ఇరాన్‌పై అమెరికా యుద్ధం విషయంలో అమెరికా చట్టసభ నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఎదురుదెబ్బ తగిలింది. అనవసర వ్యయం, అనుచిత నిర్ణయాలతో సాగుతున్న ఇరాన్‌తో యుద్ధాన్ని నిలిపివేయాలని అమెరికా ప్రతినిధుల సభ స్పష్టం చేసింది. యుద్ధ అధికారాల తీర్మానం ( వార్ పవర్స్ రిసొల్యూషన్ )కీలక పరిణామంగా నిలిచింది. గురువారం జరిగిన సభలో సంబంధిత తీర్మానానికి అనుకూలంగా 215 మంది ఎంపిలు, వ్యతిరేకంగా 208 మంది ఓటేశారు. ప్రతినిధుల సభలో
ఏపీ ప్రభుత్వానికి ఉత్తర అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తర్వాత తొలిసారిగా డాలస్ నగరంలో జయరాం కోమటి పర్యటించారు. ఇర్వింగ్‌లోని, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యుడు అనంత్ మల్లవరపు కలిసి జయరాం కోమటికి స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ డాలస్ నగరంలోని
టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో స్కాట్లాండ్లో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. స్థానిక అప్హాల్ కమÖ్యనిటీ ఎడ్యుకేషన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు టీడీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్ పొట్లూరి, డాక్టర్ శ్రీకాంత్ లావు, రమేశ్ గోల్కొండ పాల్గొన్నారు.
వెట్టి చాకిరి నిషేధాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు భారత్‌తో సహా 60 దేశాలపై చర్యలు తీసుకోవాలని యుఎస్ ట్రేడ్ ప్రతినిధి అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. యూఎస్టీఆర్ జెమీసన్ గ్రీర్ ప్రకారం, ఈ విషయంలో తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా విఫలమయ్యాయి. వెట్టి చాకిరి కారణంగా అమెరికా కార్మికులు అంతర్జాతీయ లేబర్ మార్కెట్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకం
అమెరికాలోని న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయం సాధించింది. వివిధ ప్రాంతాల నుంచి పికిల్‌బాల్ క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ టోర్నీకి తెలుగు కుటుంబాలు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు. టోర్నీలో విజేతలకు 500 డాలర్లు, రన్నరప్‌లకు 250 డాలర్లు, ద్వితీయ రన్నరప్‌లకు 150 డాలర్ల నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా తానా కోశాధికారి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు, ఇరాన్ తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో నెతన్యాహుపై ట్రంప్ అత్యంత కఠినమైన, ఘాటైన పదజాలం ఉపయోగించారని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ
అమెరికాలో అక్రమంగా జీవిస్తూ కమర్షియల్ ట్రక్కు డ్రైవర్లు గా పనిచేస్తున్న సుమారు 30 మంది భారతీయులను అరెస్టు చేశారు. ఫెడరల్ ఆపరేషన్‌లో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ట్రక్కు డ్రైవర్లను త్వరలో డిపోర్టు చేయనున్నారు. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. మే 11 నుంచి 15వ తేదీ మధ్య జరిగిన ఆపరేషన్ చెక్‌మేట్‌లో భాగంగా అక్రమ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వం
అమెరికాలో శాశ్వత నివాస హక్కు నిబంధనల విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ జరుగుతున్న సమయంలో వలసదారులు యూఎస్‌ను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) తాజాగా వెల్లడించింది. తాత్కాలిక వలసదారులు గ్రీన్‌కార్డ్ దరఖాస్తులు సమర్పించడానికి స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ మే 21న చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీనిపై తాజాగా డీహెచ్ఎస్ వివరణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) బృందం కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2వ తేదీల్లో అమెరికా మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానించింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల ఆటా సభల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను కేటీఆర్‌కు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ శనివారం తన భర్త మైకేల్ బౌలోస్‌తో కలిసి ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించారు. దాదాపు గంటసేపు ఆ కట్టడంలో గడిపి అనేక విశేషాలు తెలుసుకున్నారు. తన భర్త బౌలోస్తోపాటు కొంతమంది సన్నిహిత స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 11 గంటలకు ఆమె తాజ్‌మహల్‌కు విచ్చేశారు. తాజ్‌మహల్ లోని అనేక ప్రదేశాలను ఫోటోలు తీసుకున్నారు. తాజ్‌మహల్ చరిత్ర, నిర్మాణం గురించి ఆమె ఎక్కువ ఆసక్తి
అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు 60 రోజులపాటు ప్రాథమిక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అలాగే, హార్ముజ్ జలసంధిని తెరవాలని కూడా నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య ప్రధాన అడ్డంకిగా ఉన్న అణ్వాయుధ కార్యక్రమంపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశాలన్నీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. వీటికి
టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు ను అమెరికాతో పాటు పలు దేశాల్లో నివసిస్తున్న ఎన్నారై టీడీపీ నేతలు కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా బే ఏరియాలో మే 28న మహానాడు తో పాటు విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, ప్రజా నాయకుడు, కథానాయకుడు నందమూరి తారక రామారావు జయంతిని నిర్వహించబోతున్నారు. శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ ఏడాది మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఫ్రీమోంట్‌లో
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బొర్సాద్ ప్రాంతానికి చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. అలాగే, తన ఖర్చుల కోసం అక్కడ పని చేస్తోంది కూడా. త్వరలో కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా
పాక్ ప్రభుత్వంపై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో పాక్ మధ్యవర్తిత్వం వహించడమే పెద్ద సమస్య అంటూ ఆయన విమర్శలు చేశారు.అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపుపై పాక్ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ తో పాకిస్థాన్‌కు వైరం ఉందని, దీంతో శాంతి చర్చలకు విఘాతం కలుగుతుందని తెలిపారు. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటలీ, ఇండియా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కీలక దశకు చేరుకునే స్థితికి చేరాయన్నారు. 2025–2029 వరకు ఇండియా–ఇటలీ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను
అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాలోని యాదవపాలేనికి చెందిన పూర్ణ గోపి మృతి చెందగా అతని తల్లిదండ్రులు, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. బాపట్ల కొత్త బస్టాండ్ సమీపంలో నివాసం ఉండే ఆవుల శ్రీనివాసరావు ఇండియన్ ఆర్మీలో పని చేసి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా చేరుకున్నారు. చైనా రాజధాని బీజింగ్‌లో అడుగుపెట్టిన పుతిన్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్‌లో పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. పుతిన్, జిన్‌పింగ్ మధ్య ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ వార్, వ్యాపార, వాణిజ్య,
ఇరాన్లో యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలకు సెనెట్ కళ్లెం వేసింది. కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది. తమ అనుమతి లేకుండా ఇరాన్‌పై సైనిక దాడి చేసేందుకు ట్రంప్‌నకు అవకాశం లేకుండా చేసింది. ఈ అధ్యక్షుడు నిండుగా తూటాలున్న తుపాకీతో ఆడుకుంటున్న చిన్నపిల్లాడిలా ఉన్నాడు అని డెమోక్రటిక్ సెనెటర్ చక్ షుమర్ వ్యాఖ్యానించారు.
భారత్‌తో రక్షణ ఒప్పందానికి అమెరికా క్లియరెన్స్ ఇచ్చింది. సుమారు 4 వేల కోట్ల ఖరీదైన రెండు మిలిటరీ ఒప్పందాలకు అమెరికా విదేశాంగ శాఖ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ డీల్‌లో భాగంగా అమెరికా నుంచి అపాచీ, హోవిజ్జర్ విమానాలను ఇండియా కొనుగోలు చేస్తుంది. అయితే ఆ మిలిటరీ డీల్‌కు అమెరికా సర్కారు అనుమతి దక్కినట్లు తెలుస్తోంది. అపాచీ హెలికాప్టర్ల సపోర్టు సర్వీస్ కోసం సుమారు 19.8 కోట్ల డాలర్లు, ఆల్ట్రా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. పుతిన్, భారత పర్యట షెడ్యూల్ ను క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ తెలిపారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని చెప్పారు. మరింత సమ్మిళిత, సుస్థిర పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, బ్రిక్స్ నాయకులు గత ఏడాది
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, శాంతి స్థాపనకు భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు దైపాక్షిక, దౌత్యపరమైన చర్చలు మాత్రమే మార్గం అని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యుద్ధాన్ని ముగించేందుకు ఇండియా ఎలాంటి
ప్రపంచ సినీ, ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్ఠాత్మక వేడుక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి మనసులు దోచుకున్నారు. ఫ్రెంచ్ రివియేరాలో ఉదయం కలల ప్రపంచాన్ని తలపించేలా కనిపించిన అలియా, సాయంత్రం రెడ్ కార్పెట్‌పై మరింత గ్లామరస్‌గా మెరిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. లొరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన అలియా,
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రవాస భారతీయురాలు ఉషతో తనకు పెళ్లి కాకుంటే తాను జీవితాంతం బ్యాచిలర్ గానే ఉండిపోయేవాడినని చెప్పారు. ఉషను తొలిసారి చూడగానే, చేసుకుంటే ఉషనే పెళ్లి చేసుకుంటా, లేదంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే ఉంటా అని తాను అప్పట్లో తన స్నేహితులతో చెప్పానని అన్నారు. వాన్స్ తన ఆత్మకథ పుస్తకంలో ఈ విషయాలను పంచుకున్నారు. ఈ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చేరుకున్నారు. రాజధాని బీజింగ్‌లో బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ట్రంప్ చైనాలో అడుగుపెట్టారు. రెండు రోజులపాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఒకపక్క ఇరాన్‌తో యుద్ధం సాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్రంప్ అధ్యక్ష హోదాలో చైనాలో
మిత్రదేశం భారత్ కు చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకం రానివ్వమని రష్యా హామీ ఇచ్చింది. భారత్ విషయంలో చమురు సరఫరాలకు సంబంధించిన ఒప్పందాలన్నీ నెరవేరుస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు స్నేహంపై ఆధారపడి ఉన్నాయని, వాటి దారులు వేరయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదని అన్నారు. త్వరలో భారత పర్యటనకు రానున్న లావ్రోవ్ మాట్లాడారు. ప్రపంచం చూసిన శక్తిమంతమైన నాయకుల్లో ప్రధాని మోదీ
అమెరికా దేశం కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆర్కడియా కౌంటీ మేయర్ ఐలీన్ వాంగ్ పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) సంచలన ఆరోపణలు చేసింది. వాంగ్ చైనా కు చట్టవిరుద్ధమైన ఏజెంట్‌గా వ్యవహరించినట్లు అభియోగాలు మోపింది. యాభై ఎనిమిదేళ్ల ఐలీన్ వాంగ్ 2022లో ఆర్కడియా కౌంటీకి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికకు ముందు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సి) కు ఆమె అక్రమ ఏజెంట్‌గా వ్యవహరించారని ఎఫ్‌బీఐ అభియోగాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు చైనాలో పర్యటించనున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ట్రంప్ ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారు. ట్రంప్ తమ దేశ పర్యటనకు వస్తున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. దాదాపు తొమ్మిదేళ్ల అనంతరం ట్రంప్ అమెరికా అధ్యక్షుని హోదాలో చైనాకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ చివరిసారిగా తన తొలి టర్మ్‌లో 2017లో అధ్యక్ష హోదాలో చైనాను
అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన విల్సన్ కాలేజ్ ఆఫ్ టెక్స్టైల్స్ విద్యార్థులను భారతీయ సంతతి వ్యక్తి సర్ప్రైజ్ చేశారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న 176 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల రుణాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. రలేగ్లోని రేనాల్డ్స్ కొలేషియంలో గ్రాడ్యుయేషన్ సెర్మనీ జరిగింది. భారతీయ వ్యక్తి అనిల్ కొచ్చార్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన తండ్రి ప్రకాశ్ చాంద్ కొచ్చార్ జ్ఞాపకంగా విద్యార్థుల రుణాలను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. పంజాబ్‌కు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన తానా స్కాలర్షిప్ వెబినార్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ వెబినార్‌లో కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ, స్కాలర్షిప్ అవకాశాలపై విలువైన సూచనలను అందించారు.ఉన్నత విద్య అవకాశాలపై ఆసక్తితో విద్యార్థులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో ఈ వెబినార్‌లో పాల్గొన్నారు. కళాశాల ప్రవేశాలు, స్కాలర్షిప్లు పొందే విధానాలు, విద్యార్థుల
గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న మరుసటి రోజునే భారత విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన అమెరికాలో జరిగింది. మహమ్మద్ కుమెల్ షేక్ (26) శాన్ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఇటీవలే స్నాతకోత్సవ వేడుకల్లో … తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. అయితే, ఆ మరుసటి రోజే కుమెల్ తన నివాసంలో విగతజీవిగా కనిపించడంతో స్నేహితులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నిద్రలోనే కార్డియాక్ అరెస్టుకు గురై మృతి
తమ దేశంపై దాడులకు దిగుతున్న అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు 1000 శాతం సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఒకవైపు శాంతి ప్రక్రియ జరుగుతుండగా, ఇంకోవైపు అమెరికా సైనిక చర్య సరికాదని ఇరాన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రతిసారీ అమెరికా సైనిక చర్యకు దిగుతోందని విమర్శించారు. ద్వైపాక్షిక పరిష్కారం అందుబాటులో
గత ఐదుసంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఎడతెరపి లేకుండా కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపేందుకు తనవంతు కర్తవ్యంగా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయినా యుద్ధం మాత్రం ఆగడం లేదు. పలుదఫాలుగా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీలతో చర్చలు జరిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. యుద్ధం వల్ల ఇప్పటికే రెండుదేశాలు
బ్రిటన్ పార్లమెంట్లో ని ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్)లో లైఫ్ పీర్‌గా నియమితులైన భారత సంతతికి చెందిన ఉదయ నాగరాజు మొదటిసారి సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. హరింత ఇంధనంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ 2030 నాటికి దేశంలో కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తిని సాధించాలన్న లక్ష్యాన్ని కొనియాడారు. ఈ ప్రక్రియలో సాంకేతికత, సృజనాత్మకతకు కృత్రిమ మేధస్సు (ఏఐ)ని జోడిస్తే అద్భుతాలు సాధించగలమని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శనిగరం
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కమిటీలు అన్నీ రద్దయ్యాయి. రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్ఆర్ఐ కమిటీలను రద్దు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు.త్వరలోనే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త సభ్యత్వ
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో యాడమ్స్ టౌన్లో తెలుగుదేశం పార్టీ ఎన్ ఆర్‌ఐశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎపీఎన్ఆర్‌టి చైర్మన్ రవి కుమార్ వేమూరి పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డబ్లిన్, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో సాగాయి. కార్యక్రమం ప్రారంభంలో పార్టీ నాయకులు, సభ్యులు కలిసి
హార్ముజ్ జలసంధి అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పతనమైందని, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తమకు ఇరాన్ తెలిపినట్లు ట్రంప్ అన్నారు. పతనం అంచున ఉన్నందున తాము హార్ముజ్ జలసంధిని వెంటనే తెరుస్తామని ఇరాన్ కోరిందని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ అంశంపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, హార్ముజ్‌ను తెరిచేందుకు
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు కార్యకర్త వి.శ్రీశైలానికి ఎన్నారై తెలుగుదేశం కువైట్ సాయంగా నిలిచింది. తెలంగాణకు చెందిన టీడీపీ కార్యకర్త వి.శ్రీశైలం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ఎన్నారై టీడీపీ కువైట్ నాయకుల దృష్టికి వచ్చింది. సోషల్ మీడియాలో పార్టీకి చురుగ్గా సేవలు అందిస్తున్న శ్రీశైలం క్యాన్సర్ బారిన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎన్నారై టీడీపీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకరరావు, ఎన్నారై టీడీపీ
యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒపెక్, ఒపెక్ ప్లస్ దేశాల కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మే 1వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా కు యూఏఈ నిర్ణయం పెద్ద దెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లో చాలా ఏళ్లుగా
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 26వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా లండన్‌లో ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ నిర్వహించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎందరో
రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని ఏపీ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రతేక ప్రతినిధి కోమటి జయరాం పిలుపునిచ్చారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మెట్రో వర్జీనియాలో నార్త్ అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సభకు భాను మాగులూరి అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా తీరుపై అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయనను అభిశంసించాలని 55 శాతానికిపైగా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్‌పై ట్రంప్ ఏకపక్షంగా సాగిస్తున్న యుద్ధాన్ని 66 శాతానికిపైగా ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు జాతీయ స్థాయి సర్వే తెలిపింది. ఇరాన్ యుద్ధం పేరుతో అమెరికా చేస్తున్న వ్యయం సరైంది కాదని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. ఏప్రిల్ 10-14 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 1,514
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను తగ్గించేందుకు, చిన్న రైతులకు సహాయంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోశాధికారి, ప్రముఖ ఎన్ఆర్ఐ రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేసవి కాలంలో తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ. 4 లక్షల విలువైన తాగునీటి ట్యాంకర్‌ను హనుమాన్ జంక్షన్, వీరావల్లి, పరిసర గ్రామాల ప్రజలకు అందజేశారు. చిన్న రైతులకు ఉపయుక్తంగా రూ. 75
భారత ప్రయాణికులకు ఫ్రాన్స్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే భారతీయులకు ఇక నుంచి ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల్లో వేచి ఉండి, అక్కడి నుంచి మూడో దేశానికి వెళ్లేటప్పుడు
ఇటీవల మృతి చెందిన ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం, పొలాస గ్రామానికి చెందిన ఆరెల్లి గంగారాజం గల్ఫ్‌లో ఉండగా అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లడంతో స్వదేశానికి తరలించాల్సి వచ్చింది. ఇక్కడ చికిత్స పొందుతూ పదిరోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం
వీసా ఫీజులను పెంచి పలు దేశాలు హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. అక్రమ వలసల నెపంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు రకాల ఫీజులను భారీ పెంచింది. బ్రిటన్ కూడా యూఎస్ తరహలోని వీసా రుసుంలను పెంచింది. తాజాగా కెనడా మాత్రం అందుకు భిన్నంగా వీసా ఫీజులను తగ్గించింది. తాత్కాలిక నివాస దరఖాస్తులతో పాటు విజిటర్స్ వీసా, స్టడీ పర్మిట్స్, సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని
ఆస్ట్రేలియాలోని పాయింట్ కుక్ మెల్బోర్న్లో టీడీపీ మెల్బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యక్షురాలు సుమ తాతినేని కీలక పాత్ర పోషించారు. టీడీపీ మెల్బోర్న్ అధ్యక్షుడు శ్రీకాంత్ కొణెదన మాట్లాడుతూ చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, టెక్నాలజీ, అభివృద్ధి విషయంలో ముందుచూపు ఉన్న నాయకుడని కొనియాడారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే సామర్థ్యం ఆయనకు ఉందని
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు దశకు చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసిన తర్వాత ఇరాన్‌తో యుద్ధానికి సిద్ధమవుతామని ప్రకటించారు. కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా
కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ జగిత్యాల కేసీఆర్ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రజలంతా కేసీఆర్ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే
చమురు సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఊరటనిచ్చేలా అమెరికా నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇతర దేశాలకు అమెరికా అనుమతినిచ్చింది. ఇది ఇండియా సహా అనేక దేశాలకు ఊరట కలిగించే విషయం. గతంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల్ని అమెరికా విధించింది. అనంతరం ఇరాన్ యుద్దం నేపథ్యంలో ఆంక్షల్ని సడలించింది. తిరిగి మళ్లీ ఆంక్షలు విధించింది. ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకుని, రష్యా నుంచి
జగిత్యాల లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా
అమెరికా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ (47) తన భార్య డాక్టర్ సెరీనా ఫెయిర్‌ఫాక్స్ (49)ను కాల్చి చంపి, ఆపై తాను కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన వాషింగ్టన్ డిసి శివారు ప్రాంతమైన అన్నందలేలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జస్టిన్ ఫెయిర్‌ఫాక్స్ తన భార్యను ఇంటి బేస్మెంట్లో కాల్చి చంపి, ఆ
అమెరికా, ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు జరగబోతున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా రెండో దశ శాంతి చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా తాజాగా మరో హెచ్చరిక జారీ చేసింది. ఈసారి శాంతి చర్చలు విఫలమైతే యుద్ధం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభిస్తామని, ఇందుకు సిద్ధమవుతున్నామని అమెరికా రక్షణ శాఖ సెక్రెటరీ పీట్ హెగ్సెత్ అన్నారు. ఇరాన్
ఇరాన్ -అమెరికా తదుపరి చర్చల దశ త్వరలో ఉండవచ్చని పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. పార్లమెంట్ భవనం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకోలేదని, దీంతో చర్చలు కొంత మేర ఫలించాయన్న భావన కలిగిందని అన్నారు. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు నిర్మాణాత్మక దిశలో సాగుతున్నాయని సూచించారు.అమెరికా, ఇరాన్ మధ్య 21గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ, శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన సంగతి
అమెరికాలో మరో భారత సంతతి మహిళ ఉన్నత పదవికి పోటీ పడుతున్నారు.ఈ క్రమంలో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి కోసం తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు స్వయంగా వెల్లడించిన ఆమె, విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం న్యూయార్క్ అటార్నీ జనరల్‌గా ఉన్న లటీషియా జేమ్స్‌తో సరిత తలపడనున్నారు. ఈ నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. అమెరికా రాజకీయాల్లో
ఆస్ట్రేలియా చరిత్రలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 125 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళను ఆర్మీ చీఫ్ గా నియమించింది. దేశ రక్షణ దళాల నాయకత్వంలో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా, చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ తమ సైన్యాధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం (ఏప్రిల్ 13) ప్రకటించింది. ప్రస్తుత జాయింట్ క్యాపబిలిటీస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సూసన్ కోయిల్ జూలైలో సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆస్ట్రేలియా
హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అయితే, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశంగా పేరున్న బ్రిటన్ షాకిచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తాము ట్రంప్‌నకు మద్దతు ఇవ్వడం లేదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. హార్ముజ్‌ను దిగ్బంధించాలంటూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తమ దేశం ఉద్రిక్తతలు
యునైటెడ్ కింగ్డమ్ లో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఈ విషయాన్ని యూకే హోంశాఖ మంత్రి షబానా మహమూద్ సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రి వెల్లడించిన ప్రకారం యూకేలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అక్కడ ఐదేళ్లు ఆవాసం ఉండి ఉండాలి. ఇప్పుడు ఆ ఐదేళ్ల గడువును పదేళ్లకు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరికొందరికి ఈ వ్యవధిని 20 ఏళ్లకు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇరాన్‌తో శాంతి చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు అతిపెద్ద చమురు ఆర్థిక వ్యవస్థలైన రష్యా, సౌదీ అరేబియా కంటే తమ వద్దే ఎక్కువ చమురు ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగిన చమురు, గ్యాస్‌ను నింపుకోవడానికి ప్రపంచ దేశాలకు చెందిన అనేక ఖాళీ చమురు ట్యాంకర్లు అమెరికా తీరంవైపు వస్తున్నాయని పేర్కొన్నారు. మేం మీకోసం ఎదురు చూస్తున్నాం.. త్వరితగతిన స్పందించండి అంటూ
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలని అమెరికాపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహూ అనేకసార్లు వత్తిడి చేసినట్లు చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షులపైన కూడా గతంలో ఒత్తిడి జరిగినట్లు ఆయన చెప్పారు. కానీ నెతన్యహూ ప్రెజర్‌కు ట్రంప్ ఒక్కరూ ఒప్పుకున్నారని తెలిపారు. నెతన్యహూతో అనేక సార్లు చర్చలు జరిపానని, ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని అమెరికాపై వత్తిడి తెచ్చేవారని, ఇరాన్‌పై మిలిటరీ
వాషింగ్టన్లో వైట్ హౌస్‌లో విడుదల చేసిన ప్రకటనలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అబ్బద్ధమని, అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. అలాగే ఆయన నేరాల గురించి తనకు ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను పూర్తి అసత్యాలుగా పేర్కొంటూ, ఇవి తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలని విమర్శించారు.
అమెరికాతో ఆటలు ఆడాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్‌ను హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధానికి విరామం ప్రకటించినందున శాంతి చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా వైఖరిని స్పష్టం చేశారు. తమ అధ్యక్షుడి ఆదేశాల మేరుకు దౌత్యపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమయంలో ఇరాన్ తమతో ఆటలు ఆడాలని చూస్తే సహించబోమని వాన్స్ స్పష్టం చేశారు. ఆరు
భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్-అమెరికన్ డ్రగ్ డీలర్ జస్వీన్ సంఘాకు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. హాలీవుడ్ ప్రముఖలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. జస్వీన్ సంఘా వయసు 42 ఏళ్లు, ఆమెను కీటమైన్ క్వీన్ గా పిలుస్తారు. ఫ్రెండ్స్ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో ఆమెకు ఆ శిక్ష పడింది. భారతీయ సంతతికి చెందిన జస్వీన్‌కు ద్వంద్వ పౌరసత్వం ఉన్నది. అమెరికా, బ్రిటీన్లో ఆమెకు
అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం మొదలవుతుందని అన్నారు. ఒప్పందం కుదరకపోతే ఈ సారి మరింత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. ఇరాన్ ఇప్పటికే బలహీనపడిందని, అవసరమైతే పూర్తిగా నాశనం
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ప్రకటన వెలువడిన వెంటనే లెబనాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. మొత్తం 254 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడికి పాల్పడటంతో ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది. తాజాగా అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా
ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధంలో అమెరికా దళాలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం, దానిలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డులు ప్రకటించారు. పైలట్‌ను రక్షించామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ అందించింది. దాని ప్రకారం…కూలిపోయిన
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇండియా చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది. ఆయిల్, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరాను పెంచబోతున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా మొదటి డిప్యూటీ ఛైర్మన్ డెనిస్ మాంటురోవ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా చమురు సరఫరాపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ పై డోనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. వ్యాపారి, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో ఫైళ్లను సరైన రీతిలో హ్యాండిల్ చేయలేదన్న నెపంతో పామ్ బాండీపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ట్రంప్, బాండీ సన్నిహితులే. కానీ ఎప్స్టీన్ ఫైళ్ల కేసును హ్యాండిల్ చేసిన తీరు పట్ల డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఆమెపై ఆగ్రహంగా ఉన్నారు. మన్‌హట్టన్ జైలులో ఎప్స్టీన్ మృతిచెందిన అంశాన్ని కూడా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తానా సౌత్ ఈస్ట్ విభాగం వారు అట్లాంటాలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మార్చి 29న స్థానిక అకేషన్స్ వేదికగా జరిగిన ఈ శిబిరానికి ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు వారు హాజరై ఆపద సమయంలో చేయాల్సిన వైద్య చికిత్స చర్యలను తెలుసుకున్నారు. నాయకత్వం సమన్వయం.. తానా
అమెరికా కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ ను రూపొందిస్తున్నది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పనులు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌పై మరిన్ని ఆంక్షలు విధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్టు రూపకల్పనలో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ
అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి (వర్జీనియా) ప్రాంతంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భాను మాగులూరి మాట్లాడుతూ 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని తెలిపారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, ఆ తరువాత అనే విధంగా తెలుగునాట ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో పార్టీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. దేశంలో సంక్షేమ
ఇరాన్‌పై అమెరికా భీకరంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. విధ్వంసకర పేలుడు పదార్ధాలు, క్షిపణులను ఆ దేశం వినియోగిస్తున్నది. చాలా ఖరీదైన ఆ ఆయుధాల వల్ల, అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నది. ఇరాన్ వార్ కోసం అమెరికా ఖర్చు చేస్తున్న గణాంకాలను పరిశీలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇరాన్ వార్ కోసం ప్రతి సెకనుకు అమెరికా సుమారు 9.8 లక్షలు(10వేల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం
ఒకవేళ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకున్నా, ఆ దేశంపై చేపట్టిన యుద్ధాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సహచరులతో వెల్లడించినట్లు తెలుస్తోంది. హోర్ముజ్‌ను మరో సందర్భంలో తెరిచేందుకు వత్తిడి చేయనున్న పేర్కొన్నారు. ట్రంప్ సర్కారులో ఉన్న అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధిని విదేశీ నౌకలకు ఓపెన్ చేసే వరకు ఇరాన్ అంతుచూస్తామని ట్రంప్ పదేపదే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అమెరికాలోని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ కోరారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ల ఆధ్వర్యంలో ఐటీ రంగం వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో
ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారనడం నిజం కాదని వెల్లడించింది. ఈ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మెట్టు దిగారు. యూఎస్-ఇజ్రాయెల్‌తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించారు. గతంలో తాను ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్‌ను ఉపసంహరించి ఇరాన్‌కు మరో ఐదు రోజులు గడువిస్తున్నట్టు ఈ నెల 23న ట్రంప్ ప్రకటించారు. అయితే దానికి స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని అధ్యాయానికి అధ్యక్షుడు ట్రంప్ నాంది పలుకబోతున్నారు. త్వరలో ట్రంప్ సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వ్యక్తి సంతకంతో కరెన్సీ నోట్ల ను ముద్రించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కొత్తగా ముంద్రించబోయే అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్
భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ, తాను మాటల మనుషులం కాదని, చేతల మనుషులమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాట చాలామంది ఇతర దేశాల అధినేతలకు వర్తించదని అన్నారు. భారత్‌తో బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ నుంచి తమ దేశానికి వచ్చే సందర్శకులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఆస్ట్రేలియా హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇరాన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించడానికి అనుమతి
కెనడా చట్టసభ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. విద్వేషపూరిత చర్యలు, నేరాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన కంబాటింగ్ హేట్ బిల్లుకు ఆ దేశ చట్టసభ ఆమోదం తెలిపింది. ఈ కీలక బిల్లుకు హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ బిల్లును ఎగువసభకు పంపించారు.ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వస్తే ప్రార్థనా స్థలాలపై దాడులకు, ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం
నీరవ్ మోదీకి లండన్‌లో మరోసారి చుక్కెదురైంది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన తరపు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఆఫ్ జస్టిస్ కింగ్స్ బెంచ్ డివిజన్ తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్నారు. ఆయనను స్వదేశానికి పంపించాలని భారత్ కోరగా గతేడాది అక్కడి కోర్టు అంగీకరించింది.
ఇరాన్‌తో శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందిస్తోంది. ముందుగా చర్చల ప్రసక్తే లేదని తేల్చిన ఇరాన్, ఇప్పుడు మాత్రం స్వరం మార్చింది. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే అమెరికాతో చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు అమెరికాకు కీలక ప్రతిపాదనలు చేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక క్యాంపులను ఎత్తివేయడం అన్నింటికంటే కీలకమైన షరతు. అలాగే, ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడంతోపాటు నౌక
ఇరాన్‌పై దాడి చేసిన అమెరికా దూకుడు వైఖరిని ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తప్పుపట్టారు. పార్లమెంట్లో మాట్లాడుతూ తమ దేశం సమకూర్చుకుంటున్న అణ్వాయుధాలను ఆయన సమర్ధించుకున్నారు. కిమ్ ప్రసంగానికి చెందిన అంశాలను మంగళవారం ఆ దేశ మీడియా రిలీజ్ చేసింది. దేశంలో అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కిమ్ చెప్పారు. సైన్యం, భద్రత అంశంలోనూ తమ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. ఇరాన్లో కొనసాగుతున్న అమెరికా దాడుల
జపాన్‌లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా పార్క్‌లో ఉగాది పండుగను తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన
గల్ఫ్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఒమాన్ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో ఒమాన్ తెలంగాణ సమితి (ఒ.టి.యస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలై సాయంత్రం మహాప్రసాదంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో భారతీయ రాయబారి జి.వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒమాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలన్నీ కూడా సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని శివపార్వతులను ప్రార్థించామని ముఖ్య
ఇరాన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్ యుద్ధం సహా పశ్చిమాసియా పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ఇటు ప్రధాని మోదీ పేర్కొనగా, అటు అమెరికా తరఫున ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హార్ముజ్ జలసంధిని తెరవడం చాలా
పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు మిస్సైల్లు, డ్రోన్లతో ఇరాన్ పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ తనచుట్టూ ఉన్న దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన, ఇజ్రాయెల్‌పైన భీకర దాడులు చేస్తున్నది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్, బ్రిటన్ కు తీవ్రమైన హెచ్చరికలు చేసింది. తమపై దాడుల కోసం అమెరికా దళాలకు బ్రిటన్ తన సైనిక స్థావరాలను ఉపయోగించుకునే అవకాశం ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ వివాదంలో
గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, ఎన్నో కోట్ల విలువైన ఆస్తిలు ధ్వంసమయ్యాయి. ఇంత జరిగిన ఈ యుద్ధ వాతావరణం చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో ఇంధన లోటుతో పలు దేశాలు ఇబ్బందులు ఎదురుకుంటున్నాయి. తాజాగా హర్మూజ్ జలసంధిని తెరవాలని
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్, పర్షియన్ నూతన సంవత్స నౌరుజ్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, ప్రపంచ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ప్రధాని ఖండించారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగాలని, నౌకామార్గాలు తెరచి ఉంచడం,
ఉన్నత చదువుల కోసం, పర్యటన నిమిత్తం బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని కేటగిరీల వీసా దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు బ్రిటన్ హోమ్ ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. సవరించిన ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో విదేశీయులపై దాదాపు 6 నుంచి 7 శాతం వరకు అదనపు
ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు. ఈ విషయాన్ని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన మిస్సైల్ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.టెర్రరిస్టులు అయిన అమెరికా, జియోనిస్టులు జరిపిన దాడిలో తమ జనరల్ నైని వీరమరణం పొందారని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనితోపాటు సెక్యూరిటీ
జపాన్ ప్రధాని సనేయి తకాయిచికి షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌ను జపాన్ ప్రధాని కలిశారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మిత్ర దేశాలతో సంప్రదింపులు చేయకుండా ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారని ఓ రిపోర్టర్ అడిగారు. దానికి ట్రంప్ స్పందిస్తూ తనదైన స్టయిల్లో జోకేశారు. తాము ఆ దాడి గురించి ఎవరికీ చెప్పలేదని, ఎందుకంటే మేం సర్ప్రైజ్
ఒక పక్క ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో పాల్గొంటూనే మరో పక్క తమ దేశంలో కార్యకలాపాల్ని ఇరాన్ సైలెంటుగా కానిచ్చేస్తోంది. తాజాగా ముగ్గురిని ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. మృతుల్లో 19 ఏళ్ల రెజ్లర్ కూడా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇరాన్లో ప్రజల్లో తిరుగుబాటు మొదలైన సంగతి తెలిసిందే. అక్కడి ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరెన్సీ
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. కొరియాలో అతిపెద్ద వ్యవస్థ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ. ఇదే అక్కడ దేశాన్ని పాలించే పార్లమెంటరీ. ఈ నెల 15న ఉత్తర కొరియాలో 15వ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఇందులో కిమ్ పార్టీ అయిన వర్కర్స్ పార్టీ
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ.2.40 లక్షలు) ఎగ్జిట్ బోనస్ గా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది.
గత కొన్ని రోజులుగా పశ్చియాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా యుద్ధ వాతావరణం చల్లబడటం లేదు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. అయితే
అమెరికా కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్ ను భారత్‌లో అరెస్ట్ చేశారు. అతడితోపాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులు ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులో ఉన్నారు. వారు పర్యాటక వీసాపై దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, భారత్ వ్యతిరేక సంస్థలతో పనిచేస్తున్నారని ఎన్ఐఏ వెల్లడించింది. మాథ్యూ వాన్‌డైక్ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రానికి చెందినవాడు. అతను తనను తాను ఒక అంతర్జాతీయ వ్యాపారవేత్తగా, సైనికుడిగా, వార్ కరస్పాండెంట్‌గా, కాలమిస్ట్‌గా వెబ్సైట్లో
అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో అగ్ర నేతల్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్‌లో జరిపిన కాల్పుల్లో ఖతిబ్ మరణించినట్లు ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. అయితే, ఈ విషయాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, నిఘా వ్యవస్థ, గూఢచర్యంతోపాటు ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్
తమ దేశంపై దాడి చేసిన అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యం అని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని స్పష్టం చేసినట్లు సమాచారం. ఖమేనికి సంబంధించిన వివరాలేవీ తెలియనప్పటికీ, ఆయన మాత్రం ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌లపై ప్రస్తుత యుద్ధ సమయంలో అనుసరించాల్సిన విధానంపై జరిగిన ఒక విధానపరమైన సమీక్షా సమావేశం సందర్భంగా ఖమేని ఈ మాటలు చెప్పినట్లు ఇరాన్ అధికార వర్గాలు
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో లారిజాని మరణించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. ఈ దాడిలో లారిజానితోపాటు ఇరాన్ టాప్ కమాండర్ గోలాంరెజా సోలేమని కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని అంతమైన తర్వాత కూడా అమెరికా, ఇజ్రాయెల్
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.