My Telugu NRI

Mobile Scrollable Menu
జగిత్యాల కేసీఆర్‌ సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్

కేసీఆర్ భారీ బహిరంగ సభ ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో లండన్ పర్యటనలో ఉన్న మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ జగిత్యాల కేసీఆర్‌ సభ పోస్టర్ ని ఆవిష్కరించారు. ప్రజలంతా కేసీఆర్‌ సందేశం కోసం ఎదురుచూస్తున్నారని, అలాగే

మహిళా బిల్లుపై ప్రధానికి నిజాయతీ లేదు: సిఎం రేవంత్

మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు

జగిత్యాల సభను విజయవంతం చేయాలి : రాధారపు సతీష్

జగిత్యాల లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్‌ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లలో ఆదర్శవంతమైన పాలన అందించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ను నెరవేర్చడానికి బీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించి అనేక పోరాటాలు చేసి తన ప్రాణాలను పణంగా

మహిళా లోకానికి ఇది చీకటి రోజు : డీకే అరుణ

మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అత్యంత దారుణమని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బిల్లును వ్యతిరేకించిన వారికి చీకటి రోజులు దగ్గర పడ్డట్టేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో

అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం

అమెరికా నేషనల్ వార్ కాలేజ్ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎ​​ఐ), సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో స్కిల్డ్ వర్క్‌ ఫోర్స్ సిద్ధంగా ఉందని, టిజి-ఐపాస్ ద్వారా 15 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అమెరికాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక

అమిత్ షా కీలక ప్రకటన.. ఏపీకి 38.. తెలంగాణకు 26

 లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో

మోదీ చర్యలతో దక్షిణాదికి తీవ్ర అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి

మహిళ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ల రెండు అంశాలను బిజెపి కలిపి రాజకీయం చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీ-లిమిటేషన్‌పై మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మహిళ రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు కీలకమైన అంశాలు. రెండు అంశాలు దేశ ప్రజలందరికీ సంబంధించిన కీలక అంశాలు. బిజెపి మాత్రం తమ సొంత వ్యవహారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలు తమకు సహకరించడం లేదని బిజెపి దుష్ప్రచారం చేస్తోంది. మహిళలకు రాజకీయ

కెసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసు

బిఆర్ఎస్‌ అధినేత మాజీ సిఎం కెసిఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసు జారీ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బిఆర్ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అంగన్వాడీ మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైళ్ల కొనుగోలుతో తనకు సంబంధం లేదని సీతక్క అన్నారు. బిఆర్ఎస్‌ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారానికి కెసిఆర్‌దే బాధ్యత అని సూచించారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి

అలా మాట్లాడితే చెప్పు తెగుతది జాగ్రత్త : సీతక్క వార్నింగ్

తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పు తెగుతుంది జాగ్రత్త అంటూ మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం

అన్ని పార్టీల ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలి : డీకే అరుణ

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మద్దతునివ్వాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ బిల్లు ఆమోదంతో దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి నాంది పడుతుందని ఆమె తెలిపారు.యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే మన భారతీయ సంస్కృతి ప్రకారం, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారని, అటువంటి గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో,

బీఆర్ఎస్‌ లోకి వెళ్లి జీవన్ రెడ్డి తప్పు చేశారు: మహేష్ గౌడ్

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీ ముక్కలైంది, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని, కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు తీసుకోవడం వల్లే కాళేశ్వరం కూలిందని మండిపడ్డారు.

రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్‌

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే అని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కెటిఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పాలన అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ డబ్బులు ఇవ్వలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి.. అదే రోజు భారీ బహిరంగ సభ!

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్‌ను కలిసిన సమయంలో జీవన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అన్నా… నన్ను మీతో కలిసి పని చేయమని దేవుడే పంపిండు అంటూ ఆయన కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్నారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.జీవన్

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం  పెంపును ప్రకటిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేలమంది ఆర్టీసీ కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది. తాజా నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెరిగింది. గతంలో ఇది 50.7 శాతం ఉండగా, తాజా పెంపుతో 52.8 శాతానికి చేరుకుంది. గత ప్రభుత్వం చివరిసారిగా

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న

కొత్త పార్టీపై కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తాను స్థాపించబోయే కొత్త పార్టీని ఏప్రిల్ 25న ప్రకటిస్తానని వెల్లడించారు. ఆ రోజు నిర్వహించనున్న సభ కోసం ఇప్పటికే 21 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారని, కార్యక్రమం సజావుగా జరిగేలా బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు 500 మంది వాలంటీర్లను నియమించినట్లు కవిత తెలిపారు. సభకు

రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బిఆర్ఎస్‌తో కలిసి : జీవన్‌ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ శేష జీవితంలో కెసిఆర్‌తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్‌తో కలిసి పని చేస్తే, రాష్ట్ర భవిష్యత్‌కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. 27 నెలలుగా చాలా క్షోభ

కేంద్రం ఆంక్షలు ఎత్తివేయగానే .. హద్దులు మారుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి 

జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ చేపట్టి ప్రజా సమస్యలు తెలుసుకున్నారని ఆయన చెప్పారు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు, నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు.  ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695

మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌ కేసు .. నిందితుల కస్టడీ తీర్పు వాయిదా

మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును కోర్టు వాయిదా వేసింది.  ఉప్పరపల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో ముగ్గురు నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకెళ్లారు. ఈ డ్రగ్స్ కేసులో లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో

దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి

ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హెచ్ఐసిసి లో ఆసియా టెక్స్ టైల్స్ కాన్పరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదు, చేనేతలకు జీవితమని అన్నారు. టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదని, చేనేత జీవితమని అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని అనేక

భవిష్యత్తులో తెలంగాణలోనూ అదే తరహా :  కిషన్ రెడ్డి

కేరళ ఎన్నికల ప్రచారంలో సిఎం రేవంత్ రెడ్డి బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటిలో ఎన్ని అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం చేశారని, కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కెసిఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. బిసిలకు అన్యాయం

పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తా : కవిత

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఫ్రీ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ  ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? అని ప్రశ్నించారు. తమ పార్టీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని

అమరావతికి చట్టబద్ధత బిల్లు.. రైతుల విజయం: ఎంపీ రేణుకాచౌదరి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లుపై ప్రస్తుతం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ తరపున ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి

అమరావతి బిల్లుకు తెలంగాణ బీజేపీ మద్దతు : కిషన్ రెడ్డి

లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి తెలంగాణ బీజేపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం

తెలంగాణలో  మే 11 నుంచి.. జూన్‌ 9 వరకు : కేంద్రం

దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. తొలి విడత ప్రక్రియ ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది. రెండో దశలో జనాభా లెక్కల్ని సేకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇది ప్రారంభం కానున్నది. జనగణన కోసం పౌరులు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టం : సీఎం రేవంత్ రెడ్డి

మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయ నిర్మాణం భగవత్ కార్యంగా భావిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమమని, ముచుకుంద నదికి గొప్ప చరిత్ర ఉందని ఆయన తెలిపారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే

తొలి ముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా తొలి ముద్ద పథకాన్ని సిఎం ప్రారంభించారు. రెడీ టూ కుక్ ఫుడ్ (ఉప్మా, కిచిడీ మిక్స్)ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ

భద్రాచలంలో వైభవంగా రాములోకి కల్యాణోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అంతకు ముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి సిఎం రేవంత్ భూమి పూజ చేయడంతో తొలి విడతలో రూ.351 కోట్లతో

ముహూర్తం ఫిక్స్‌.. ఏప్రిల్‌ 25న కవిత కొత్త పార్టీ

నూతన రాజకీయ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని

ప్రతి నెలా ఆ పథకానికి రూ.89 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి

పాత బకాయిలను సర్దుబాటు చేయడమే ఇబ్బందిగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పాత బకాయిలపై సిఎం మాట్లాడారు. బకాయిలు ఉన్నవాటిలో కూడా ఎక్కువ ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నాయని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించామని, రూ. 2,408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశాం

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఉప్పల్‌లో!

రికార్డు స్థాయిలో మూడోసారి పొట్టి ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన భారత జట్టు  ఐపీఎల్ తర్వాత బిజీగా ఉండనుంది. టీమిండియా 2026-27 సీజన్‌లో తీరిక లేకుండా మ్యాచ్‌లు ఆడనుంది. సొంతగడ్డపై వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ తలపడనుందని గురువారం బీసీసీఐ తెలిపింది. ఇవి మొత్తం 22 మ్యాచ్‌లు ఉండగా, వీటిలో రెండింటికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికవ్వనుంది. బెంగళూరు, గువాహటి, అహ్మదాబాద్, రాంచీలోనూ భారత జట్టు రెండేసి

ధూళిపాళ్ల కుమార్తె వివాహానికి హాజరైన సీఎంలు చంద్రబాబు,  రేవంత్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

కవిత కొత్త పార్టీ ప్రకటనకు.. ముహూర్తం ఖరారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27న శ్రీరామనవమి రోజు పార్టీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. శ్రీరామనవమి రోజు ఉదయం 8 గంటలకు కొత్త పార్టీ ఏర్పాటు తేదీని ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ జాగృతి వర్గాలు చెబుతున్నాయి.ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన ముఖ్య అంశాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన మెట్టినిల్లు నుంచి

కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా

మాజీ మంత్రి, ఎంఎల్‌సి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాలలో ఆయన అనుచరులు, మద్దతుదారుల సమక్షంలో పార్టీకి గుడ్ బై చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నుంచి అవమానాలతోనే గడిచిపోయిందని తెలిపారు. తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శలు గుప్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు

ఏడుగురు ఎమ్మెల్యేలు, స్పీకర్ కు హైకోర్టు నోటీసులు

ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర హైకోర్టు ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇటీవల పార్టీ ఫిరాయింపు కేసులో 10మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు ముగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, దానం నాగేందర్‌, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్‌ గౌడ్, పోచారం, బండ్ల

తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు!

 కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయించింది. ఈ పెంపు జనాభా తేడా లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 179కి, లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతాయి. ఈ నిర్ణయం రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని,

నాకు మంత్రి పదవి ఇస్తే.. కాంగ్రెస్ కే మంచి పేరు

మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో కూడా హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయిట్‌లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. హై కమాండ్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలియదని చెప్పుకొచ్చారు. తాను మంత్రి పదవి కోసం పాకులాడటం లేదని పేర్కొన్నారు. ఏ పదవి లేకున్నా తనకి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్‌కి, రాష్ట్ర

ఈ బిల్లుకు ఆ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి  :  కేటీఆర్

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల బిల్లుకు మద్దతు కోసం అన్నిపార్టీలకు లేఖలు రాస్తామని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన చరిత్ర అసెంబ్లీకి ఉందని ప్రస్తావించారు.

నా నిర్ణయంలో మార్పు లేదు : జీవన్‌రెడ్డి 

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ల భేటీ ముగిసింది. పార్టీ పెద్దల తీరుపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి,  బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో జీవన్ రెడ్డిని కలిసిన మంత్రులు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. చాలా సమయం జీవన్ రెడ్డితో చర్చలు జరిపిన మంత్రులు,పార్టీలో ఆయనకు సముచిత ప్రాధాన్యం దక్కేలా

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎన్ని కోట్లు అంటే!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం విలువ రూ.3,24,234 కోట్లుగా ఆయన వెల్లడించారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతమని ప్రకటించారు. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు

భట్టి బడ్జెట్ ..బోగస్ బడ్జెట్ : హరీశ్‌రావు

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బోగస్, బడా జూటా అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఘోరీ కట్టారని దెప్పిపొడిచారు. ఈ బడ్జెట్‌ను చూస్తే ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ సర్కార్‌కు చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమైందని అన్నారు. ఈ బడ్జెట్‌‌లో గతం

ఉగాది వేళ సీఎం రేవంత్ రెడ్డి .. గుడ్ న్యూస్

తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 22వ తేదీన రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ లో జరిగిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ

కవిత కొత్త పార్టీ .. పేరు ఇదే!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆమె ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. కల్వకుంట్ల కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరు ఖరారైంది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పొలిటికల్ పార్టీని ఆమె ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఈ పార్టీ పేరిట

శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు .. సిఎం రేవంత్ కు ఆహ్వానం

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మా ప్రమేయం లేదు : సీఎం రేవంత్

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు.  మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశాం అని చెప్పారు. 2029లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. 2028లో ఎన్నికలు రావని తెలిపారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా

వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం : సీతక్క

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సత్యదూరమైన మాటలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.  స్త్రీ నిధి పథకం కింద రూ.57 వేల కోట్లు ఇప్పటివరకు అందించామని తెలియజేశారు.ఫ్రీ బస్‌పై కేటీఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ సత్యదూరమైన

నిరూపిస్తే ఇక్కడే రాజీనామా చేసి నేను వెళ్లిపోతాను :  కేటీఆర్

తెలంగాణ శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు జీవో చూపించండి. ఇక్కడే రాజీనామా చేసి నేను వెళ్లిపోతాను అంటూ సవాల్ విసిరారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించవద్దంటూ డిప్యూటీ సీఎంకు

పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్ బిగ్ షాక్

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. రోహిత్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ అధిష్ఠానం. డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు మీడియా ద్వారా వార్తలు వచ్చాయి. అదే విధంగా పోలీస్ కేసు నమోదు అయిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసినట్లు నోటీసుల్లో

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ప్రజాకవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ  పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. కోవిడ్-19 సమయంలో సమాజంలోని వేదన, భయం, మానవీయ కోణాలను వ్యక్తపరుస్తూ సిధారెడ్డి రచించిన అనిమేష  గ్రంథానికి గాను ఈ అవార్డు ప్రకటించినట్లు అకాడమీ తెలిపింది.ఈ నెల 31న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు.

అమెరికాలో విషాదం.. వరంగల్ వాసి మృతి

అమెరికాలో వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) మృతిచెందాడు. భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాకేశ్ గుండెపోటుతో మరణించాడు. రాకేశ్‌కు 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లిన రాకేశ్, కుటుంబంతో కలిసి వర్జినీయాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. పదేళ్లుగా విదేశాల్లో ఉంటూ ఉన్నత స్థితికి చేరుకున్న రాకేశ్, చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించాడనే వార్త వరంగల్‌లోని

పార్టీ మారుతున్నట్టు ప్రచారం .. క్లారిటీ ఇచ్చిన మల్లారెడ్డి

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాను కాంగ్రెస్లో చేరనున్నారనే వార్తలను ఖండించారు. అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ తన వయసు 73 ఏండ్లని, ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసని, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి 50 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నా, అది మునిగిపోయే పడవనే అని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసని, ఇటీవల సీఎం

మార్చి 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 31 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్

గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, శివ ప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు. లోక్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర

కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు ఊరట

అనర్హత పిటిషన్ల విషయంలో ఎంఎల్ఎ కడియం శ్రీహరి, దానం నాగేందర్ కు ఊరట లభించింది. కడియం, దానంలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించారు. బిఆర్ఎస్, బిజెపి వేసిన రెండు పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ డిస్మిస్ చేశారు. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండడంతో స్పీకర్

ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : కేటీఆర్‌

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. ఇది ప్రజల తీర్పును అవమానించడమే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని కేటీఆర్‌ అన్నారు.

రాజ్యసభ ఎంపీలుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్​ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నియామకపత్రం అందుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ పెద్దలు ఖర్గే, రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డికి నరేందర్ రెడ్డి ధన్యావాదాలు తెలిపారు. తాను ఎంపీ కావడానికి సహకరించిన

పార్టీ ఫిరాయింపులు..ముగిసిన స్పీక‌ర్ విచార‌ణ‌

పార్టీ ఫిరాయింపు ఆరోప‌ణ‌ల‌పై స్పీక‌ర్ విచార‌ణ ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది విచారణను ముగించారు. సుప్రీ కోర్టు విధించిన గడువు నేటితో ముగియనుండటంతో, స్పీకర్ వెలువరించబోయే తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లపై దాఖలైన పిటిషన్లపై నేడు

తెలంగాణలో కీలక పరిణామం.. 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 130 మంది మావోయిస్టులు  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయారు. నాలుగు బస్సులలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్న మావోయిస్టులు, సీఎం రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేసి లొంగిపోయారు. 31 ఏకే 47 తుపాకులు, 124 ఆయుధాలు సరెండర్ చేశారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ  దళం మొత్తం లొంగిపోయినట్లు తెలిసింది. లొంగిపోయినవారిలో ఏవోబీ కీలక నేత

మేం మాటలు, మూటలతో గెలవలేదు  : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నంలో ఉన్న తమకు మీరంతా అండగా నిలబడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అందరి అండదండలతో ఈ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్టినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం మమ్మల్ని గెలిపించారని, 2023 తమ దగ్గర అధికారం లేదు,  అక్రమ సంపాదన లేదు

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించిన ప్రభుత్వం, ఆయన స్థానంలో హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పలు రాష్ట్రాల గవర్నర్లు  బదిలీ అయ్యారు. ఇందుకు సంబంధించిన రాష్ట్రపతి భవన్‌  ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనాను లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌

అదనంగా ఐపీఎస్‌లను కేటాయించండి :సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్‌ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అమిత్‌షాతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మూడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పలు అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్‌ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్‌ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు.ఆ సమయంలోనూ

హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి అరాచకం  : కెటిఆర్

మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. నాగోల్ లోని మూసీ రివర్ ఫ్రంట్ వాకింగ్ ట్రాక్ సందర్శించారు. నాగోల్ ఎస్టిపి పాయింట్ ను, మూసీ పరివాహక ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కెటిఆర్  మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేరుతో సిఎం రేవంత్ రెడ్డి అరాచకం సృష్టించాడని, మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూలుస్తున్నారని అన్నారు.  కొడంగల్లో రేవంత్ రెడ్డి

జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులపై పెట్టిన అక్రమ కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరుచేయడంతో ఆయన బయటకొచ్చారు. చెన్నూర్‌ కోర్టులో ఉన్న మరో కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌పై విచారణను ఆ కోర్టు ఈ నెల 5కు వాయిదా వేసింది. బాల్కసుమన్‌కు ఈ

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: దానం

అనర్హత పిటిషన్లకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. స్పీకర్ నుంచి తనకు వ్యక్తిగతంగా నోటీసులు అందలేదని వెల్లడించారు. నోటీసులు రేపు అందే అవకాశం ఉందని అన్నారు. అయితే రేపో ఎల్లుండో తాను నేరుగా తన అభిప్రాయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తానని అన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన హోలీ వేడుకల్లో దానం నాగేందర్ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ఆయన కాసేపు హోలీ

దుబాయ్ లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య రేగిన భీకర పోరు ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురి కావడంతో వారిని పరామర్శించేందుకు ఐదు రోజుల క్రితమే ఆయన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు .. ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌

మధ్యప్రాచ్యంలో(పశ్చిమాసియా) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మధ్యప్రాచ్యం(పశ్చిమాసియా) ప్రాంతంలో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ

రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్‌

డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన, దేశం కోసం, మన అందరి కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. గత ఐదేళ్లుగా ఆయన చేసిన నిరంతర పోరాటాల ఫలితంగానే నేడు రాహుల్ గాంధీ దేశ ప్రధాన ప్రతిపక్ష

లండన్‌ అగ్ని ప్రమాదంలో నిజామాబాద్‌  విద్యార్థి మృతి

లండన్‌లోని క్రొయిడాన్‌ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన గొంతి అభిషేక్‌ ప్రాణాలు కోల్పోగా, ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్‌కు చెందిన సాయి శ్రీకర్‌ను వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధరించారు.బ్రెయిన్‌డెడ్‌ నేపథ్యంలో సాయి శ్రీకర్‌ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించినట్టు నిజామాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఉండే అతడి తల్లిదండ్రులు వెల్లడించారు. సాయి శ్రీకర్‌, గొంతి అభిషేక్‌

ఢిల్లీ మద్యం  కేసు.. కేజ్రీవాల్‌, కవితకు భారీ ఊరట

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై ది రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ వేసిన చార్జ్‌షీట్‌లో మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు కూడా క్లీన్‌చిట్ ఇచ్చింది.

సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీ … వారికి వెంటనే రివార్డు

మావోయిస్టుల అగ్రనేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని పలకరించారాయన. మావోయిస్టుల పునరావాసంపై హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావో నేతలపై ఉన్న రివార్డును వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుమతిస్తే జైల్లో ఉన్న మావోయిస్టులను కలుస్తామని మావోయిస్టు నేతలు పేర్కొన్నారు. అలాగే, లొంగిపోయిన మావోయిస్టుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లొంగిపోవటానికి

తెలంగాణలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వాటిలో ప్రధానంగా సంజయ్ కుమార్‌ను పరిశ్రమలు, ఐటి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పిఆర్ & ఆర్డి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక సభ్యసాచి ఘోష్‌కు – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ స్కిమ్స్ యూనిట్‌తో పాటు సిఎస్ఆర్‌గా బాధ్యతలు అందించారు. ఇక ఎం.దాన కిషోర్‌కి లేబర్, ఎంప్లాయ్మెంట్,

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీలో కలిశారు. ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని, వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి రాజ్యసభ ఇవ్వాలని కోరానని అన్నారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బిజెపి ప్రభుత్వమే : బండి సంజయ్

చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం శక్తిమంతమైన ప్రదేశం అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ అని, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కాంగ్రెస్ తో జతకట్టిందని ఎద్దేవా చేశారు. స్థానిక బిఆర్ఎస్ అండతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని, తెలంగాణలో ఎన్నికలు

సుప్రీంకోర్టులో మాజీ మంత్రి మల్లారెడ్డికి చుక్కెదురు

బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి సర్వే వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మల్లారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భూమి వ్యవహారంలో సర్వే ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తాము

మావోయిస్టులకు భారీ షాక్.. లొంగిపోయిన అగ్రనేత

మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు. డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదలైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోనే ఆఖరి దశకు వచ్చిందన్నారు. ఈ పరిణామంతో ఆ పార్టీ అత్యున్నత స్థాయి సంస్థాగత

తెలంగాణ ఓట్లతో గెలిచిన వారెవరైనా ఆ పని చేస్తారా?:  రేవంత్‌రెడ్డి

నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తోందన్న బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖండించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో దేవాదుల ప్రాజెక్టును సందర్శించాక రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన వారెవరైనా ఆ పని చేస్తారా అని నిలదీశారు. ఏపీ నుంచి వలసవచ్చి ఇక్కడ సెటిలైన వ్యక్తులైనా సహకరిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం ఉండదన్నారు.

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: వెంకటరమణారెడ్డి

కామారెడ్డి లో కాంగ్రెస్- బిజెపి నేతల మధ్య వివాదం ముదిరింది. కాంగ్రెస్ నేతలు, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో వివాదం చోటు చేసుకుంది. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు వెంకటరమణారెడ్డి బయలు దేరారు. డిగ్రీ కళాశాల అంశంపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు. తాము కూడా కలెక్టరేట్ కు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిముందు పోలీసులు

నా పేరుతో ఎలాంటి సంస్థలు లేవు : కేటీఆర్‌

తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని, అలా సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. కొంతమంది కేటీఆర్‌ సేవా సమితి, కేటీఆర్‌ సేన లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసిన నేపథ్యంలో కేటీఆర్‌ స్పందించారు.  తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బిఆర్ఎస్‌తో

కాంగ్రెస్ లో ఏ కోటా లేదు .. మెరిట్ కోటాలో పాసైతేనే : సీఎం రేవంత్ రెడ్డి 

రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. వారి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఈ తరగతులు సహాయపడతాయని  అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉందని ముఖ్యమంత్రి

అమెరికాతో ఒప్పందాల వల్ల మనకు నష్టం: హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో

మనిషి కంటే ఎఐకే ఎక్కువ తెలివితేటలు : సిఎం రేవంత్

ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  ప్రసంగించారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు అని, ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఎఐ ఫలితాలు మనం చూస్తున్నామని

కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన …పోటీ ఎక్కడి నుంచంటే?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత

త్వరలో తెలంగాణ సహా.. 22 రాష్ట్రాల్లో సర్ : కేంద్ర ఎన్నికల సంఘం

నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హతలేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో సర్ ను పూర్తి చేసింది సీఈసీ. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా సర్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. మన రాష్ట్రంతోసహా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో

ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ, బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈనెల 28న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

ఐ బొమ్మ రవికి బెయిల్‌

సినిమాల పైరసీ కేసు నిందితుడు ఇమంది రవి (ఐబొమ్మ)కి హైకోర్ట్‌ మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. గతేడాది నవంబర్‌లో అరెస్టయిన రవికి బెయిల్‌ మంజూరు ఉత్తర్వుల్లో పలు షతరులను విధించింది. హైదరాబాద్‌ నగరం విడిచి వెళ్లరాదనీ, సాక్షుల తారుమారుకు యత్నించరాదని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసుల ఎదుట హాజరుకావాలని పేర్కొంది. పాస్‌పోర్ట్‌ అప్పగించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది.

భైంసాలో బీజేపీ విజయం చరిత్రాత్మకం : రాంచందర్ రావు

మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ప్రజలు ఆదరించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మున్సిపాలిటీలు తక్కువ వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగిందని, బిజెపికి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.  గత ఎన్నికలతో పోలిస్తే బిఆర్ఎస్ కు 14 శాతం ఓట్లు తగ్గాయని, చాలా మున్సిపాలిటీలో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యం చూపిందని అన్నారు.

కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ బీజేపీతోనే :  బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీపై  కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కనబెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతోందని అన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని అన్నారు. తాను ప్రధాని నరేంద్ర

ఈ ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు : కేటీఆర్

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  స్పందించారు. మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఎక్స్‌అఫీషియో ఓట్ల నమోదు విషయంలో సీఎస్, రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటుందని అనుకున్నప్పటికీ, కొంత తగ్గిందని కేటీఆర్ అన్నారు. హంగ్ వచ్చిన ప్రాంతాల్లో కూడా పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర

సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన

కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్‌ వచ్చిన నేపథ్యంలో పాలకవర్గం ఏర్పాటులో సీపీఐకి మద్దతిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రతిపాదనపై సీఐపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సానుకూలంగా స్పందించారు. కేటీఆర్ ప్రతిపాదన మేరకు కొత్తగూడం మేయర్ పదవి కైవసం చేసుకుంటామని ప్రకటించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది.

మున్సిపల్ ఎన్నికలు.. సత్తా చాటిన హస్తం పార్టీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2,582 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 1,347 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో 64 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 717 వార్డుల్లో గెలుపొందింది. దాంతో 13 మున్సిపాలిటీలను ఆ పార్టీ దక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో గెలుపొందారు. స్వాతంత్ర అభ్యర్థులు 256 వార్డుల్లో విజయం సాధించారు.

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్​ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్​ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్రమంత్రిని విన్నవించారు. ఈసా, మూసీ నదుల సంగమ స్థలంలో కార్యక్రమం చేపడుతున్నట్లు రక్షణ మంత్రికి వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా, మూసీ సంగమంలో నిమజ్జనం చేశారని కేంద్ర మంత్రికి

చెదురుమదురు ఘటనలు మినహా .. తెలంగాణ‌లో ముగిసిన పోలింగ్

తెలంగాణ‌లో మున్సివల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. ఈ నెల 13న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 13న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 136 కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకు న్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిఎం ఓటు వేశారు. మధిర మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్

అమెరికాలో తెలుగు వ్యక్తి అరెస్టు

అమెరికాలో జార్జియా రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెలుగు వ్యక్తి చాడ సుహృత్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. అట్లాంటా శివారు ప్రాంతాలైన శాండీ స్ప్రింగ్స్, డన్వుడీ పోలీసులు సంయుక్తంగా అండర్ కవర్ ఆపరేషన్ ఆపరేషన్ నిర్వహించిన వీరిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా, వ్యభిచార ముఠాలపై మానవ అక్రమ రవాణా లక్ష్యంగా జనవరి 29, 30వ తేదీల్లో ఆపరేషన్

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవు వర్తించనుంది. అంతేకాకుండా, మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం

మున్సిపల్ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ పై : బండి సంజయ్

మక్తల్ లో బిజెపి నేత మహదేవప్పది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ చేసిన హత్య అని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. మక్తల్ లో బిజెపి నేత ఆత్మహత్యపై బండి సంజయ్ స్పందించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలు చేస్తున్నారని అన్నారు.  మహదేవప్ప ఆత్మహత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతుందని సూచించారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? అని

మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ : సీఎం రేవంత్‌ రెడ్డి

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి అని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సూచించారు.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిమీడియాతో మాట్లాడుతూ  మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని అన్నారు. 2014 లో పాలమూరు- రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, వరుసగా మూడు సార్లు ప్రధాని అయినా, ఇప్పటి వరకు ప్రకటించలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నిధులు ఇవ్వలేదని విమర్శించారు.

తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడింది. నేటితో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. చివరి రోజుల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఈనెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

బిఆర్ఎస్, బిజెపి కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర : సిఎం రేవంత్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సిఎం పర్యటించారు. నారాయణపూర్ లో ప్రజా పాలన-ప్రగతి బాట బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  ప్రసంగించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్, బిజెపి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, బిఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను పట్టించుకోలేదని విమర్శించారు. గల్లీలో బిజెపి కార్పొరేటర్ గెలిస్తే,

కాంగ్రెస్ కు ఓటేస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? : బండి సంజయ్

బిఆర్ఎస్ హయాంలో కబ్జాలే తప్ప అభివృద్ధి లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ  కబ్జాలతో కరీంనగర్ లో సగం మంది కార్పొరేటర్లు జైలు కెళ్లారని అన్నారు. అడ్డగోలు హామీలచ్చిన కాంగ్రెస్ అమలు చేయట్లేదని, పదే పదే ఢిల్లీ వెళ్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లకు డబ్బులిస్తారా? అని కాంగ్రెస్ కు ఓటేస్తే డబ్బులు ఎక్కడి

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.