కాంగ్రెస్, మిత్రపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్లు వస్తాయని ఆశపడ్డారని అన్నారు. మహిళలకు ద్రోహం చేయడం జాతి విద్రోహమని, మహిళలను గౌరవించి అన్ని రంగాల్లో ఆదరించడం సంస్కృతని తెలియజేశారు. సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ద్రోహం చేశారని ఆవేదన
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2, 4 సోమవారాల్లో విచారణ అధికారుల ఎదుట హాజరవ్వాలని, పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని, లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. మరో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. విజయవాడ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన – నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ వినుకొండ మేనేజర్ అర్జునరావు – దర్శి మున్సిపల్ కమిషనర్‌గా నియామకం పులివెందుల ఇన్‌ఛార్జ్ కమిషనర్ మునికుమార్ – రెగ్యులర్ కమిషనర్‌గా పదోన్నతి విజయవాడ నుంచి సుభాష్ చంద్రబోస్
లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగదని అమిత్ షా స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత ఏపీలో
మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు కోరుతూ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న నారీ శక్తి వందన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని లేఖలో కోరారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఏపీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోనున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై 5వ తేదీ లేదా 8వ తేదీన ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి
విద్యార్థి నాయకుడి కిడ్నాప్ కేసులో తదుపరి విచారణ జరిపే వరకు ప్రముఖ సినీ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు సీడీని తమ ముందు ఉంచాలని వారికి కోర్టు స్పష్టం చేసింది. విద్యార్థి నాయకుడి కిడ్నాప్‌నకు సంబంధించి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమపై నమోదైన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది. తాజాగా అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా
ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది. గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖపట్నం
దేశంలో అన్ని పార్టిలది ఒక దారైతే, వైసిపి మరో దారని, అమరావతి బిల్లుకు వైసిపి మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యవహరించిందని అన్నారు. వైసిపి నేతలు, ఎపికి, ప్రజలకు ద్రోహం చేశారని, ఎపి నాశనమైనా పర్వాలేదని వైసిపి పట్టుదలతో ముందుకెళ్లిందని విమర్శించారు. అమరావతిని నాశనం చేయాలని వైసిపి చూస్తే,
రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత కానీ, స్థిరమైన విధానం కానీ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే, వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లుపై ప్రస్తుతం రాజ్యసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ తమ పార్టీ తరపున ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అమరావతి
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈరోజు(బుధవారం) ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో
లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి తెలంగాణ బీజేపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం
అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్- నా రాజధాని అమరావతి అని ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చరిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంట్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ
ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అమెరికాలోని ప్రముఖ ఐటీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ కోరారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ల ఆధ్వర్యంలో ఐటీ రంగం వేగంగా అడుగులు వేస్తోంది. గతంలో
ప్రజా రాజధాని అమరావతి అని, తీర్మానం ఆమోదం తర్వాత కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇకపై రాజధాని అమరావతికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. శాతవాహనులు అమరావతి నుంచే పాలన సాగించారని గుర్తుచేశారు. ఆ కాలం నాటి అమరావతి విశేషాలను బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని తెలిపారు. తెలుగువారిని గతంలో మదరాసీలు అని పిలిచేవారని,
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అజ్మతుల్లా ఖాన్, జిషాన్ అబ్దుల్, షేక్ ఫైజ్‌ను అరెస్టు చేసి, విజయవాడ తీసుకొచ్చారు. మరికాసేపట్లో వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు, విజయవాడలో ముగ్గుర్ని, హైదరాబాద్, బీహార్‌లో ఒక్కొక్కరు చొప్పున ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. మిగితా నిందితుల
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ బ్రీఫింగ్‌లో ఈ విషయాలను వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్-5ను సవరించి, సీఆర్డీఏ పరిధిలోని అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేర్చాలని మంత్రివర్గం తీర్మానించింది. భవిష్యత్తులో ఎవరూ రాజకీయ కారణాలతో రాజధానిని మార్చకుండా ఉండేందుకు అసెంబ్లీలో కూడా ప్రత్యేక తీర్మానం చేయాలని నిర్ణయించింది. గత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
వైసీపీ నేత పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తన కంపెనీకి పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరుతూ ఆయన సతీమణి పేరిట దాఖలు చేసిన పిటిషన్‌ను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. గత ప్రభుత్వ కాలంలో పి.ఎల్.ఆర్ కంపెనీ ద్వారా చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించి బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బిల్లులను వెంటనే చెల్లించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును పెద్దిరెడ్డి ఆశ్రయించారు. అయితే, ఈ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు, అర్చకులు ఆలయ మహా ద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు సిబ్బంది పూర్ణ కుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ మర్యాదలతో ఆయనను
తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. తిరుమలలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కి అదనంగా కేంద్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో పార్థసారథి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని భక్షించే వారే హిందూ ధర్మ రక్ష అని సాక్షి పత్రికలో ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. పండుగల సమయంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకోకుండా, కేవలం జగన్ బాగుండాలని మాత్రమే కోరుకోవడమే వైసీపీ నైజమని ఆరోపించారు. గత ఐదేళ్లలో హిందూ సంప్రదాయాలను గౌరవించిన దాఖలాలు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అవినాశ్‌కు సుప్రీం కోర్టు రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఏ-7గా ఉన్న అవినాశ్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ ఐటి) మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. కోర్టు అనుమతితో జరిగిన ఈ విచారణలో అవినాశ్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో కసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది వేళ కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వేడుకగా ఉగాది జరుపుకుని పంచాంగ శ్రవణం చేస్తారని తెలిపారు. మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించే గౌరవం తనకు దక్కిందన్నారు. ఆ తదుపరి కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయని తెలిపారు.రాష్ట్ర ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ఉగాది
ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ బస్సులో ప్రయాణించారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలో మీటర్ల మేర దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం కొనసాగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో షర్మిల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, వివేకా కుమార్తె సునీత మీద చేసిన వ్యాఖ్యలకు తాను చాలా బాధపడ్డానని అన్నారు. వివేకాకు గుండెపోటు వచ్చిందని సునీతానే చెప్పారని, అవినాశ్‌రెడ్డి మాట్లాడటం చాలా దారుణమని అన్నారు. అవినాశ్‌రెడ్డికి పలుకుబడి, డబ్బు
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్‌రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న అతన్ని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. మద్యం ముడుపుల వ్యవహారంలో షెల్ కంపెనీల ద్వారా భారీగా నగదు లావాదేవీలు జరిగాయని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముప్పిడి అవినాశ్‌రెడ్డి పాత్రపై
ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అందుకు అందరు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ వారికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సారథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ఆవరణలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు పంజాబ్, హరియాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నుంచి జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వుల మేరకు నేడు ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ
తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని మానూరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు. అయితే దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సష్టం చేస్తూ పిటిషన్ కొట్టివేసింది. అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామని పేర్కొంది. ఏదైనా ఉంటే సీబీఐ
దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఉరి వేసుకుంటుండగా ఎలా వేసుకోవాలని భర్త ఫ్లాన్ ఇవ్వడమే కాగా వీడియో రికార్డు చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోయినపల్లి గ్రామంలో శ్రీరామ్ శ్రీనివాస్ అనే వ్యక్తి రైల్వేలో లోకో ఫైలట్‌గా పని చేస్తున్నాడు. తన భార్య కృష్ణవేణితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1943 అక్టోబర్ 1న అప్పటి మద్రాసు ప్రావిన్స్ లో ఏలూరు ప్రాంతం దోశపాడు గ్రామంలో జన్మించారు. ఆయన ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, భార్య హేమలత ఉన్నారు. ఎన్‌ఐటి వరంగల్‌లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. ఐదు సార్లు
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా స్థానికులతో కలిసిపోయే అత్యుత్తమ డిప్లొమాట్స్ భారతీయులే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు రైసినా డైలాగ్-2026 కు ఆయన హాజరై సాంకేతికత – సుపరిపాలన – భవిష్యత్తు అనే అంశంపై కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలకు విస్తృత సేవలు అందిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువుగా ఉన్నారని తెలిపారు. ప్రత్యేకించి ఐటీ సహా వివిధ రంగాల్లో గ్లోబల్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి ఏపీఎన్నార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి జయరాం కృషి చేస్తారని అన్నారు. ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు వేమూరి రవి, సైన్స్
పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు నష్టపోవద్దనే సంకల్పానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. స్వప్రయోజనాల కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని , దానికి బానిసై చెడుకు ఉపయోగిస్తే నాశనమవుతారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని శాసనసభలో ప్రకటిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చామని, ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ పాలసీని శాసనసభలో ప్రవేశపెట్టి ప్రజల ముందు ఉంచుతున్నామని వివరించారు. దీనిపై నెలరోజుల పాటు విస్తృత చర్చ జరగాలని కోరుతున్నామని సీఎం తెలిపారు. జపాన్, దక్షిణ
అసెంబ్లీ లో అందరూ ఉంటేనే మసాలా ఉంటుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తన ఛాంబర్‌లో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసమే ఎమ్మెల్యేలు ఎన్నికవుతారని, అలాంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీకి గైర్హాజరు సబబు కాదని అన్నారు. వైసీపీలో జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ గుర్తు చేశారు. వైసీపీ సభ్యులకు నోటీసులు ఇవ్వాలంటే తగిన సమయం
రాష్ట్రంలోని ఐటీ కంపెనీలపై గత వైసీపీ ప్రభుత్వం యుద్ధం చేసిందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ 2014-19 మధ్య ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. ఫార్చ్యూన్ 500లోని ఒక కంపెనీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే వారిని సైతం వెళ్లగొట్టిందంటూ వైసీపీ గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెర్రరిజం మాదిరిగా వ్యవహరించి
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య నెలకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి సహాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయించింది. అందుకు సంబంధించి ఎన్‌ఆర్‌టీ, ఆర్టీజీఎస్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, పౌరులు సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, వేలాది మంది భారతీయులు అక్కడ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో రైతులకు సహాయంగా రైతు కోసం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం – పొనుకుమాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.10 లక్షల విలువైన బ్యాటరీ ఆధారిత వ్యవసాయ స్ప్రేయర్లు, టార్పాలిన్‌లను 350 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ
కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు చోటుచేసుకుంది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలిలో శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం సిటీన్యూరో సెంటర్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పరీక్షించిన వైద్యులు మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వివరించారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. బొత్సను రెండురోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశముందని వైద్యులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె.విజయానంద్ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన ఏపీ సచివాలయంలో నూతన సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు
నదుల అనుసంధానం చేస్తే నీటి సమస్య తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం కావాలని అన్నారు. అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు ప్రసంగించారు. నదుల అనుసంధానం చేసి తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తనదేనని, 2014-19 మధ్య రూ. 63 వేల కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. రాయలసీమ ప్రాజెక్టుకు దశ, దిశ చూపించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి
ఎస్ఎంఏ టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. కర్నూలుకు చెందిన బాలిక పునర్విక ఈ వ్యాధితో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం మరో రూ.6 కోట్లు అవసరమని, ఆ మొత్తం అందేలా చూసే బాధ్యత తనదేనని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు. తన కూతురు పునర్విక ఎస్ఎంఏ టైప్-1 వ్యాధితో బాధపడుతోందని, చికిత్స కోసం రూ.16 కోట్ల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రాధాన్య పోస్టుల్లో పనిచేస్తున్న 2018 గ్రూప్ వన్ పరీక్ష నుంచి ఎంపికైన అధికారులను ఫోకల్ పోస్ట్ నుంచి రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అధికారులందరూ వెంటనే సంబంధిత శాఖ అధిపతి వద్ద రిపోర్ట్ చేయాలని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. ఈ రోజు(బుధవారం) రాత్రి ఏడు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశంసించింది. కస్తూర్బా పాఠశాలల సమస్యలపై మంత్రి వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని ధర్మాసనం పేర్కొంది. సుమోటో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి చురుగ్గా వ్యవహరిస్తున్నారని కోర్టు ప్రశంసించింది. ధర్మాసనం ముందు విచారణ సందర్భంగా మంత్రి లోకేష్ ఇటీవల చేసిన ప్రకటనలను కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా కస్తూర్బా
రాజమండ్రిలో కల్తీ పాల తాగి నలుగురు అస్వస్థతతకు గురై చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్లపై ఉన్నారని, ఈ ఘటన బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కల్తీ పాల విషయంపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదని చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అన్నారు. మరో
సాంకేతికతలో వడివడిగా దూసుకెళ్తున్న కృత్తిమ మేథస్సు పై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ అంటే భయమేస్తుందని, వింటేనే వణుకు పుడుతోందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన పూర్వ విధ్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏఐతో మానవ సంబంధాలు మంటగలసి పోతాయోమోనని భయమేస్తోందని, వావివరుసలు ఎక్కడ మరిచిపోతారెమోనన్న
వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా- వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుందని, 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం
గూగుల్ లాంటి సంస్థల రాకతో ఎఐ డేటా హబ్ గా విశాఖ మారుతుందని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మోడీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందని తెలియజేశారు. పౌరులందరికీ లబ్ధి కలిగేలా సావరిన్ ఎఐ వినియోగానికి ప్రయత్నిస్తున్నామని, డీప్ టెక్నాలజీలో మరింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ నేతృత్వంలో సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా భూ సమస్యల పరిశీలన, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. అమరావతిలో కొత్తగా 7 సంస్థలకు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉండవల్లి క్యాపు కార్యాలయంలో 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీల పెట్టుబడులపై మాట్లాడారు. మొత్తం రూ.37, 899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.ఈ పెట్టుబడుల ద్వారా 56,692 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్,
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు కురిపించారు. నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు. గేట్స్‌పై ఉన్న గౌరవంతో మంత్రి నారా లోకేశ్‌తో సహా నలుగురు మంత్రులను సీఎం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయానికి పంపించి స్వాగతం పలికారు. సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబును చూడగానే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతి పర్యటనలో భాగంగా బిల్‌గేట్స్‌కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి బిల్‌గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలకడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో
రాజకీయ వ్యూహాలు, అసెంబ్లీ బడ్జెట్ చర్చల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, మంత్రి నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వనభోజనాల తరహాలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాజకీయ చర్చలకు తావులేకుండా, కేవలం కుటుంబ విషయాలు, పిల్లల
తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. ఈ విషయాన్ని భువనేశ్వరి తెలియజేశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ చూపిన అభిమానం మరువలేనిదని అన్నారు. సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేశ్, కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది.
ఏపీ అసెంబ్లీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. బడ్జెట్ స్వరూపం.. 2026-27 వార్షిక బడ్జెట్: రూ.3,32,205 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు మూలధన వ్యయం: రూ.53,915
పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిహారంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఈ పరిహారంతో మాకు కొంత మేలు జరుగుతుందని అనుకోవచ్చు. ఈ డబ్బుతో మేమేం చేసుకోవాలి. యాక్సిడెంట్ చేసి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఏపీ అసెంబ్లీ, మండలిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై పెట్టిన తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై శాసన మండలిలో దుమారం రాజుకుంది. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్
అమెరికాలో ఓ బాద్యత గల పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు యువతి జాహ్నవి కందుల (23) అనే యువతి కుటుంబానికి న్యాయం జరిగింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు అధికారిని విధులనుంచి తొలగించడంతో పాటు మృతురాలు కుటుంబానికి అక్కడి ప్రభుత్వం రూ.262 కోట్ల భారీ పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. 2023 జనవరిలో సియాటెల్
సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరిట జరిగిన వసూళ్ల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ కోర్టు పీటీ వారంట్ జారీ చేసింది. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. పోలీసులపై దౌర్జన్యం కేసులో బెయిల్ వచ్చినా, కొత్త వారంట్ రావడంతో ఆయన విడుదల కాలేదు. 2023లో పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున వసూలు చేసి లాటరీ టికెట్లు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. రాష్ట్రంలోని పలువురు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. మంత్రులు కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని, సత్యకుమార్‌కు బెదిరింపు లేఖలు వచ్చాయి. కందుల దుర్గేశ్‌కు బెదిరింపు రావడంతో, మంత్రి కార్యాలయ అధికారులు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తుళ్లూరు పోలీసులు ఈ బెదిరింపులు లేఖ వ్యవహారంపై దర్యాప్తు
వైసీపీ నుంచి జగన్ అవకాశం ఇవ్వకపోతే, సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తా అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనమండలి లో తన వాణి వినిపిస్తానని చెప్పారు. త్వరలోనే జగన్‌ను కలుస్తానని ఆయన పేర్కొన్నారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని అన్నారు.
విశాఖ నగరంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ స్వయంగా తెలియజేశారు. ఆయనతో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వైజాగ్, విజయవాడలలో మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం, తొలుత వైజాగ్‌లో మెట్రో నిర్మాణానికి అనుమతులు
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కాలినడకన తిరుమలకు చేపట్టిన సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తైంది. షాద్‌నగర్ నుంచి గత నెల 19న ఈ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 23 రోజుల తర్వాత తిరుమలకు చేరుకున్నారు. సుమారు 540 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి బండ్ల గణేశ్ తిరుమలకు చేరుకున్నారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బండ్ల గణేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యాత్రను పూర్తి చేయడం చాలా
ప్రపంచానికి మనమే క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సిఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్సిలు సమావేశం అయ్యారు. జిఎస్ డిపి వృద్ధిరేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు వచ్చాయని అన్నారు. ఎనర్జీపైనా దావోస్ లో ఎఐ టెక్నాలజీ గురించి ప్రధానంగా
సుప్రీం కోర్టులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఊరట దక్కలేదు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కుంభకోణంలో కసిరెడ్డి ఎన్ని కోట్లు అక్రమంగా ఆర్జించారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సూటిగా ప్రశ్నించారు. సుమారు రూ.750 కోట్ల కుంభకోణంలో 9 నెలలుగా జైల్లో ఉండటం పెద్ద సమయమేమీ కాదని అన్నారు. ఈ కేసులో ప్రధాన కుట్రదారు కసిరెడ్డి అని తెలుస్తోందని తెలిపారు. రూ.750
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ
వేంకటేశ్వర స్వామి తన ఇంటి కులదైవం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అని అన్నారు. ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగాయని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పామని సూచించారు. 2003 లో తనపై హత్యాయత్నం జరిగిందని, అదీ అలిపిరి వద్ద అని విమర్శించారు. అంతర్వేదిలో రథం
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని రాంబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసుల్లో ట్రయల్ కోర్టు
వైసిపి పాలనలో చాలా సంఘటనలు జరిగాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని సూచించారు.ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని, రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని విమర్శించారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే, ఇవి పోతే ఇంకోటి కొందామని మాట్లాడారని, అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివాడు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు జగన్ కు షాక్ ఇచ్చారు.ఇబ్రహీంపట్నం లోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లడంపై ఆంక్షలు విధించారు విజయవాడ పోలీస్ కమిషనర్. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఉదయం వేళలో విజయవాడలో భారీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దుర్గమ్మ వారిధి
జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సికె కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంలో వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు? వైసిపి నేతల ట్రాప్‌లో
మార్చి 3న సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాన్ని దాదాపు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఖగోళశాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే ఆలయ ద్వారాలను మూసివేయడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 3న ఉదయం 9:00 గంటలకే శ్రీవారి ఆలయ తలుపులను
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై విచారణ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిలో టి.శివశంకర్, తంబళ్ల రమాదేవి, టి.సి.వరుణ్ ఉన్నారు. ప్రసార మాద్యమాల్లో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని ఆ కమిటీని పార్టీ ఆదేశించింది. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్
విమాన ప్రమాదంలోమహారాష్ట్ర, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సంతాపం తెలిపింది. ఈ మేరకు తీర్మానం చేసింది. దీనికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. క్యాబినెట్ భేటీ ప్రారంభ సమయంలో ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. అజిత్ పవార్ తో, సహా ఐదుగురు చనిపోవడంపై మంత్రివర్గం విచారణ వ్యక్తం చేసింది. ఆయనతో తనకున్న పరిచయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
టీడీపీలో కార్యకర్తలే అధినేతలుగా ఉంటారని, పార్టీలో యువతకు తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. డీపీ కేంద్ర కార్యాలయం లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. అన్ని పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. మహిళలను గౌరవించాలని, 33 శాతం పదవులు వారికి కేటాయించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్నదాత కు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గా నిర్వహించిన, 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. హైకోర్టుకు సమీపంలో ప్రత్యేకంగా
నగరిలో టిడిపి ఎంఎల్ఎ గాలి భాను ప్రకాశ్ చేసింది శూన్యమని వైసిపి నేత, మాజీ ఎంఎల్ఎ రోజా విమర్శించారు. నగరిలో చంద్రబాబు పర్యటిస్తుండడంతో ఆమె మీడియాతో మాట్లాడారు. కల్యాణ మండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కాలేజీ, పార్కు, షాదీ మహల్ అన్నీ తామే కట్టామన్నారు. పేదవారికి ఇళ్లతో సహా తామే ఇచ్చామని, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్‌టైల్ పార్క్ పెడతామని టిడిపి నేతలు చెబుతున్నారని, సిఎం చంద్రబాబు
దేశ భక్తి లేని వారు, ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 25 ఏళ్లు అయిన సందర్భంగా స్మరణ, నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అనంతరం వెంకయ్యనాయుడు ప్రసంగించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు. సమాజాన్ని చెడగొట్టేలా ఉగ్రవాద ప్రసంగాలు చెబితే, వారు ప్రజా ద్రోహులేనని విమర్శలు చేశారు.
తిరుమల వేంకటేశుడి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తమ విచారణను ముగించింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీటు దాఖలు చేసే అవకాశం ఉంది. గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో ఈ కేసు విచారణ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణకు
హైదరాబాద్ కు చెందిన పి.ఎల్.రాజు కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.50 కోట్లు విరాళంగా అందించింది. శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.75 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.50 లక్షలు, శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ.25 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాజ గోపాల రాజు
నకిలీ మద్యం కేసులో అరెస్టు అయ్యి సుదీర్ఘ కాలం పాటు జైలు శిక్ష అనుభవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మరియు ఆయన సోదరుడు జోగి రాము ఎట్టకేలకు విడుదలయ్యారు. విజయవాడ కేంద్ర కారాగారంలో గత 85 రోజులుగా రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి రమేష్ సోదరులకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ మద్యం తయారీ మరియు సరఫరాకు సంబంధించిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఆదాయంలో రికార్డ్ సృష్టించింది. జనవరి 19న ఒక్క రోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం సాధించింది. ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఆదాయ రికార్డ్‌ను నెలకొల్పింది. జనవరి 19న ఆర్టీసీ బస్సుల్లో అత్యధికంగా 50.6 లక్షల మంది ప్రయాణించారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా సొంతూళ్ల నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా అదనపు బస్సులను
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 23న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ మిథున్ రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. ఈ లిక్కర్ స్కామ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో భారీఎత్తున అక్రమాలు
ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా, నికర హరిత ఇంధన ఎగుమతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నామని సీఎం పేర్కొన్నారు. ఈ దిశగా మరో చరిత్రాత్మక ముందడుగు పడిందని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాకినాడలో ఏఎం గ్రీన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్
కనుమ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే కనుమ అనేది రైతు జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని ఆయన పేర్కొన్నారు. తమ వ్యవసాయానికి సహకరిస్తున్న పశువుల పట్ల కృతజ్ఞత వ్యక్తపరచే రోజు కనుమ అని తెలిపారు. ఈ పండుగ కేవలం సంప్రదాయంగా జరుపుకునే వేడుక మాత్రమే కాదని,
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం తేదీ ఖరారైంది. ఈ నెల 30న ఢిల్లీలోని సేవా భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు ప్రాజెక్టు అప్రైజల్ ఆర్గనైజేషన్ (పీఏవో), సీడబ్ల్యూసీ సమావేశ నోటీసును జారీ చేసింది. పోలవరం ఉ నల్లమలసాగర్ ప్రాజెక్టు సహా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల నిర్వహణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అశేష జనంతో పల్లె మొత్తం కిక్కిరిసింది. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సహా ఆయన కుటుంబీకులంతా, నందమూరి కుటుంబీకులు కలిసి ఆనందంగా తిలకించారు. గ్రామ ఆటల పోటీలలో నారా దేవాన్ష్ అత్యుత్సాహంగా పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. పోటీలలో గెలుపొందినవారికి బహుమతులను ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌లు అందజేశారు. ప్రజల వద్ద సమస్యలను సిఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పురాతన జపనీస్ సమురాయ్ యుద్ధ కళ అయిన కెంజుట్సు లో అధికారికంగా ప్రవేశం పొందిన విషయం తెలిసిందే. ఈ క్రీడలో ఉన్నతస్థాయిని సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ మరోవైపు సినిమా కెరీర్ కొనసాగిస్తూ క్రమశిక్షణ, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. పవన్ సాధించిన విజయం ద్వారా వృత్తిపరమైన
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన స్వగ్రామం నారా వారి పల్లికు చేరుకున్నారు. రాజధాని అమరావతి నుంచి హెలికాఫ్టర్‌లో ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు జిల్లా ఉన్నతాధికారుల తోపాటు స్థానిక నేతలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి ఈ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సమతుల్యంగా నడిపించేందుకు 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ జారీ చేశారు. ఈ మార్పులు జిల్లాస్థాయి పరిపాలనా శాఖల్లో కీలక బాధ్యతలను పునర్విభజన చేసేలా ఉన్నాయి. ఈ బదిలీల్లో పలు ముఖ్యమైన మార్పులు ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా– శ్రీవాస్ నుపుర్
హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా భువనేశ్వరిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025 సౌత్‌జోన్ ప్రదానం చేసింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె చూపిన దూరదృష్టి నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టంపై ఆమె కల్పించిన
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైన విషయం తెలిసిందే. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్‌ను లాంఛ్ చేయనుంది. ఏపీలోని శ్రీహరి కోటలోని లాంచింగ్ ప్యాడ్ నుంచి 12న ఉదయం 10.17 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్డీవో రూపొందించిన ఈఓఎస్-ఎన్1 శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తిరుమల
గుంటూరుకు చెందిన హరి కృష్ణారెడ్డి కరసాని అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో అదృశ్యమవడం కలకలం రేపుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వెళ్లిన తెలుగు విద్యార్థి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కృష్ణారెడ్డి హ్యూస్టన్‌లో ఉంటున్నారు. క్రిస్మస్ సెలవులు రావడంతో అలాస్కాకు వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 22, 2025న ఒంటరిగానే హరి అలాస్కా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. డెనాలి సమీపంలోని
భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని, భారతీయ వంటలు అందరూ తినాలని దేశ ప్రజలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. విశాఖపట్నంపై తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Email Us: info@mytelugunri.com
Contact: 9123456789
My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.
Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.
Email: editor.mytelugunri@gmail.com
Contact: +91-7893860141
US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105
Email: support@mytelugunri.com
My Telugu NRI @2025. All Rights Reserved.