కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్లు వేసి విజయ్ దేవరకొండ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముందుగా తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుగగా, అనంతరం
బాలీవుడ్ నుంచి రాబోతున్న ది కేరళ స్టోరీ 2 – గోస్ బియాండ్ చిత్రానికి కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా విడుదలపై ఫిబ్రవరి 26న విధించిన 15 రోజుల స్టేను జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి మరియు జస్టిస్ పి.వి. బాలకృష్ణన్లతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సెన్సార్ బోర్డు నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఇక గురువారం సాయంత్రం 4:30
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రానికి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. జాన్వీ కపూర్ కథానాయిక. సెకండ్ సింగిల్ రై రై రారా విడుదలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 2న ఈ మాస్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సుమారు 1000 మంది డ్యాన్సర్లతో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ ఇంట్రడక్షన్
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (విరోష్) వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులకి వారు శుభలేఖలు పంపడం జరిగింది. అయితే విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి, నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన సందేశంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు అభినందనలు తెలియజేసిన ప్రధాని, ఈ వివాహాన్ని వారి జీవితాల్లో
అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న చిత్రం వృషకర్మ. కార్తీక్ దండు దర్శకత్వం. మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోండగా, లాపతా లేడీస్’ ఫేం స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. ఓ గుహలో చైతూ నడుముకు బెల్ట్,
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పుడు నిజ జీవితంలో వివాహ బంధంతో ఒక్కటవుతున్నా రు. ఈ ప్రముఖ జంట ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులతో కలిసి ఉదయ్‌పూర్‌కు చేరుకున్న ఈ జంట, అక్కడి లగ్జరీ వేదిక మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఎంపిక చేసుకున్నారు. సన్నిహితుల నడుమ సాంప్రదాయ వేడుకగా ఈ వివాహాన్ని అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు. కృష్ణ పోలూరు దర్శకుడు. కె.వి.శ్రీరామ్ నిర్మాత. ఫిబ్రవరి 27న జి5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని హైదరాబాద్‌లో మీడియాకు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ నా కెరీర్‌కి ఈ పాత్ర మైలురాయి లాంటిది. ఇందులో నా పాత్ర తీరుతెన్నులు, మాడ్యులేషన్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట వెడ్డింగ్ సందడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అల్లు అరవింద్ కుమారుడు, టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ -నయానికా రెడ్డి వివాహం మార్చి 6న జరగనుంది. అల్లు వారి ఇంట ఇప్పటికే వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అల్లు ఫ్యామిలీ సంప్రదాయబద్దంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిస్తూ అందరినీ వివాహానికి ఆహ్వానిస్తుంది. తాజాగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు సెలబ్రేషన్స్ కొనసాగుతున్నా యి. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తాజాగా కె.వి. రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు కె రాఘవేంద్రరావు, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి
అల్లు కుటుంబంలో శుభకార్యం సందడి మొదలైంది. అల్లు శిరీష్ తాను ప్రేమించిన నయనికతో మార్చి 6న వివాహ బంధంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వెడ్డింగ్ కార్డుల పంపిణీతో పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. తమ్ముడి పెళ్లి సందర్భంగా అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025కు సంబంధించి జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జీవో విడుదల చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం సన్ ఆఫ్. బత్తుల సతీష్ దర్శకత్వం. ఈ నేపథ్యంలో గురువారం ఊసులాడే అనే పాటను విడుదల చేశారు. భాస్కరభట్ల రచించిన ఈ గీతానికి రిషి ఎం సంగీతాన్నందించారు. ఆదిత్య, సమీర భరద్వాజ్ ఆలపించారు. ప్రేమబంధంలోని మధురానుభూతులకు అద్దం పట్టే గీతమిదని దర్శకుడు తెలిపారు. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ కథలో చక్కటి సందేశం ఉంటుందని హీరో పేర్కొన్నారు. మీరారాజ్, వినోద్‌కుమార్,
మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేష్ దేశ్‌ముఖ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజా శివాజీ గురించి కీలక ప్రకటన చేశాడు. శివాజీ జయంతి సందర్భంగా అతడికి నివాళులు అర్పిస్తూ, చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తూ, ఈ చిత్రానికి
మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబియు) ఛాన్సలర్ మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనితో పాటు వివాదానికి సంబంధించిన అనుబంధ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. కిడ్నాప్
అజయ్ దిషన్, ధనుషా జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ బూకీ. సునీల్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. గణేశ్‌చంద్ర దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. ఈ నెల 20న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ సాంకేతికంగా అన్ని విధాలా సినిమా సమర్ధనీయంగా ఉంటుంది.
టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందనే టాక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సినీ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్ లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా పెళ్లి వేడుక జరపాలని
టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా, అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని విశ్వంభర ట్రైలర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. విశ్వంభర
తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. ఈ విషయాన్ని భువనేశ్వరి తెలియజేశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్, కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది.
యంగ్ హీరో రోషన్ మేక (శ్రీకాంత్ కుమారుడు), టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందుతున్న సరికొత్త చిత్రానికి ఏమో ఏమో ఇది అనే క్లాసిక్ టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ద ఫస్ట్ బ్రీజ్ పేరుతో ఒక చిన్న గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటివరకు హిట్ సిరీస్, సైంధవ్ వంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లతో మెప్పించిన
శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అమరావతికి ఆహ్వానం. ఈ చిత్రాన్ని జీవీకే తెరకెక్కించారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి.రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మూవీ టీమ్
మెగాస్టార్ చిరంజీవి ఇంట మరోసారి పండగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి కవల పిల్లలకు జన్మనివ్వగా, ఈ పిల్లలకు నామకరణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన మనవడు, మనవరాలి పేర్లను ప్రకటిస్తూ ఆ పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగా కవలలకు శివ
శ్రీనాథ్ మాగంటి హీరోగా నటిస్తున్న చిత్రం మెన్షన్ హౌస్ మల్లేష్. బాల సతీష్ దర్శకుడు. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో విశ్వక్సేన్, దర్శకుడు తరుణ్‌భాస్కర్ ఆవిష్కరించారు. రూటెడ్ కథాంశంతో సహజత్వానికి దగ్గరగా అనిపించే చిత్రమిదని, విభిన్న కథగా ఆకట్టుకుంటుందని హీరో శ్రీనాథ్ మాగంటి తెలిపారు. అద్భుతమైన కథ ఇదని, ఆర్టిస్టులందరూ సూపర్ పర్ఫార్మెన్స్ కనబరిచారని విశ్వక్సేన్ అన్నారు. వినోదంతో పాటు
లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం సతీలీలావతి. తాతినేని సత్య దర్శకత్వం. ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో మార్చి 6న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.ఈవెంట్లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. దర్శకనిర్మాతల సపోర్ట్ వల్లే
టాలీవుడ్ యువ నటులు అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం హుషారు పిట్టలు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ ఫిలింస్ విడుదల చేస్తుండగా. ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా మారారు. తన మెడికల్ డిగ్రీని (ఎంబిబిఎస్) విజయవంతంగా పూర్తి చేసిన శ్రీలీల తాజాగా కాన్వోకేషన్ వేడుకలో మెడిసిన్ పట్టాను అందుకుంది. నిజానికి శ్రీలీల తన తల్లి, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత గారిని స్ఫూర్తిగా తీసుకుని మెడిసిన్ వైపు అడుగులు వేశారు. గత ఏడాది
మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా ఇప్పుడు తన జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన మొదటి సినిమా నుంచి వచ్చే రెమ్యునరేషన్‌తో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభిస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాధారణ జీవితం నుంచి సినీ రంగం వరకు ఆమె చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారింది. ప్రయాగ్‌రాజ్‌లో
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా స్వయంభు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో, 3డ్ ఫార్మాట్లో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ క్రీస్తుశకం 985 నాటి పరాక్రమవంతుడైన యోధుడిగా
విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఫంకీ. అనుదీప్ కేవీ దర్శకత్వం. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. తిరుపతిలో ఈ సినిమాలోని యమ యమ్మ అనే గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని దేవ్ పవార్ రచించారు. హుషారెత్తించే మాస్ బీట్తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. నిజమేనా నువ్వేనా, నా కల్లోకొచ్చి కన్నే కొట్టావా.. నా చిలకమ్మా రావమ్మా, ఈ జన్మే నీదమ్మా..నువ్వే
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కాలినడకన తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత తిరుమలకు చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి బండ్ల గణేశ్ తిరుమలకు చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాత్రను పూర్తి చేయడం చాలా
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ వరుస చిత్రాలతో బిజీ అవుతున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు గాయపడ్డ సింహం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి కథానాయికలుగా నటించారు. దర్శకుడు పవన్ సాధినేని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ కలిపిన విడుదల చేశారు. కామెడీ, వ్యంగ్యం, యాక్షన్ అంశాలను కలగలిపి
విష్వక్ సేన్ కథానాయకుడిగా కేవీ అనుదీప్ రూపొందిస్తున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ. కయాదు లోహర్ హీరోయిన్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. అనుదీప్ టేకింగ్, విష్వక్ కామెడీ టైమింగ్ నవ్వులు పంచుతోంది. ప్రేమ, వినోదంతో కూడిన ఓ కుటుంబ కథతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులూ కడుపుబ్బా నవ్వుకునేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం
టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ చాలా కాలం తర్వాత జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే పంచాయితీ సెక్రటరీ అయిన శ్రీరామ్ నీతి, నిజాయితీ అంటూ బ్రతుకుతుంటాడు. అయితే అతడి జీవితంలోకి అనుకోకుండా వచ్చిన సంఘటనలు ఏంటి.. అతడిని పోలీసులు, రౌడీలు ఎందుకు వెతుకుతుంటారు
అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం సీతా పయనం. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ద్వారా అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. నిరంజన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించగా, అర్జున్ స్వయంగా ఒక ప్రత్యేక పాత్రలో మెరవనున్నారు. అలాగే
టాలెంటెడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా, ఫారియా అబ్దుల్లా హీరోయిన్గా వస్తున్న తాజా చిత్రం గాయపడ్డ సింహం. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా, సప్త అశ్వ మీడియా వర్క్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే, అమెరికా వెళదాం అనుకున్న
పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2026 నూతన సంవత్సర కానుకగా జనవరి 1న అధికారికంగా ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు
దేశవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం నాడు సచివాలయంలో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి
మాధవ్ భూపతి రాజు హీరోగా డెబ్యూ ఇస్తున్న చిత్రం మారెమ్మ. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి మాచర్ల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా నటిస్తుండగా, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. బోనాలు,
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.