దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందని, కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ప్రజా వ్యతిరేకతను అణచి వేయటానికి ఎమర్జెన్సీని విధించినా విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రజలను భయపెట్టి బతుకవద్దని రాహుల్‌కు చురకలు వేసింది. ఆర్థిక సునామీ 2013 లోనే వచ్చిందని, ఇప్పుడు కాదని బీజేపీ నేత
ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ఇండోనేషియన్ ఓపెన్‌లో ఓటమి పాలైంది. వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ ఆన్ సే యంగ్ చేతిలో ఆమ పరాజయాన్ని చూవిచూసింది. 17-21, 14-21 స్కోరుతో దక్షిణ కొరియా క్రీడాకారిణి విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇటీవల వరుసగా రెండోసారి ఆన్ సే యంగ్ చేతిలో పీవీ సింధు ఓడింది. గత వారం సింగపూర్ ఓపెన్ క్వార్టర్స్‌లోనూ సింధు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరు లోని లోక్ భవన్లో ఆయనతో కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, యు.టి. ఖాదర్, ఎం.బి. పాటిల్, కె.జె. జార్జ్, కె.హెచ్. మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ప్రియాంక్
పశ్చిమబెంగాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా సిబ్బంది రితబ్రతకు ఇచ్చేశారు. అసెంబ్లీలో పార్టీ నేతగా శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ను తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ఎంపిక చేయడంతో పార్టీలో కలకలం రేగిన విషయం తెలిసిందే. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ మొత్తం
తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ సినీ దర్శకుడు సుందర్ సి. తమ కుమార్తె అవంతిక వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి విజయ్ నివాసానికి వెళ్లిన ఖుష్బూ దంపతులు, తమ కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహ పత్రికను ఆయనకు అందజేసి
నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఈ నెల 10న ఇండియాకు అత్యధిక కాలం పని చేసిన ప్రధానిగా నిలవబోతున్నారు. అది కూడా ఎన్నికల్లో గెలిచి, అత్యధిక రోజులు ప్రధానిగా కొనసాగిన జవహర్ లాల్ నెహ్రూను దాటేయబోతున్నారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ మే 13, 1952న పదవీ బాధ్యతలు చేపట్టారు. మే 27, 1964న ఆయన మరణించేవరకు ప్రధానిగానే ఉన్నారు. అలా మొత్తం 4,398 రోజులు
తమిళనాడు బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా, మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, 2020లో బీజేపీలో చేరి అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను అన్నామలైకి చేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ శనివారం తన భర్త మైకేల్ బౌలోస్‌తో కలిసి ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించారు. దాదాపు గంటసేపు ఆ కట్టడంలో గడిపి అనేక విశేషాలు తెలుసుకున్నారు. తన భర్త బౌలోస్తోపాటు కొంతమంది సన్నిహిత స్నేహితులతో కలిసి శనివారం ఉదయం 11 గంటలకు ఆమె తాజ్‌మహల్‌కు విచ్చేశారు. తాజ్‌మహల్ లోని అనేక ప్రదేశాలను ఫోటోలు తీసుకున్నారు. తాజ్‌మహల్ చరిత్ర, నిర్మాణం గురించి ఆమె ఎక్కువ ఆసక్తి
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డికె శివకుమార్ పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సిఎల్పి) నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులోని విధాన్‌సౌధలో జరిగిన సిఎల్పి సమావేశంలో శివకుమార్ పేరును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా సమర్థించారు. పది నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం విశేషం. సమావేశం అనంతరం సిద్ధరామయ్య, శివకుమార్‌తో కలిసి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధానకార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడారు. శాసనసభలో కాంగ్రెస్ సభాపక్ష
ఆరుగురు అంతకన్నా ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్న పౌరుల ఓటు హక్కును తొలగించ వచ్చా? అంటే తొలగించవచ్చుననే అంటున్నారు యూపీలోని ఎన్నికల అధికారులు. మీకు ఆరుగురు పిల్లలున్నారా అంటూ ఈసీ ఈ ఏడాది జనవరి 6న వారణాసి కంటోన్మెంట్ పరిధిలోని సోనుగిరీ (35)కి నోటీస్ పంపింది. అతను అవునని సమాధానం ఇవ్వడంతో తుది జాబితాలో అతని పేరును తొలగించారు. ఇలాంటి కారణంతో నియోజకవర్గంలోని 20 బూత్‌ల పరిధిలో వేలాది
కేసుల విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తుది తీర్పు వెల్లడించాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. తీర్పు ఆలస్యం కావడం వల్ల పిటిషన్‌దారులకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని హైకోర్టులు విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత మూడు నెలల్లోగా తీర్పు వెల్లడించాలని ఆదేశించింది. రిజర్వ్ చేసిన తేదీ నుంచి
కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ అంగీకరించారు. గురువారం రోజున లోక్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి కి సిద్దరామయ్య తన రాజీనామాను అందజేశారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 164(1) ప్రకారం తనకున్న అధికారాల అనుసారం సీఎం సిద్దరామయ్య సమర్పించిన రాజీనామాను స్వీకరిస్తున్నట్లు గవర్నర్ థావర్‌చాంద్ తెలిపారు. సిద్దరామయ్య నేతృత్వంలో ఉన్న మంత్రిమండలిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు గవర్నర్ తన నోటిఫికేషన్లో తెలిపారు. అయితే
భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు భారీ ఊరట లభించింది. ఆసియన్ గేమ్స్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ఆమెకు అనుమతించింది. ఈ విషయంలో వినేష్ ఫోగాట్‌కు అనుమతిస్తూ ఇప్పటికే ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. రెజ్లింగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరిపి, వినేష్ ఫోగాట్‌కు
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని విధి మేఘగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బొర్సాద్ ప్రాంతానికి చెందిన విధి మేఘ (22) అనే యువతి కెనడాలో చదువుకుంటోంది. అలాగే, తన ఖర్చుల కోసం అక్కడ పని చేస్తోంది కూడా. త్వరలో కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. అనంతరం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్ఠానం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు పంజాబ్, హరియాణా, ఢిల్లీ, త్రిపుర రాష్ట్ర విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ వివరాలు వెల్లడించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమించింది. పంజాబ్ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ ధిల్లాన్ పేరును ప్రకటించింది. హరియాణా అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా
భారత మామిడి ఎగుమతిదారులకు జపాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ సీజన్‌కుగాను భారత మామిడి పండ్ల దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ లోని క్రిమిసంహారక కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని జపాన్ తనిఖీ బృందం గుర్తించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ పరిణామంతో మామిడి ఎగుమతిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని రెహ్మాన్పూర్లో ఉన్న ఒక ప్లాంట్‌లో వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు
తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు. గతంలో 12 ఏళ్లక్రితం మోదీని విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కానీ, ఈసారి విజయ్ సీఎం హోదాలో ప్రధానిని కలవడం విశేషం. మోదీ, విజయ్ ఈరోజు దాదాపు 25 నిమిషాలపాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. మోదీతో భేటీ అనంతరం విజయ్, న్యూఢిల్లీలోని తమిళనాడు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా పాకిస్థాన్ పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను పాకిస్థాన్ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. తమపై జరిగే ఉగ్రదాడుల నుంచి తమను తాము రక్షించుకునే పూర్తి హక్కు తమకు ఉందని, పాకిస్థాన్ చర్యలకు తగిన పర్యవసానాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది. చైనా అధ్యక్షతన జరిగిన యూఎన్ఎస్సీ బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పర్వతనేని
పశ్చిమబెంగాల్ లో ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి కి బరాసత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ షాకిచ్చారు. ఆమె టీఎంసీలోని అన్ని పదవులకు రాజీనామా చేశారు. ఇటీవలే ఆమె టీఎంసీ బరాసత్ పార్లమెంటరీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పార్టీలోని అన్ని పదవుల నుంచి వైదొలగడం గమనార్హం. దస్తిదార్, బరాసత్ లోక్‌సభ నియోజకవర్గం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీలో పర్యటిస్తున్నారు. అక్కడ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇటలీ, ఇండియా మధ్య ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు కీలక దశకు చేరుకునే స్థితికి చేరాయన్నారు. 2025–2029 వరకు ఇండియా–ఇటలీ మధ్య ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనుంది. గురువారం ఏర్పడనున్న క్యాబినెట్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ టీవీకే అధినేత, సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్, పి.విశ్వనాథన్‌లు
తమిళనాడులోని ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతిని నిర్మూలించేందుకు టీవీకే అధినేత, సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులు లంచం తీసుకున్నట్లు గుర్తించి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. రూ. వెయ్యి లంచం తీసుకున్న వారిపై ఫిర్యాదు చేసినా ఈ బహుమతి ఇస్తామని తెలిపారు. సీఎం విజయ్ నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాలో చర్చ మొదలైంది.
ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు లేక అస్థిరంగా ఉందని, ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నందున డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోవచ్చు అని, డీఎంకే
పశ్చిమ బెంగాల్‌లోని, ఫాల్టా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యం లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి జహంగిర్ ఖాన్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఎన్నిక జరగడానికి రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇది టీఎంసీ పార్టీకి భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 21న ఉప
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. పుతిన్, భారత పర్యట షెడ్యూల్ ను క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ తెలిపారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారని చెప్పారు. మరింత సమ్మిళిత, సుస్థిర పాలన కోసం గ్లోబల్ సౌత్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా, బ్రిక్స్ నాయకులు గత ఏడాది
పాకిస్థాన్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. మానేక్షా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒవకేళ పాకిస్థాన్ ఉగ్రవాదులను పోషించి, వాళ్లను ఇండియా మీదకు ఉసి గొల్పుతే, అప్పుడు ఆ దేశం ఈ భూమి మీద ఉండాలా లేదా అన్న అంశాన్ని వాళ్లే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చరిత్రలో ఆ దేశానికి స్థానం ఉండాలంటే ఉగ్రవాదులను పెంచి పోషించరాదన్నారు. ఒకవేళ ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో లాంగ్వేజ్ విధానంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. రాబోయే 2026 జులై 1 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు మూడు భాషల విధానాన్ని తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి 2020), నేషనల్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(ఎన్ సిఎఫ్-ఎస్ఈ 2023) సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. ప్రజా, సాధారణ పరిపాలన, రెవెన్యూ, ప్రత్యేక కార్యక్రమాల అమలు, యువజన, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, పురపాలక పరిపాలన, పట్టణ, నీటి సరఫరా శాఖల బాధ్యతలు కూడా ఆయన నిర్వహించనున్నారు. సీనియర్ నేత కేఏ సెంగోట్టయ్యన్‌కు ఆర్థిక శాఖ కేటాయించారు. విజయ్
కొందరిని తాను పరాన్నజీవులుగా లేదా బొద్దింకలుగా పోల్చిన వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించారు. ఒక కేసు విచారణ సందర్భంగా తాను మౌఖికంగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. నకిలీ సర్టిఫికెట్లు, బోగస్ డిగ్రీలతో మీడియాలోకి, న్యాయవ్యవస్థలోకి, ఇతర వృత్తుల్లోకి ప్రవేశించేవారిని ఉద్దేశిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. అలాంటి వారే మీడియా, సోషల్ మీడియా తోపాటు ఇతర రంగాల్లోకి చొరబడ్డారని అన్నానని చెప్పారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లలో గెలిచిన ఆయన నందిగ్రామ్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేశారు. గెలిచిన మరో నియోజకవర్గం భవానీపూర్‌ను తనవద్దే ఉంచుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గానికి చేసిన రాజీనామాను స్పీకర్ రతీంద్ర బోస్‌కు సువేందు అందజేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఎవరైనా రెండు నియోజకవర్గాల్లో గెలిచినప్పటికీ ఒక నియోజకవర్గాన్ని14 రోజుల లోపు వదులుకోవాల్సి ఉంటుంది. పూర్వ మేదినీపూర్ జిల్లాలోని
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్ పోక్సో కేసుతో పాటు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరుతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న వీడియోలను
వివాదాస్పద భోజ్‌శాల విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ భోజ్‌శాలను దేవాలయంగా ప్రకటించింది. వివాదాస్పద స్థలం ఆలయానిదేనంటూ ఇండోర్ ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. ఆలయంలో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కోర్టు అనుమతించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. భోజ్‌శాల ఆలయ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. భోజ్‌శాలలోని మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందూవులు వాగ్దేవి (సరస్వతి) దేవాలయంగా భావిస్తారు. ముస్లింలు
బంగ్లాదేశ్ పర్యటనలో దారుణ ఓటమిని మరిచిపోకముందే పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఢాకా టెస్టులో స్లో ఓవర్ రేటు కు పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఆ జట్టు ర్యాంకింగ్‌లోనూ దిగజారింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కీలకమైన పాయింట్లు కోల్పోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా 8 పాయింట్లు కోతకు గురైంది షాన్ మసూద్ బృందం. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో పాకిస్థాన్‌కు ఊహించని
తమిళనాడు పాలనా విభాగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ ఓఎస్డీగా నియమితుడైన జ్యోతిషుడు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓఎస్డీగా రాధన్ పండిట్ నియామకాన్ని టీవీకే కూటమిలోని పార్టీ నేతలే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. రాధన్ పండిట్ తమిళనాడులో అత్యంత
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బలపరీక్షలో నెగ్గారు. ఆయనకు అనుకూలంగా 144 మంది ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అయిదుగురు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇక డీఎంకే పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నాడీఎంకే రెబల్స్, టీవీకేకు అనుకూలంగా ఓటేశారు. కానీ పళనిస్వామి వర్గం మాత్రం వ్యతిరేకంగా ఓటేసింది. టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో నెగ్గింది. విజయ్
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హిజాబ్ సహా మతపరమైన దండలు వంటి వాటిని విద్యాసంస్థల్లో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిని నిషేధిస్తూ బీజేపీ ప్రభుత్వం 2022లో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యాసంస్థల్లో డ్రెస్ కోడ్ అమలుపై నూతన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా విద్యాసంస్థల్లో ఇటు
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి, భవానీపూర్ సీటును నిలుపుకున్నారు. నందిగ్రామ్ స్థానాన్ని వదులుకున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో భవానీపూర్ ఎమ్మెల్యేగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నందిగ్రామ్ సీటును వదులుకున్నట్లు చెప్పారు. నందిగ్రామ్ నుంచి (ఉప ఎన్నిక ద్వారా) మరొకరు ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. అయితే రాబోయే ఐదేళ్లలో అక్కడి ప్రజలు నా లేమిని ఏమాత్రం అనుభవించనివ్వను. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది రెండోసారి. ఆ రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అస్సాంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరుసగా ఇది మూడోసారి. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ నేత రామేశ్వర్ తేలి మంత్రిగా ప్రమాణం
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతో సంచలనం సృష్టించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, విద్యాసంస్థలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తమిళనాడులో మొత్తం 4,765 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో మూసివేయనున్న 717 షాపుల్లో, 276
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల కోసం జాతీయ ఆత్మగౌరవాన్ని పక్కనపెట్టే శక్తులు దేశంలో ఇప్పటికీ ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్ లో ప్రధాని
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం(మే 10) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం టివికె అధినేత విజయ్.. సోమవారం ప్రతిపక్ష నేత, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన సిఎం విజయ్ కు ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికారు. తర్వాత సిఎం విజయ్, స్టాలిన్ ఇరువురు శాలువాలతో ఒకరినొకరు సత్కరించుకున్నారు. సిఎంగా ప్రమాణం చేసిన
న్యూఢిల్లీలో మే 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్జి హాజర్యే అవకాశం ఉందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం నేపథ్యంలో భారత్‌లో బ్రిక్స్ సదస్సు జరగడం, దానికి ఇరాన్ మంత్రి హాజరవ్వడం కీలక పరిణామం. ఢిల్లీలో జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల
బెంగాల్ లో బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. పశ్చిమ బెంగాల్ తొలి బిజెపి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. సువేందుతో గవర్నర్ ఆర్ ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. 1971 తర్వాత కలకత్తాయేతర జిల్లా నుంచి సిఎం పదవికి సువేందు మొదటి వ్యక్తి కావడం గమనార్హం. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం
పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బిజెపి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి వచ్చిన ప్రధాని ప్రజలవైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో
పశ్చిమబెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. తొలిసారి ఆ రాష్ట్రంలో బిజెపి సర్కార్‌ను ఏర్పాటు చేసింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మాజీ సిఎం మమతా బెనర్జీ ఈ నేపథ్యంలో తన ఓటమిని అంగీకరించారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని మమతా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన సిఎం పదవికి రాజీనామా చేయనని తేల్చి చెప్పేశారు. అయితే మే
జమ్ముకశ్మీర్‌లో అధికారంలో ఉన్న జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్సీ)లో చీలిక ఊహాగానాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. తమ పార్టీలో ఎక్నాథ్ షిండేలు ఎవరూ లేరని అన్నారు. ఫిరాయింపులు జరుగవచ్చన్న బీజేపీ వాదనలను ఆయన తోసిపుచ్చారు. జేకేఎన్సీలో అంతర్గత సంక్షోభం ఉన్నదని బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఆరోపించారు. ఆ పార్టీ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏక్నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని ఆయన తెలిపారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో ప్రజంభనం సృష్టించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలిచిన టీవీకేకు కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, వీసీకే మద్దతు ప్రకటించాయి. దీంతో శుక్రవారం సాయంత్రం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిశారు.
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డీఎంకే కాంగ్రెస్ బంధానికి తెరపడింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, ఇండియా కూటమి నుంచి కూడా తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేసింది. బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను మట్టికరిపించి, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించిన సువేందుకే అధిష్టానం పట్టాభిషేకం చేయాలని నిర్ణయించింది. కోల్‌కతాలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య,
తమిళనాడు లో ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే పార్టీ కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పై బీజేపీ, అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శలు చేస్తున్న వారిపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీవీకే పార్టీ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమని, అందుకే తాము ఆ పార్టీకి అండగా నిలిచామని చెప్పారు. స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు కోసం, ప్రజల తీర్పును గౌరవించడం కోసం, దక్షిణాది
గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న మరుసటి రోజునే భారత విద్యార్థి గుండెపోటుతో మరణించిన ఘటన అమెరికాలో జరిగింది. మహమ్మద్ కుమెల్ షేక్ (26) శాన్ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఇటీవలే స్నాతకోత్సవ వేడుకల్లో … తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. అయితే, ఆ మరుసటి రోజే కుమెల్ తన నివాసంలో విగతజీవిగా కనిపించడంతో స్నేహితులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. నిద్రలోనే కార్డియాక్ అరెస్టుకు గురై మృతి
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని కోరిన టివికె అధినేత విజయ్ కు గవర్నర్ మరోసారి షాకిచ్చారు. మెజారిటీ సంఖ్యాబలం ఉన్నప్పుడు మాత్రమే విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతిస్తామని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకు అవసరమైన సంఖ్యాబలం రుజువయ్యే వరకు వేచి చూస్తానని ఆర్లేకర్ చెప్పినట్లు లోక్ భవన్ వర్గాలు తెలిపాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి రద్దు చేశారు. ముఖ్యమంత్రి పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో, గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో శనివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం బీజేపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అసెంబ్లీ రద్దుతో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ రవి బర్తరఫ్ చేసినట్లు అయింది. దీంతో
ప్రపంచ దేశాలకు ఇదో గుడ్ న్యూస్. కొద్ది రోజులుగా మూసి ఉన్న హార్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం.. హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై గురువారం రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. హార్ముజ్‌ను వీలైనంత త్వరగా,
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో మొత్తం 32 మందితో కొత్త మంత్రులతో కూడిన పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరింది. ప్రస్తుతం బిహార్‌లో బీజేపీ, జేడీయూ, ఇతర పార్టీలతో కలిసి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ విస్తరణలో మాజీ సీఎం నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్‌కు చోటు దక్కింది. కూటమిలో బీజేపీకి 15, జేడీయూకు 13, రామ్ విలాస్
పశ్చిమబెంగాల్లో బీజేపీకి విజయం ఖరారైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. రాష్ట్ర బీజేపీ కార్యకర్తలను అభినందించారు. వారి కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పారు. మంచి పాలన అందించాలన్న బీజేపీ అభిమతమే అంతిమంగా పైచేయి సాధించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించారని ప్రధాని మోదీ అన్నారు. ఈ విజయం కోసం రాష్ట్రంలో
ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఆయన పరాజయాన్ని చవిచూశారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ పోటీ చేశారు. 1996 తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. గత మూడు ఎన్నికలుగా కొలత్తూరు నుండి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న స్టాలిన్ కు, ఈసారి టీవీకే అభ్యర్థి నుండి ఊహించని స్థాయిలో పోటీ
పార్టీ స్థాపించిన తర్వాత తొలి ఎన్నికల్లోనే టివికె చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. అధికార డిఎంకె, అన్నాడిఎంకె పార్టీలను వెనక్కి నెట్టి భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు, విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. మరోవైపు, ఆయన పార్టీ టివికె 110కి పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. దీంతో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పనున్నారు. మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన విజయ్ సారథ్యంలోని టీవీకే విజయపథంలోకి దూసుకెళ్తోంది. 108కి పైగా సీట్లలో గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే మెజారిటీకి 118 సీట్లు అవసరమవుతాయి. మెజారిటీ తగ్గిన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏయే పార్టీలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనే దానిపై తాజాగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేది లేదని టీవీకే ఇంతకుముందే ప్రకటించింది. అయితే టీవీకే మెజారిటీకి అతి
ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని, బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. మే 4న వెలువడే ఫలితాలు దేశాభివృద్ధిని మరింత బలోపేతం చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో జరిగిన గంగా ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశలో
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కు ఆమోదం కోసం తాము ఎంతగానో ప్రయత్నించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వారణాసి లో జరిగిన ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ లాంటి ప్రతిపక్ష పార్టీల నీచ రాజకీయాలవల్లే ఆ చట్టం అమల్లోకి రాకుండా ఆగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలు అభివృద్ధి చెందడం, అసెంబ్లీలు, పార్లమెంట్‌కు రావడం ప్రతిపక్షాలకు ఇష్టంలేదని వ్యాఖ్యానించారు. అందుకే 40 ఏళ్లుగా ఈ
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ జలక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ విలీన ప్రక్రియను రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సంఖ్య 10 నుంచి మూడుకు పడిపోయింది. ఇక బీజేపీ సంఖ్య 106 నుంచి 113కు చేరింది. ఇక రాజ్యసభలో ఎన్డీఏ బలంగా ఇప్పడు 141
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తంచేశారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా తాము స్వీట్లు పంచుతామని చెప్పారు. బెంగాల్లో రెండు విడతల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రధాని ప్రచారం చేస్తున్నారు. నదియా జిల్లా లో జరిగిన
భారత్- చైనా దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్వాన్ లోయ లో ఘర్షణలు జరిగినప్పటి నుంచి గత ఐదారేళ్లుగా చైనా జాతీయులకు నిలిపేసిన పర్యాటక వీసాలను పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2020లో భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పటి నుంచి చైనా జాతీయులకు భారత్ టూరిస్ట్
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే కోర్టు నియమాల ఉల్లంఘనే అంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ వి కామేశ్వర్ రావు, జస్టిస్ మన్మీత్ అరోరా ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారిస్తూ నోటీసులు జారీ
తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఏప్రిల్ 23న (బుధవారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రచారానికి ఆఖరి రోజున ప్రధాన పార్టీలన్నీ రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తించాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కోలత్తూరు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముగించగా, విపక్ష
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం లోక్‌సభ లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బిల్లు విషయంలో విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని, అందుకు జీవితాంతం చింతిస్తాయని అన్నారు. ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో శనివారం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు
ప్రపంచానికి ఇరాన్ మరోసారి షాకిచ్చింది. హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే తిరిగి మూసేసింది. అమెరికా అనుసరిస్తు్న్న విధానమే దీనికి కారణమని ఆరోపించింది. హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. ఇటీవల హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచినప్పటికీ, అమెరికా మాత్రం ఈ దిగ్బంధనాన్ని తొలగించలేదు. పైగా తమ నౌకల్ని అమెరికా
హార్ముజ్ జలసంధి వద్ద కీలక పరిణామం చోటు చేసుకుంది. జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారత నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోని ఇరాన్ రాయబారికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలు శనివారం జరిగాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసిన సంగతి తెలిసిందే. హార్ముజ్‌ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించి 24 గంటలు గడవకముందే ఇరాన్ యూటర్న్ తీసుకుని జలసంధిని మూసేసింది. ఇదే
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. 298 మంది సభ్యులు అనుకూలంగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడానికి, జనాభా గణన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును లోక్‌సభ తిరస్కరించింది. కాగా, లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందడానికి కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి 326 ఓట్లు అవసరం.
ప్రపంచానికి ఇది గుడ్‌న్యూస్. అందరూ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురుచూసిన హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఈ మేరకు సోషల్ మీడియాలో దీనిపై శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఇకపై హార్ముజ్ జలసంధి అందరికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య గురువారం కాల్పుల విరమణ ఒప్పందం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీలోని అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై వచ్చిన ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై విచారణ జరపాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదా ఈ అంశాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకైనా అప్పగించాలని సూచించింది. అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై విచారణకు యూపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం
చమురు రవాణా కు ఎంతో కీలకమైన హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మోహ్సేన్ రెజాయి అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తే, తమ తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలు మునిగిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్మూజ్‌కు రక్షక భటుడిగా మారాలనుకుంటున్నారని,
నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ తో ఆస్ట్రియా ఛాన్సలర్ సమావేశమైయ్యారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయనున్నాయి.ముఖ్యంగా రక్షణ, సెమీకండక్టర్లు, క్వాంటం, బయోటెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఇండియా-ఆస్ట్రియా వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్ ను
మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దు అని ప్రధాని మోదీ అన్నారు. లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదు అన్నారు. దానికి రాజకీయ రంగు పూయవద్దు అన్నారు. ఎవరు బాధ్యులైనా, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆలస్యం చేశామన్నారు. ఈ బిల్లులను తీసుకువచ్చిన సక్సెస్ ట్రెజరీ బెంచ్‌లకు కానీ, మోదీకి కానీ
లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో
రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడారు. తన ప్రసంగంలో విపక్షాలను ఆయన తప్పుపట్టారు. బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు వ్యవస్థీకృత ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాయిదా రాజకీయాలను మోదీ సర్కారు ప్రోత్సహించదన్నారు. దక్షిణాది రాష్ట్రాలను విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయని, జనాభాను నియంత్రించిన దక్షిణాదితో పాటు చిన్న రాష్ట్రాలకు మోదీ సర్కారు అందించే
బీహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు సమ్రాట్ చౌదరి (ఏప్రిల్ 15) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చౌదరితో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. నితీష్ కుమార్ సిఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు. బీహార్‌లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సమ్రాట్ చౌదరి పేరును
హోర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్భందించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా రియాక్ట్ అయ్యింది. ఇరానీ నౌకాశ్రయాలను మూసివేయడం ప్రమాదకరమని, బాధ్యతారాహితం అవుతుందని చైనా పేర్కొన్నది. నౌకలను అడ్డుకోవడం వల్ల పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని చైనా విదేశాంగ కార్యాలయ ప్రతినిధి గూవో జియాకున్ తెలిపారు. రెండు వర్గాలు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని, జలసంధి వద్ద అమెరికా తన బలగాల సంఖ్యను పెంచుతోందని, టార్గెట్ చేసి నౌకలను బ్లాక్ చేస్తున్నదని,
కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమేషన్ ను వ్యతిరేకించడం దారుణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డీలిమేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు. ఈ సందర్భంగా డీలిమేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను బంట్రోతు ఉద్యోగం చేస్తానని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసిందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అద్దాల మేడలో కూర్చోని ఇతరులపై రాళ్లు విసురుతున్నారని, అనేక
జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌భవన్ చేరుకున్న ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నితీశ్‌కుమార్ స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజీనామాను సమర్పించడానికి ముందు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని చివరిసారిగా ఏర్పాటుచేశారు. మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్న విషయాన్ని కేబినెట్‌కు తెలియజేశారు. నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా రెండు దశాబ్దాలు కొనసాగారు. ఇటీవల ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి జేపీ నద్దా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. తమిళ నూతన సంవత్సరం కావడం విశేషం. ఈ సందర్భంగా పార్ట మేనిఫెస్టో విడుదల చేయడం మంచి పరిణామం అని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, బీజేపీ నేతలు కే అన్నామలై, తమిళిసై సౌందరరాజన్
ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఇటలీ షాకిచ్చింది. ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దీనిపై ప్రకటన చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం పొడిగింపును రద్దు చేసుకుంటూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని జార్జియా మెలోని ప్రకటించారు. వెరోనాలో జరిగిన ఒక కార్యక్రమంలో జార్జియా ఈ ప్రకటన
ఈ ఏడాది జూన్‌లో మహిళల టీ20 వరల్డ్‌కప్ జరగనున్నది. దీని కోసం ఐసీసీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో విజేతలకు అందజేసే ప్రైజ్‌మనీని రికార్డు స్థాయిలో పెంచేసింది. రెండు నెలల పాటు ఇంగ్లండ్, వేల్స్లో జరిగే వరల్డ్‌కప్ కోసం సుమారు 82 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది ఐసీసీ. గత ఎడిషన్‌తో పోలిస్తే సుమారు 10 శాతం ప్రైజ్‌మనీ పెంచారు. ఈసారి ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. 2024లో కేవలం
హంగేరి విపక్ష నేత పీటర్ మాగ్యార్ స్టన్నింగ్ విక్టరీ కొట్టారు. పార్లమెంటరీ ఎన్నికల్లో మాగ్యార్‌కు చెందిన టిజా పార్టీ అనూహ విజయాన్ని సాధించింది. 16 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న విక్టర్ ఓర్బాన్ షాకింగ్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మాగ్యార్‌కు ఫోన్ చేసిన ఓర్బాన్, విక్టరీ విషెస్ తెలిపారు. ఆదివారం రాత్రి వరకు 98 శాతం ఓట్లను లెక్కించారు. దాంట్లో టిజా పార్టీకి 53.72 శాతం ఓట్లు పోలయ్యాయి. ఫిడేజ్ పార్టీకి
హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న వేళ, ఇరాన్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా అలాంటి చర్యలకు దిగితే, తాము కూడా పర్షియన్ గల్ఫ్ తీరంలోని పోర్టులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది. పర్షియన్ (అరేబియన్) గల్ఫ్, ఒమన్ సముద్ర తీరంలో భద్రత ఉంటే అందరికీ ఉండాలని, లేకపోతే ఎవరికీ ఉండకూడదని పేర్కొంది. ప్రాంతీయ సముద్ర జలాల్లో రక్షణ అందరికీ ఒకేలా ఉండాలని అభిప్రాయపడింది. హార్ముజ్‌ను అమెరికా దిగ్బంధిస్తే గల్ఫ్ తీరంలోని
భవానీపూర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడానికి బీజేపీ ప్రయత్నించిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. తనపై తప్పుడు కేసులు పెట్టడానికి ఆ పార్టీ నేతలు ఈసీతో కలిసి కుట్ర పన్నారని అన్నారు. ఈ ప్రయత్నాలను తమ పార్టీ నేతలు భగ్నం చేశారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక, మోసపూరిత మార్గాల్లో ఓట్లు రాబట్టుకోవడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. అందుకే సర్ పేరుతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లను
పార్లమెంట్ ఆవరణలో ఇవాళ అరుదైన దృశ్యం చోటుచేసుకున్నది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడారు. కారు నుంచి దిగి వెళ్తున్న మోదీ కాసేపు ఆగి రాహుల్‌తో ముచ్చటించారు. చాలా దగ్గర నిలుచుకున్న ఆ ఇద్దరూ ఓ నిమిషం పాటు మాట్లాడుకున్నారు. పార్లమెంట్లో ఎప్పుడూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఆ మీటింగ్ పట్ల ఆసక్తి కనబరిచారు. పార్లమెంట్ ఆవరణలో ఉన్న ప్రేరణ
జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టులో ఆయన జడ్జీగా ఉన్నారు. అవినీతి ఆరోపణ కేసులో ఆయనపై అభిశంసన ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. జడ్జీ హోదా నుంచి ఆయన్ను తప్పించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ముర్ముకు పంపారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి భారీ ఎత్తున
బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో హిందీ భాషలో నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జేడీయూ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా,
అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోం (126), కేరళం (140), పుదుచ్చేరి (30) లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు
అమెరికా,ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై ఇజ్రాయెల్ సందేహం వ్యక్తంచేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాక్ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నదని తాము భావిస్తున్నట్లు అజార్ తెలిపారు. ఈ సందర్భంగా ఖతార్, తుర్కియే వంటి సమస్యాత్మక దేశాల
హర్మూజ్ జలసంధి లో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం అత్యవసర అడ్వయిజరీ జారీచేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటన విడుదలచేసింది. భద్రతాకారణాల దృష్ట్యా ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఎప్పటికప్పుడు భారత
చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2003 నాటి హత్య కేసులో తాజాగా తీర్పు వెల్లడించింది. సీనియర్ ఎన్సీపీ లీడర్ అయిన రామావతార్ జగ్గి జూన్ 4, 2003న హత్యకు గురయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే దుండుగులు అతడిని కాల్చి చంపారు. జగ్గితోపాటు పక్కనే ఉన్న ఆయన ప్రధాన అనుచరుడు విద్యాచరణ్ శుక్లా కూడా ఈ
యుద్ధం వేళ వరుసగా దేశ అగ్రనేతల్ని కోల్పోతున్న ఇరాన్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైన్యం అయిన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న మాజిద్ ఖదేమీ మరణించాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై సోమవారం అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో మాజిద్ ఖదేమి మరణించినట్లు ఇరాన్ పేర్కొంది. కొద్దిసేపటి క్రితం ఐఆర్జీసీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఐఆర్జీసీలోని ఇంటెలిజెన్స్ విభాగానికి నాయకత్వం వహించిన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమి
పశ్చిమాసియా సంక్షోభాన్ని ఆపేందుకు ఈజిప్ట్, పాకిస్థాన్, టర్కీ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడిని ఆపేందుకు ఆ దేశాలు ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని ప్లాన్‌ను రెఢీ చేసినట్లు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి రీఓపెనింగ్ అంశంపై ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధానికి బ్రేక్ వేయాలంటే,
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇండియా చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది. ఆయిల్, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరాను పెంచబోతున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా మొదటి డిప్యూటీ ఛైర్మన్ డెనిస్ మాంటురోవ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా చమురు సరఫరాపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ విమానాన్ని కూల్చినట్లు ఇరాన్ పేర్కొన్నది. సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఆ విమానం కూలినట్లు తెలుస్తోంది. మెహర్ న్యూస్ ఏజెన్సీ దీనిపై ప్రకటన చేసింది. పైలెట్ తీవ్రంగా గాయపడి ఉంటాడని, అతను బ్రతికి ఉండే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ కూల్చడం ఇది రెండో సారి అవుతుంది. అయితే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ మాత్రం దీనిపై ప్రకటన చేయలేదు. ఇప్పటికే అమెరికా
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన బొమ్మ భారీ ధర పలికింది. యశోద, కృష్ణుడు ఉన్న ఫోటో సుమారు 167 కోట్లకు అమ్ముడుపోయింది. భారతీయ ఆర్ట్‌వర్క్ ఆ ధరకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. వేలంలో కొత్త వరల్డ్ రికార్డు స్థాపించినట్లు చెబుతున్నారు. రవివర్మ గీసిన ఆయిల్ పెయింటింగ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్థాపకుడు డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీన జరిగిన ఆర్ట్స్
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.